punch dialogues
-
డైలాగుల్లో తాతకు సరిసాటి
-
రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు
సాక్షి, అనంతపురం జిల్లా: రాప్తాడు ‘సిద్ధం’ సభ పంచ్ డైలాగ్‌లతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పలు డైలాగ్స్‌ను అందిపుచ్చుకున్న సీఎం జగన్.. రాప్తాడు ‘సిద్ధం’సభలో ప్రతిపక్షాలపై అస్త్రాలుగా ప్రయోగించారు. ‘‘విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ.. నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో జన సముద్రం చూడొచ్చు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు. ఎగ్గొట్టేవాడు.. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు’’ అంటూ చంద్రబాబుకు సీఎం జగన్ చురకలు అంటించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పంచ్ డైలాగ్‌లు విసిరారు. 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు ఇచ్చాం. ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశా. మీరు 2, 3 సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు మీకు, రాష్ట్రానికి జరుగుతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ .. నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో జన సముద్రం చూడొచ్చు చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు ఎగ్గొట్టేవాడు .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి త్రాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి కౌరవ సేన లాంటి టీడీపీ కూటమికి ఎదురుగా ఉన్నది అభిమన్యుడు కాదు గాండీవధారి అర్జునుడు నా వెనకాల శ్రీకృష్ణుడి లాగా ఉన్నది ప్రజలు సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడేవాడే నాయకుడు చెప్పాడంటే చేస్తాడంతే అని నమ్మాలి ప్రజలు 650 హామీలిచ్చి మానిఫెస్టో మాయం చేసినవాడు బాబు కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు చేసింది ఏదైనా ఎక్కడైనా కనిపిస్తోందా..? మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం చదవండి: ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’ -
కాంగ్రెస్ పై కేసీఆర్, కేటీఆర్ సినిమా డైలాగులు..
-
జగన్‌వి పంచ్‌లు కావు పవన్.. అంతకు మించి!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వదలిన డైలాగులు పంచ్ కాదు.. పంజా విసిరినట్లుగా ఉన్నాయి. గత పది రోజులుగా చెలరేగిపోతున్న పవన్ కల్యాణ్‌కు ఎక్కడ దిగాలో.. అక్కడ దిగేలా జగన్ మేకులు కొట్టారు. వారాహి వాహనాన్ని ఆయన లారీతో పోల్చారు. ఆయన చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని, అసలు ఆయనకు ఓ పద్దతి.. పాడు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. మన్యం జిల్లా కురుపాం వద్ద జరిగిన బహిరంగ సభలో అమ్మ ఒడి కార్యక్రమం కింద విద్యార్దుల తల్లుల ఖాతాలలో డబ్బులు వేసిన తర్వాత మాట్లాడుతూ రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. తొలిసారిగా పవన్ ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో చేస్తున్న యాత్రకు బదులు ఇచ్చారు. CM YS Jagan About Educational Reforms | Ammavodi | Nadu Nedu | Kurupam#CMYSJagan #EducationalReformsInAP #sakshitv pic.twitter.com/DYTm6NfDL2 — Sakshi TV Official (@sakshitvdigital) June 28, 2023 పవన్ తన యాత్రలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే.. జగన్ ఎక్కడా అసభ్య పదాల్ని వాడలేదు. పవన్ వాడిన అభ్యంతరకర పదాలను కొన్నిటిని ఉటంకిస్తూ, తాము అలా మాట్లాడలేమని చెప్పి హుందాగా వ్యవహరించారు. పవన్ బూతులు తిడుతున్నారు కదా అని జగన్ రెచ్చిపోకపోవడం ఒక ప్రత్యేకతగా భావించాలి. పవన్ చేస్తున్న ప్రసంగాలు అన్నింటింకీ జగన్ ఒక్క వ్యాఖ్యతో ట్విస్టు ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఇదిరా మా నాయకుడు 🔥 We are proud of you Jagan anna ❤️ #YSJaganAgain #YSRCP pic.twitter.com/XLmjf3geR9 — Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) June 28, 2023 ✍️ పవన్ కల్యాణ్ మాదిరి నలుగురు భార్యలను మార్చి.. పవిత్రమైన వివాహ వ్యవస్థను పాడుచేయలేమని జగన్ అన్నారు. తాను అచ్చమైన సనాతనవాది అయినట్లు, హిందూ సంప్రదాయాలను నిష్టగా ఆచరించే వ్యక్తి మాదిరి నటించే పవన్ కల్యాణ్‌కు ఈ వ్యాఖ్య ఘాటు నషాళానికి అంటి ఉండాలి. దీనికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. లేకుంటే గతంలో మాదిరి మీరు కూడా ముప్ఫై పెళ్లిళ్లు చేసుకోండని బహిరంగ సభలలో చెబితే నవ్వుల పాలవుతారు. ఈ రకంగా పవన్‌ను జగన్ దెబ్బతీశారు. CM Jagan Non Stop Punches on Pawan Kalyan Varahi Yatra#cmjagan #pawankalyan #varahiyatra #Kurupam #ammavadi #SakshiTV pic.twitter.com/vQppkaVE1j — Sakshi TV Official (@sakshitvdigital) June 28, 2023 ✍️ రాజకీయాలలో ప్రత్యర్ధుల బలహీనతలపై కొట్టడం ఒక ఆర్ట్. ఆ విషయంలో జగన్ నైపుణ్యం సాధించే దిశలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను.. ఇద్దరినీ ఆత్మరక్షణలో పడవేస్తున్నారు. చంద్రబాబుకు అబద్దాలు ఆడడం, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం వీక్ నెస్ . అలాగే పవన్ కళ్యాణ్ కు పెళ్లిళ్ల వ్యవహారం ప్రధాన వీక్ నెస్ .ఈ మధ్య బూతులు మాట్లాడడం కూడా ఆయనకు బలహీనతగా కనిపిస్తోంది. వీరిద్దరిని కలిసి ఈ విషయంలో జగన్ ఆడుకున్నారని చెప్పాలి. ✍️ కురుపాంలో జగన్ ప్రసంగం చూడండి. పవన్ కల్యాణ్‌ను ఆయన చంద్రబాబు దత్తపుత్రుడుగా అభివర్ణిస్తుంటారు. అదే పేరుతో ఆయన ఉచ్చరిస్తుంటారు. ‘‘దత్తపుత్రుడు మామూలుగా మాట్లాడడు. ఊగిపోతుంటాడు. తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు.తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు. నిలకడా లేదు. వారిలో నలుగురిని పెళ్లి చేసుకుని భార్యలను మార్చలేం’’ అని జగన్ వ్యాఖ్యానించినప్పుడు సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. అలాగే.. ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడిలా బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్ అని జగన్ కొద్ది పదాలతో పవన్ గాలి తీసేశారు. తన ఉపన్యాసంలో పనికిమాలిన పంచ్ డైలాగులు ఉండవని అంటూ తమది సామాజిక న్యాయం, ఓదార్పు యాత్ర పునాది అని జగన్ చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నది, విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు, గిరిజనులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నది ఆయన తన సభలో ప్రజలకు వివరించారు. గతంలో చంద్రబాబు నాయుడు టరమ్ పూర్తి అయ్యే సమయంలో కొద్ది నెలలు ఒక గిరిజనుడికి మంత్రి పదవి ఇస్తే, జగన్ ఏకంగా తొలి రోజు నుంచే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గిరిజనులను గౌరవించారు. ఆ విషయాన్ని ప్రజలకు ఆయన గుర్తు చేస్తున్నారు. CM YS Jagan Satires On Pawan Kalyan | Package Star Pawan Kalyan#CMYSJagan #PackageStarPawanKalyan #sakshitv pic.twitter.com/H9TWPGCboC — Sakshi TV Official (@sakshitvdigital) June 28, 2023 ✍️ పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయన నిజంగానే ఎక్కడకు వెళితే అక్కడ తాను చిన్నప్పుడు తప్పిపోయాననో, అక్కడే పుట్టాననో ఇలా ఏవేవో చెప్పి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఇప్పటికి నాలుగు పట్టణాలలో ఆయన తానిక్కడే పుట్టానని అన్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవన్ని ఆయన పరపతిని దెబ్బతీస్తాయి. అలాగే ముఖ్యమంత్రిని , వైఎస్సార్సీపీ రౌడీలని, బాబాయిని చంపినవారని, అసలు ప్రభుత్వంలో ఎవరికి ఏమీ జరగలేదని , కాపుల రిజర్వేషన్ ఇవ్వలేదని.. గుడ్డలూడదీసి కొడతామని, వెధవలు అంటూ రకరకాల బూతుపదాలను వాడుంటారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. పోనీ తన గెలుపు మీద ఆత్మ విశ్వాసం ఉందా? అంటే అదీ లేదు. CM Jagan New Name to TDP Party | CM Jagan Satires on TDP and Yellow Media#CMJagan #TDP #PawanKalyan #Chandrababu #SakshiTV pic.twitter.com/4FToGFMcZU — Sakshi TV Official (@sakshitvdigital) June 28, 2023 ✍️ తాను ఓడిపోతానని తెలుసునని, తనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని చెప్పి తన అభిమానులను నిరాశపరచి, తెలుగుదేశం పార్టీ వారిని సంతోషపెడుతున్నారు. పవన్ కల్యాణ్ తన పార్టీకోసం తిరుగుతున్నారా? లేక టీడీపీ కోసం టూర్ చేస్తున్నారా? అనే అనుమానం ప్రజలకు వస్తుంటుంది. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్‌కు ఒక ఎజెండా లేదని, ఆయన వాడిన పదాలను సభ్యసమాజం అంగీకరించలేదని చెప్పడానికి జగన్ ఈ సభను వినియోగించుకున్నారు. అలాగే అసలు సమాజం పవన్ వరుస పెళ్లిళ్లను ఆమోదించదని చెప్పడం ద్వారా ఆయనపై వ్యతిరేకత పెరిగేలా జగన్ యత్నించారు. ఇదే పవన్ బలహీనతపై పంజా విసరడం అంటే..తానేదో పంచ్ డైలాగులు చెబుతున్నానని మురిసిపోతున్న సమయంలో జగన్ పంజాదెబ్బకు పవన్ విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు..
-
Punch Dialogues: రోశయ్య చెణుకు విసిరితే..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రోశయ్య వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా పేరు గడించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు. తన సహజశైలితో, ఎలాంటి మొహమాటం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రస్తావన వచ్చిదంటే చాలు.. రోశయ్య మాటలు తూటాల్లా పేలేవి. చదవండి: నింగికేగిన నిగర్వి ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను రోశయ్య కించపర్చారంటూ నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేశారు. రోశయ్యకు కోపం ఎక్కువైందని, ఎన్టీఆర్‌ను కించపర్చారని తప్పుపట్టారు. దానిపై స్పందించిన రోశయ్య.. ‘‘నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. అసెంబ్లీలో పరిస్థితి, టీడీపీ వాళ్ల తీరు చూసి ఈ సభకు ఏం ఖర్మ పట్టిందన్న ఆవేదనతో కోపం వచ్చింది. అయినా ఎన్టీఆర్‌ను చంద్రబాబు, టీడీపీ ఎంతగా గౌరవించారో అందరికీ తెలుసు’’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..? 2004–09 మధ్య రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు ఏదో విషయంలో పోలీసులకు దొరికిపోయాడంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న రోశయ్య నెమ్మదిగా లేచి..‘‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు నాకు, ఎన్టీ రామారావుకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని చురక వేశారు. ఆ దెబ్బకు తెలుగుదేశం శిబిరం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆయన వైఎస్ కాదు.. ఓ యస్ వైఎస్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రోశయ్య దగ్గరికి వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారని వారు రోశయ్యకు చెప్పగా.. ‘‘ఆయన ఇస్తారండి.. ఆయన వైఎస్ కాదు.. ఓయస్.. ఎవరైనా ఏదైనా కావాలని వెళితే ఆయన కాదనరు. ఆయన ఇచ్చే హామీలను అమలు చేసేందుకు నా తలప్రాణం తోకకు వస్తోంది..’’ అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. వెన్నుపోటు పొడిచేవాడ్ని మరి.. మరోసారి రోశయ్య తెలివితేటలు సరిగా లేవంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. దానిపై రోశయ్య స్పందిస్తూ.. ‘‘నాకు తెలివితేటలుంటే ఇలా ఉంటానా? నన్ను నమ్మిన రాజశేఖరరెడ్డిని ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని, విజయభాస్కర్‌రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచేవాడిని..’’ అంటూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనను గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు అవాక్కై కిమ్మనకుండా కూర్చుండిపోయారు. -
ఆయన మాటలను ఇట్టే గుర్తుపట్టేయొచ్చు..!
‘గొంతులో ఉన్న మాట అయితే నోటి చెప్పగలం.. కానీ మనసులో ఉన్న మాట..కేవలం కళ్లతోనే చెప్పగలం’.. అంటూ నువ్వేకావాలిలో తరుణ్, రీచాతో చెప్పినా.. ‘నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20నాకు, 80వాడికా.. ఇంకో పదిహేను వేసి ఈ నాన్నను పాస్ చేయలేవా అమ్మా’.. అంటూ ప్రకాష్ రాజు కంటతడితో చెప్పినా.. ‘బాగుండటం అంటే బాగా ఉండటం కాదు అంటూ నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం’..అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా చెప్పినా.. వీటిలో సగటు ప్రేక్షకుడు చూసేదీ, ఆస్వాదించేదీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసిన మాయాజాలం. ఒక డైలాగ్ వింటే అది ఎవరి కలంలోంచి జారిపడిందో చెప్పడం కష్టమే.. కానీ ఆ పదాలు త్రివిక్రమ్ కలంలోంచి వస్తే మాత్రం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ మాటలు మదిలో నాటుకుపోతాయి. త్రివిక్రమ్ తన ప్రాసలతో సినిమాలను ఓ స్థాయిలోకి తీసుకెళ్తారు. వెండితెరపై ఒక్కోసారి ఆయన వేసే మంత్రం పనిచేయకపోయినా.. బుల్లితెరపై మాత్రం టీఆర్పీ రేటింగ్స్‌లో రికార్డులు క్రియేట్చేస్తాయి. అతడు, ఖలేజా ఇప్పటికీ బుల్లితెరపై సెన్సేషనే. మాటల తూటాలను తన మెదడులో దాచిపెట్టుకున్న త్రివిక్రముడి పుట్టినరోజు నేడు (నవంబర్ 7). ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఫేమస్ డైలాగ్స్ల్లోంచి కొన్నింటిని ఓ సారి చూద్దాం. ‘వంట రుచి తినే దాకా తెలియదు.. బుక్ గొప్పదనం చదివేదాకా తెలియదు.. ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించేవాళ్లను కోల్పేయేదాకా తెలియదు’.. ‘నిజం చెప్పకపోవడం అబద్దం.. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’ .. ‘దేవుడు చాలా దుర్మార్గుడు..కళ్లున్నాయని సంతోషించేలోపే కన్నీళ్లున్నాయని గుర్తుచేస్తాడు’ .. ‘లవ్ చేసే అంతా లక్జరీ లేదు.. వదిలేసే అంతా లేవలూ లేదు’.. ‘మనం బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి.. కష్టాల్లోన్నప్పుడు విలువల గురించి మాట్లాడుకూడదు’.. ‘పాలిచ్చి పెంచిన వాళ్లకి.. పాలించడం ఒక లెక్కా’.... ఇలా ఏ డైలాగ్‌ను తీసుకున్న త్రివిక్రమ్ గుర్తుకురావాల్సిందే. త్రివిక్రమ్ సినిమాల్లోని ప్రతీ మాట ఒక ఆణిముత్యమే. త్రివిక్రమ్ వేదికలపై మాట్లాడటం చాలా అరుదు. అయితే తివిక్రమ్ వేదిక ఎక్కితే.. ఏం మాట్లాడుతారని అభిమానులు ఎదురుచూస్తు ఉంటారు. ఆయన ప్రసంగం ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. ఒక హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక డైరెక్టర్‌కు ఉండటమనే విషయం కొందరికే సాధ్యం. అందులోనూ త్రివిక్రమ్ శైలిని ఇష్టపడే అభిమానులెందరో ఉన్నారు. త్రివిక్రమ్ ఇంకెన్నో ఆణిముత్యాల్లాంటి మాటలను ప్రేక్షకులకు అందించాలి.. అందిస్తూనే ఉండాలని ఆశిద్దాం. -
హైపర్ ఆది.. తాట తీస్తా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ కమెడియన్ హైపర్ ఆదిపై నటి శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ కామెడీ షో స్కిట్లో ఆది వేసిన సెటైర్లపై ఫేస్బుక్ లైవ్‌లో ఆమె స్పందించారు. ముందుగా ఆదిపై ప్రశంసలు గుప్పించినట్లే గుప్పించిన ఆమె.. తర్వాత తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. తరిమి తరిమి కొడతానంటూ, తాట తీస్తానంటూ హెచ్చరించారు. సహించబోను... ‘ఆది గారూ.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మంచి రచయిత. మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్ కూడా ఇస్తున్నారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు. ఘాటు వ్యాఖ్యలు... తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడాడని, ‘షర్ట్ విప్పరా.. ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది’ ఓ డైలాగ్ చెప్పాడని ఆమె తెలిపారు . ‘నేను తెలిపింది నిరసన.. అది సెక్సీ నెస్ కాదు. ఆది.. నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు... అంటూ ఘాటు పదజాలమే వాడారామే. తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు. -
డై..లాగి కొడితే....
సినిమా : అత్తారింటికి దారేది రచన - దర్శకత్వం: త్రివిక్రమ్ గౌతమ్ నంద (పవన్‌కల్యాణ్) తన అత్త కూతురైన ప్రమీలను (ప్రణీత) ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వన్ ఫైన్ డే అత్త కూతురికి తన ప్రేమ విషయం చెబుదామని వెళతాడు. కానీ, అనుకొన్నదొక్కటి అయినదొకటి. గౌతమ్ రూమ్‌లోకి ఎంటరవ్వగానే తాను భరత్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తనకు రేపు పెళ్లి జరగబోతోంది, అది చెడగొట్టి భరత్‌ని తీసుకు రమ్మని అసలు మ్యాటర్ చెబు తుంది ప్రమీల. ఆ షాక్ నుంచి తేరుకున్న గౌతమ్, ఆమె ప్రియుణ్ణి తీసుకు రావడానికి వెళతాడు. భరత్ తండ్రి సిద్ధప్ప (కోట శ్రీనివాస రావు) పెద్ద ఫ్యాక్షనిస్టు. అతని కొడుకుని కిడ్నాప్ చేయడమంటే మాటలు కాదు. కానీ, గౌతమ్ అడ్డమొచ్చినవారిని రప్ఫాడించి, భరత్‌ను తన వెంట తీసుకెళుతూ కోటకు వార్నింగ్ ఇస్తాడు. ‘చూడప్పా సిద్ధప్పా.. నేను సింహం లాంటోణ్ణి. అది గెడ్డం గీసుకోలేదు.. నేను గీసుకుంటా. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్’. అని ఆ పంచ్ డైలాగ్‌తో హెచ్చరించి మరీ వెళతాడు. డైలాగ్ అదిరింది కదూ! -
డై..లాగి కొడితే....
సినిమా : మిర్చి దర్శక-రచయిత: కొరటాల శివ హీరో ఇంట్రడక్షన్ సీన్ అది. అర్ధరాత్రి ఓ అమ్మాయి కాపాడమన్నట్లు హీరో దగ్గరకొచ్చింది. హీరోయిజమ్ చూపించాలంటే విలన్లను చితక్కొట్టాలి. ప్రభాస్ ‘మిర్చి’లో అటువంటి ఫార్ములా సీన్స్, ఫైట్స్ లేవు. దర్శక-రచయిత కొరటాల శివ కొత్తగా ఆలోచించారు. హీరో డైలాగ్ కొడుతుంటే.. విలన్స్ ఫైట్‌ను విజువలైజ్ చేసుకున్నట్టు చూపించారు. సీన్ ఎండింగ్లో ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని పంచ్ డైలాగ్ చెబుతూ గాల్లో ఎగిరి కాలితో గట్టిగా కార్ బ్యానెట్ మీద ప్రభాస్ ఒక్క కిక్ ఇస్తాడు. స్మాష్.. కటౌట్ దెబ్బకు కారు టైర్ ఊడింది. విలన్స్‌లో మార్పు వచ్చింది. అప్పుడు హీరోగారు ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే మరో డైలాగ్ చెబుతాడు. ఈసారి అమ్మాయి కూడా ఫ్లాట్.. ‘ఐ లవ్ యూ’ చెప్పకుండానే ప్రేమలో పడింది. -
విద్యార్ధి తీరుతో ఉలిక్కి పడ్డ నేతలు
-
డైలాగ్ పవర్ ను పెంచేసిన బాలయ్య