శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట | Sri Reddy Granted Conditional Bail by High Court | Sakshi
Sakshi News home page

శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట

Published Tue, Feb 25 2025 11:25 AM | Last Updated on Tue, Feb 25 2025 1:00 PM

Sri Reddy Granted Conditional Bail by High Court

సాక్షి, అమరావతి: సినీనటి మల్లిడి విమల అలియాస్‌ శ్రీరెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. వి­శా­ఖ నాల్గో పట్టణ పోలీసులు నమోదు చేసి­న కేసులో ఆమెకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. వా­రంలో ఒక రోజు సంబంధిత పోలీస్‌­స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావా­లంది. 

అలాగే కర్నూలు, గుడివాడ, నెల్లిమర్ల తదితర పోలీస్‌స్టేషన్లలో శ్రీరెడ్డిపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల ఆమె విషయంలో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొ­న­కంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులి­చ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలనుద్దేశించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టా­రంటూ శ్రీరెడ్డిపై  పలు పోలీస్‌­స్టేషన్లలో కేసులు న మోదయ్యాయి. 

ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ఆమె ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖ­లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యా­జ్యా­లు సోమవారం విచారణకు రాగా.. శ్రీరెడ్డిపై చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, అందువల్ల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచా రణార్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశా­రు. అనకాపల్లి పోలీసులు నమో­దు చేసిన కేసు­లో పూర్తి వివరాలను కోర్టు ముందుంచా­లని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement