హైపర్‌ ఆది.. తాట తీస్తా - శ్రీరెడ్డి | Sri Reddy Fires on Hyper Aadi over Jabardasth Skit- Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 1:27 PM | Last Updated on Mon, May 28 2018 2:47 PM

Actress Sri Reddy Fires On Hyper Aadi - Sakshi

నటి శ్రీ రెడ్డి.. హైపర్‌ ఆది

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ యంగ్‌ కమెడియన్‌ హైపర్‌ ఆదిపై నటి శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ కామెడీ షో స్కిట్‌లో ఆది వేసిన సెటైర్లపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె స్పందించారు. ముందుగా ఆదిపై ప్రశంసలు గుప్పించినట్లే గుప్పించిన ఆమె.. తర్వాత తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. తరిమి తరిమి కొడతానంటూ, తాట తీస్తానంటూ హెచ్చరించారు. 

సహించబోను... ‘ఆది గారూ.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మంచి రచయిత. మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్‌ కూడా ఇస్తున్నారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్‌ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు.
 
ఘాటు వ్యాఖ్యలు... తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడాడని, ‘షర్ట్‌ విప్పరా.. ఇంటర్నేషనల్‌ మీడియా కవర్‌ చేస్తుంది’ ఓ డైలాగ్‌ చెప్పాడని ఆమె తెలిపారు . ‘నేను తెలిపింది నిరసన.. అది సెక్సీ నెస్‌ కాదు. ఆది.. నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు... అంటూ ఘాటు పదజాలమే వాడారామే. తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్‌ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement