
డై..లాగి కొడితే....
సినిమా : మిర్చి
దర్శక-రచయిత: కొరటాల శివ
హీరో ఇంట్రడక్షన్ సీన్ అది. అర్ధరాత్రి ఓ అమ్మాయి కాపాడమన్నట్లు హీరో దగ్గరకొచ్చింది. హీరోయిజమ్ చూపించాలంటే విలన్లను చితక్కొట్టాలి. ప్రభాస్ ‘మిర్చి’లో అటువంటి ఫార్ములా సీన్స్, ఫైట్స్ లేవు. దర్శక-రచయిత కొరటాల శివ కొత్తగా ఆలోచించారు. హీరో డైలాగ్ కొడుతుంటే.. విలన్స్ ఫైట్‌ను విజువలైజ్ చేసుకున్నట్టు చూపించారు. సీన్ ఎండింగ్‌లో ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని పంచ్ డైలాగ్ చెబుతూ గాల్లో ఎగిరి కాలితో గట్టిగా కార్ బ్యానెట్ మీద ప్రభాస్ ఒక్క కిక్ ఇస్తాడు.
స్మాష్.. కటౌట్ దెబ్బకు కారు టైర్ ఊడింది. విలన్స్‌లో మార్పు వచ్చింది. అప్పుడు హీరోగారు ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే మరో డైలాగ్ చెబుతాడు. ఈసారి అమ్మాయి కూడా ఫ్లాట్.. ‘ఐ లవ్ యూ’ చెప్పకుండానే ప్రేమలో పడింది.