సాక్షి, అనంతపురం జిల్లా: రాప్తాడు ‘సిద్ధం’ సభ పంచ్ డైలాగ్‌లతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పలు డైలాగ్స్‌ను అందిపుచ్చుకున్న సీఎం జగన్.. రాప్తాడు ‘సిద్ధం’సభలో ప్రతిపక్షాలపై అస్త్రాలుగా ప్రయోగించారు. ‘‘విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ.. నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో జన సముద్రం చూడొచ్చు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు. ఎగ్గొట్టేవాడు.. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు’’ అంటూ చంద్రబాబుకు సీఎం జగన్ చురకలు అంటించారు.
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పంచ్ డైలాగ్‌లు విసిరారు. 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు ఇచ్చాం. ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశా. మీరు 2, 3 సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు మీకు, రాష్ట్రానికి జరుగుతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
- విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం
- రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం
- సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ .. నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో జన సముద్రం చూడొచ్చు
- చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు
- ఎగ్గొట్టేవాడు .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు
- మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు
- ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి
- సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి
- త్రాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి
- కౌరవ సేన లాంటి టీడీపీ కూటమికి ఎదురుగా ఉన్నది అభిమన్యుడు కాదు గాండీవధారి అర్జునుడు
- నా వెనకాల శ్రీకృష్ణుడి లాగా ఉన్నది ప్రజలు
- సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు?
- కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడేవాడే నాయకుడు
- చెప్పాడంటే చేస్తాడంతే అని నమ్మాలి ప్రజలు
- 650 హామీలిచ్చి మానిఫెస్టో మాయం చేసినవాడు బాబు
- కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు చేసింది ఏదైనా ఎక్కడైనా కనిపిస్తోందా..?
- మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు
- దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు
- ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు
- మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు
- పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు
- సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం
Comments
Please login to add a commentAdd a comment