మన ప్రపంచాలు వేరు.. ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసిన హీరోయిన్‌ | Richa Gangopadhyay Shares Emotional Video | Sakshi
Sakshi News home page

Richa Gangopadhyay: పెళ్లితో సినిమాలకు దూరమైన హీరోయిన్‌.. ఎమోషనల్‌ వీడియో..

Published Sun, Sep 17 2023 4:53 PM | Last Updated on Sun, Sep 17 2023 4:56 PM

Richa Gangopadhyay Shares Emotional Video - Sakshi

మిర్చి హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ గుర్తుందా? లీడర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రిచా. తొలి చిత్రంతోనే క్లిక్‌ అయిన ఈ బ్యూటీ మిర్చి, నాగవల్లి, సారొచ్చారు.. ఇలా పలు సినిమాలు చేసింది. కానీ తర్వాత పెద్దగా సక్సెస్‌ లేకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. 2013లో భాయ్‌ సినిమాలో చివరిసారిగా నటించిన ఈ బ్యూటీ 2019లో ప్రియుడు జో లాంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు.

తాజాగా రిచా గంగోపాధ్యాయ సోషల్‌ మీడియాలో ఆసక్తికర వీడియో పోస్ట్‌ చేసింది. 'నాలుగేళ్ల క్రితం ఓ అద్భుతమైన వ్యక్తికి నేను ఓకే చెప్పాను. మా ఇద్దరిదీ రెండు వేర్వేరు ప్రపంచాలు. మా ప్రత్యేకమైన మార్గాలు.. ప్రేమ, పరస్పర గౌరవం, అందమైన కలలు సాకారం చేసుకునే క్రమంలో సంపూర్ణంగా కలిసిపోయాయి. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన జీవితాన్ని గడిపాం.

మన భవిష్యత్తు మరింత సుమధురంగా ఉండబోతుంది. నీ జీవితాన్ని నాతో పంచుకున్నందుకు థాంక్యూ జో.. హ్యాపీ ఫోర్త్‌ యానివర్సరీ..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. రెండు భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అనేందుకు మీరే ప్రత్యక్ష ఉదాహరణ.. పెళ్లిరోజు శుభాకాంక్షలు అని రిచాకు అభిమానులు విషెస్‌ చెప్తున్నారు.

చదవండి: పరువు తీసుకున్న తేజ.. ఆవిడే ఎలిమినేట్‌ అయిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement