ఏడడుగులకు రెడీ | Richa Gangopadhyay engaged to college sweetheart Joe Langella | Sakshi
Sakshi News home page

ఏడడుగులకు రెడీ

Published Thu, Jan 17 2019 12:31 AM | Last Updated on Thu, Jan 17 2019 9:21 AM

Richa Gangopadhyay engaged to college sweetheart Joe Langella - Sakshi

సగం పెళ్లి చేసుకున్నారు కథానాయిక రిచా గంగోపాధ్యాయ్‌. అదేనండీ ఆమె నిశ్చితార్థం జరిగిందని సరదాగా అలా చెబుతున్నాం. ఈ విషయాన్ని రిచా అధికారికంగా వెల్లడించారు. ‘‘నా నిశ్చితార్థం పూర్తయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా కాబోయే భర్త జోను నేను ఓ బిజినెస్‌ స్కూల్‌లో కలుసుకున్నాను. రెండేళ్లు అద్భుతంగా గడిచాయి. నా జీవితంలో నెక్ట్స్‌ ఫేజ్‌(పెళ్లి తర్వాతి జీవితం) గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పెళ్లి తేదీ నిర్ణయించలేదు’’ అని పేర్కొన్నారు రిచా. ‘లీడర్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రిచా ఆ తర్వాత ‘నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి’ వంటి సినిమాల్లో నటించారు. 2013లో ‘భాయ్‌’ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ‘ఇక సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా’ అని ప్రకటించి ఆమె అమెరికా వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement