Richa Gangopadhyay Shares Beautiful Moments With Her Son - Sakshi
Sakshi News home page

Richa Gangopadhyay: 'మిర్చి' హీరోయిన్‌ ఇప్పుడెలా ఉంది? భర్త,కొడుకును చూశారా?

Published Tue, May 16 2023 6:30 PM | Last Updated on Tue, May 16 2023 7:12 PM

Richa Gangopadhyay Shares Beautiful Moments With Her Son - Sakshi

లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిచా ఆ తర్వాత ‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించింది. ప్రభాస్‌ సరసన నటించిన మిర్చి సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సక్సెస్‌ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది.

సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది.2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించిన రీచా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్‌ జో లాంగేల్లాను ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్‌ అయిపోయింది. 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన రీచా ప్రస్తుతం కంప్లీట్‌ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.

తాజాగా మథర్స్‌ డే సందర్భంగా కొడుకుతో ఉన్న స్పెషల్‌ మూమెంట్స్‌ని షేర్‌ చేసుకుంది.అమ్మగా మారి రెండు సంవత్సరాలు అవుతోంది. తల్లి కావడం గొప్ప బహుమతి అంటూ కొడుకుతో దిగిన పలు ఫోటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement