Joe
-
ఇంతకీ.. ఎవరీ 'జో అలెన్ వీగెల్'!?
నమ్మకాన్ని పెనవేసుకుని పుట్టే మోసానికి.. కేవలం బలి తీసుకోవడమే తెలుసు. దానికి చట్టమంటే మహా అలుసు. చేసింది ఎంతటి ఘోరమైనా.. పరపతి నీడలో.. పలుకుబడి ముసుగులో.. శిక్షాస్మృతిని సైతం వెక్కిరిస్తుంది. అసలు ఈ నేరచరిత నేటిది కాదు. నేటితో ఆగేదీ కాదు. అలా అని, ఏదొక ప్రాంతానికే పరిమితమూ కాదు. ఎందుకంటే.. అది మానవసమూహంలో మంచితనం ముసుగుతో తిరుగుతుంది. ఎదుటివారి అవసరాన్ని, అమాయకత్వాన్ని, ఆశల్నీ, ఆలోచనలనీ.. అన్నింటినీ అంచనా వేసి, పొందాల్సిన లాభాన్ని పొందాకే.. అదను చూసి.. దెబ్బకొడుతుంది. ప్రపంచ చరిత్రలో అలా దెబ్బతిన్న బాధితుల గాథలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ‘జో అలెన్ వీగెల్’ ఉదంతం ఒకటి.1970, జూలై 2. పద్దెనిమిదేళ్ల ‘జో అలెన్ వీగెల్’ ఆశలన్నీ కుప్పకూలిన రోజది. తన మృత్యువుకు ప్రణాళిక ముందే సిద్ధమైందని, తనతో ఉన్నవారే యమకింకరులని ఆమెకు తెలియని రోజది. తెలిసే సమయానికి.. ఆమె లేనేలేదు. అమెరికాకు చెందిన ‘జో అలెన్ వీగెల్’.. చదువుకునే రోజుల్లో స్థానికుడైన మైక్ క్లైన్ అనే స్నేహితుడ్ని ప్రేమించింది. ఇద్దరిదీ సుమారు ఒకే వయసు. అతడు చాలా ఆస్తిపరుడు, అందగాడు. మెడిసిన్ చదువుతున్నాడు.‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని అతడ్ని తన కన్నవారికి పరిచయం చేసింది జో. మొదటి నుంచి శ్రామికులైన జో తల్లిదండ్రులు.. ఆ జంటను చూసి.. అతడి బ్యాగ్రౌండ్ చూసి ఎంతగానో మురిసిపోయారు. జో.. మైక్‌తో కలసి వెళ్లిందంటే వారికో ధైర్యం. ఏ సమస్య వచ్చినా మైక్ చూసుకుంటాడులే అనే ఓ నమ్మకం. జూలై 2 రాత్రి కూడా జో.. అతడితోనే వెళ్లింది కానీ తిరిగిరాలేదు.మరునాడు జో కోసం ఆమె తండ్రి జోసెఫ్ వీగెల్.. మైక్‌ని కలసి ఆరా తీశాడు. ‘మాకు వివాహం అయ్యింది. తను నా భార్య.. తన గురించి మీకంత శ్రద్ధ అవసరం లేదు’ అంటూ తిక్కగా సమాధానం చెప్పాడు మైక్. అతడ్ని ఆ తీరులో ఎప్పుడూ చూడలేదు జోసెఫ్. ‘గొడవపడ్డారా? నిన్న రాత్రి మీరిద్దరూ బయలుదేరే ముందు కూడా గొడవపడటం నేను విన్నాను. అసలేం జరిగింది? జో నిజంగా ఎక్కడికి వెళ్లిందో చెప్పు?’ అంటూ నిదానంగా, సముదాయింపుగా అడిగాడు జోసెఫ్.ఆ వాదనలో ‘తెలియదు’ అని ఒకసారి.. ‘బంధువుల ఇంటికి వెళ్లింది’ అని మరోసారి చెప్పాడు మైక్. వెంటనే జోసెఫ్.. మైక్ చెప్పిన బంధువుల ఇంటికి వెళ్లి మరీ జో గురించి వాకబు చేశాడు. ఇక్కడికి రాలేదని బంధువులు తెలపడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ‘మా అమ్మాయి కనిపించడం లేదు.. కాబోయే అల్లుడు మైక్‌పై అనుమానం ఉంది, కంప్లైంట్ తీసుకోండి’ అని కోరాడు జోసెఫ్. టీనేజ్ పిల్లలు ఇంట్లో చెప్పకుండా ట్రిప్‌లకు వెళ్లడం, కొన్నిరోజులకు మళ్లీ తిరిగి రావడం కామన్ కాబట్టి.. సరైన ఆధారం లేకుండా కేసు నమోదు చేసుకోలేమని.. పోలీసులు తేల్చేశారు. దాంతో జో పేరెంట్స్‌కి జో కోసం ఎదురుచూడటం తప్ప మరో దారి లేకుండా పోయింది.సరిగ్గా మూడురోజులకి.. కొన్ని మైళ్లదూరంలో ఉన్న విన్నెబాగో సరస్సులో జో.. కేవలం లో–దుస్తులతో శవమై తేలింది. బాడీని జో పేరెంట్స్ గుర్తుపట్టడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. జో కాళ్లకు.. బరువైన కాంక్రీట్ బండ, బరువైన వాటర్ టిన్ను కట్టి ఉన్నట్లు గుర్తించారు పోలీస్ అధికారులు. శవం పైకి తేలకుండా ఉండటానికే అలా చేసి ఉంటారని ప్రా«థమిక నిర్ధారణకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ఆ రిపోర్ట్‌లో జో గొంతు నులమడం వల్లే చనిపోయిందని.. ఆమె 4వ నెల గర్భవతి అని తేలింది.పైగా ఆ సరస్సు ఒడ్డునే మైక్ నివాసం కావడంతో జో కేసు మొత్తం మైక్ చుట్టూనే తిరిగింది. అయితే జో బాడీ దొరికిన రోజే.. మైక్ యూరప్ చెక్కేశాడు. జో బాడీకి కట్టిన ఆ కాంక్రీట్ బండ.. మైక్ స్నేహితుడి ఇంటి ముందు ఉన్న మరిన్ని బండలతో సరిపోలింది. పైగా ఆ బండకు కట్టిన తాడు.. మైక్ ఇంట్లోని స్పీడ్ బోట్లో ఉండే బెల్ట్ అని తేలింది. ఇక మైక్ వాడే కారులో.. ఒక టవల్ దాని నిండా జో తల వెంట్రుకలు ఉన్నాయి. అవి జో మరణానికి ముందు.. తల నుంచి బలవంతంగా లాగినట్లు నేర పరిశోధనలో తేలింది. అంటే జోను చంపే సమయంలో తీవ్రమైన పెనుగులాట జరిగిందని అధికారులు నిర్ధారించుకున్నారు.ఈలోపు ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్న మైక్ తండ్రి డొనాల్డ్ క్లైన్.. కొడుకుని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మీడియా కన్ను.. విన్నెబాగో సరస్సు ఒడ్డున ఉన్న మైక్ ఖరీదైన ఇంటి మీద పడింది. పోలీసులతో పాటు రిపోర్టర్స్ కూడా ఆ ఇంటిని శోధించి.. మైక్ ఇంటి అందాన్ని.. ఆ ఇంట్లో ఉన్న కార్లు, స్వీడ్ బోట్స్ లెక్కల్ని వాటి ధరల్నీ చెబుతూనే.. ‘జోకి అన్యాయం చేసిన మైక్ ఎక్కడ?’ అనే ఎన్నో కథనాలను ప్రచురించారు. జో గర్భిణి అని తెలుసుకున్నవారంతా మైక్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.ఇక సరిగ్గా వారానికి యూరప్ నుంచి తిరిగి వచ్చిన మైక్‌ని అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. అయితే అతడు నోరు విప్పలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. జోను చంపింది తానేనని ఒప్పుకోలేదు. అదంతా అతడి లాయర్ సలహానే అని మీడియా గగ్గోలుపెట్టింది. కేసు నడుస్తుండగానే బెయిల్‌పై బయటికి వచ్చిన మైక్.. వాయిదాల ప్రకారం కోర్టుకు వచ్చిపోతుండేవాడు. జో హత్యపై తీవ్రమైన అభియోగాలు ఎదురవడంతో.. జూలై 24న గ్రాండ్ జ్యూరీలో మైక్.. బెయిల్ రద్దు చేస్తూ.. తిరిగి మైక్‌ని అదుపులోకి తీసుకోమని ఆదేశాలొచ్చాయి. అయితే ఆ రోజు నుంచి మైక్ ఎవరికీ కనిపించలేదు. నేటికీ దొరకలేదు.మైక్ మారుపేరుతో తన ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసి.. పశువైద్యుడిగా జీవితాన్ని రీస్టార్ట్ చేశాడని.. ఇప్పటికీ అతడు.. లాటిన్ అమెరికాలో రహస్యంగా, సురక్షితంగా జీవిస్తున్నాడని చాలామంది చెబుతుంటారు. అతడి ఆచూకీ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ.. తన తండ్రి డొనాల్డ్‌కి కచ్చితంగా తెలుసు అని అధికారులు సైతం నమ్మారు. 1988లో డొనాల్డ్ మృతి చెందాడు. అంతకుముందే జో పేరెంట్స్ కూడా ఈ కేసుపై పోరాడి పోరాడి.. అనారోగ్యసమస్యలతో చనిపోయారు. ఈరోజుకి మైక్ బతికి ఉంటే అతడికి డెబ్బై రెండేళ్లు దాటి ఉంటాయని అంచనా. అతడికి సంబంధించిన పలు ఊహాచిత్రాలు.. నేటికీ ఎఫ్‌బీఐ రికార్డ్స్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ నోట్‌తో కనిపిస్తుంటాయి.ఏది ఏమైనా.. జో మృతిలో మైక్ హస్తం ఉందనే స్పష్టత అతడి మిస్సింగ్‌తో తేలిపోతుంది. కానీ ఆమెను మైక్ ఎందుకు చంపాడు? ఎవరెవరు ఈ కుట్రలో పాల్గొన్నారు? జో తల్లి కాబోతుందన్న నిజం తెలిసి కూడా చంపేశాడా? అసలు మైక్ ఏమైపోయాడు? ఎటుపోయాడు? ఎక్కడున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు మాత్రం నేటికీ మిస్టరీనే మిగిలిపోయాయి. – సంహిత నిమ్మన -
'జో' సినిమా కాంబో రిపీట్.. ఈసారి ఎలాంటి స్టోరీ అంటే..
గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్‌లో విడుదలైన సినిమా 'జో'. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇందులో రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించారు. వారిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా కోలీవుడ్‌లో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. కాగా ఇంతకుముందు హరి ముత్తయ్య వంటి దర్శకులతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన డ్రమాటిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మణికంఠన్ కందస్వామి సమర్పణలో రూపొందుతున్న నూతన చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.ఇందులో నటుడు రియోరాజ్, నటి మాళవిక మనోజ్ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. బ్లాక్ షిప్ కలైయరసన్ తంగవేలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్లాక్ షీప్ ఆర్జె విగ్నేష్, షీలా రాజకుమార్, డైరెక్టర్ ఏ వెంకటేశ్, గజరాజన్, జాన్సన్ దివాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధేశ్ మాణిక్ ఛాయాగ్రహణం, సిద్ధికుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పెళ్లయిన మగవాళ్ల సమస్యలను స్త్రీలు కూడా అంగీకరించేలా తెరకెక్కిస్తున్న కథాచిత్రమని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. కాగా దీనికి బ్లాక్ షీప్ సంస్థ సహనిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?
ఓటీటీల జమానా పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. యువతకు సైలెంట్‌గా ఎక్కేస్తుంది. చాలారోజుల తర్వాత ఓ మంచి ప్రేమకథ చూశామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైనప్పటికీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా? కథేంటి? (ఇదీ చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) 'జో' కథేంటి? జో.. చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలిరోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్నిరోజుల తర్వాత సుచిత్ర కూడా జో ని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్థలు వస్తాయి. దీంతో ఆరు నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్లిపోతుంది. ఓ రోజు సడన్‌గా ఫోన్ చేసి.. పెళ్లి గురించి ఇంటికొచ్చి మాట్లాడమని జో కి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రకు మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శ్రుతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఏ ఓటీటీలో ఉంది? తమిళంలో గత నవంబరు 24న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండటంతో మనోళ్లు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. 'ప్రేమమ్', 'హృదయం', 'రాజారాణి' లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాల ఇష్టపడేవారిని ఇది అలరిస్తోంది. అలానే సినిమాలో 'జో' మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు ఇంకా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి. మీరు కచ్చితంగా ఏడ్చేస్తారు! ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు దూరమైతే.. మనం చనిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఓ రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిచ్చోడిలా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా మూవీ మొత్తం ఎమోషన్స్‌తో నింపేశారు. ఎలాంటి పరిస్థితిలో అయినాసరే ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం బాగుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు) #Joe ❤️pic.twitter.com/luBvxWsN5A — .🚬 (@itz_RomeoVj) January 18, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు
మరో వారం వచ్చేసింది. అయితే ఈసారి అంతా సంక్రాంతి హడావుడి గట్టిగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అందరూ పండగ సందడిలో ఉన్నారు. ఓవైపు థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజైనప్పటికీ వీటిలో 'హను-మాన్'.. సంక్రాంతి విన్నర్ అనిపిస్తోంది. మిగతా చిత్రాలకు మిక్స్డ్ టాక్ రావడమే దీనికి కారణం. మరోవైపు ఓటీటీల్లోనూ లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. సంక్రాంతి కలిసి రావడంతో ఈ వారం బోలెడన్ని సెలవులు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ప్లాన్ వేశాయి. ఇందులో భాగంగా ఈ వారం రోజుల్లో ఏకంగా 45 సినిమాల్ని స్ట్రీమింగ్ చేయబోతున్నాయి. పలు ఓటీటీల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ చిత్రాలు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జనవరి 15 నుంచి 21 వరకు) హాట్‌స్టార్ జో (తమిళ మూవీ) - జనవరి 15 ల్యూక్ గుయాన్స్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 15 డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16 ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్) - జనవరి 17 ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) - జనవరి 17 బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19 కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19 క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్) - జనవరి 19 ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (తెలుగు సినిమా) - జనవరి 19 స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20 అమెజాన్ ప్రైమ్ నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) - జనవరి 18 ఫిలిప్స్ (మలయాళ సినిమా) - జనవరి 19 హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19 ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్) - జనవరి 19 లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19 జొర్రో (స్పానిష్ సిరీస్) - జనవరి 19 నెట్‌ఫ్లిక్స్ మబోర్షి (జపనీస్ సినిమా) - జనవరి 15 రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జనవరి 15 డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16 అమెరికన్ నైట్మేర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 17 ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) - జనవరి 17 ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం) - జనవరి 18 కుబ్రా (టర్కిష్ సిరీస్) - జనవరి 18 మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 18 ప్రిమ్బాన్ (ఇండోనేసియన్ మూవీ) - జనవరి 18 రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం) - జనవరి 18 ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19 లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19 మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా) - జనవరి 19 సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ) - జనవరి 19 ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్) - జనవరి 19 ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19 ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 19 కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) - జనవరి 20 జియో సినిమా బెల్గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 15 ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 15 బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 18 చికాగో ఫైర్: సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 18 లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19 బుక్ మై షో అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) - జనవరి 15 ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ) - జనవరి 19 ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 20 సోనీ లివ్ వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జనవరి 16 యూట్యూబ్ ద మార్వెల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 17 ముబీ ఫాలెన్ లీవ్స్ (ఫిన్నిష్ సినిమా) - జనవరి 19 -
ఏడడుగులకు రెడీ
సగం పెళ్లి చేసుకున్నారు కథానాయిక రిచా గంగోపాధ్యాయ్. అదేనండీ ఆమె నిశ్చితార్థం జరిగిందని సరదాగా అలా చెబుతున్నాం. ఈ విషయాన్ని రిచా అధికారికంగా వెల్లడించారు. ‘‘నా నిశ్చితార్థం పూర్తయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా కాబోయే భర్త జోను నేను ఓ బిజినెస్ స్కూల్లో కలుసుకున్నాను. రెండేళ్లు అద్భుతంగా గడిచాయి. నా జీవితంలో నెక్ట్స్ ఫేజ్(పెళ్లి తర్వాతి జీవితం) గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పెళ్లి తేదీ నిర్ణయించలేదు’’ అని పేర్కొన్నారు రిచా. ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రిచా ఆ తర్వాత ‘నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి’ వంటి సినిమాల్లో నటించారు. 2013లో ‘భాయ్’ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ‘ఇక సినిమాలకు ఫుల్స్టాప్ పెడుతున్నా’ అని ప్రకటించి ఆమె అమెరికా వెళ్లిపోయారు. -
‘మిర్చి’ భామకు పెళ్లి కుదిరింది..!
రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తరువాత మిరపకాయ్, మిర్చి సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే భాయ్ సినిమా తరువాత నటనకు బ్రేక్ ఇచ్చి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తరువాత అభిమానులకు దూరమైన ఈ భామ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. తనకు బిజినెస్ స్కూల్లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా ప్రకటించారు. ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్) అవార్డును అందుకున్నారు. Just wanted to share that I am engaged ❤! Joe and I met in business school and it has been two wonderful years! Looking forward to the next phase of my life. Wedding date not set yet!😊 pic.twitter.com/7ozwry8Zg9 — Richa Gangopadhyay (@richyricha) 15 January 2019 -
వినుడు వినుడు ఈ మర్కట గాథా..
బ్యాంకాక్: తిండికోసం ఓ ఇంట్లోదూరిన కోతి.. 25 ఏళ్లు అక్కడే బందీ అయిపోయింది! కోతుల బాధ భరించలేక, కోతులపై కోపం పెంచుకున్న ఓ ఇంటాయన ఆ కోతిని పట్టుకుని గాలిమాత్రమే చొరబడే బోనులో బంధించాడు. విలవిలలాడినా వదిలిపెట్టలేదు. వలవలా ఏడ్చినా కరుణించలేదు. పాతికేళ్ల సుదీర్ఘ శిక్ష అనంతరం పోయినవారమే ఆ కోతికి విముక్తి లభించింది. ఈ మర్కటపురాణం పూర్వాపరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ మురికివాడలో నివసించే ఓ వ్యక్తి 1991లో ఓ కోతిని బంధించాడు. రెండు ఇళ్ల మధ్య ఉన్న చిన్న సందులో ఇనుపతీగలతో బోను తయారుచేసి అందులో కోతిని ఉంచాడు. గుర్తొచ్చినప్పుడు తినడానికి ఏదైనా ఇచ్చేవాడు. బుధ్ధిపుట్టినప్పుడు పండో ఫలమో ఇచ్చేవాడు. కాల క్రమంలో ఆ కోతి స్థానికులకు చేరువైంది. వాళ్లంతా ఆ కోతిని 'జోయ్' అని ముద్దుగా పిలిచేవారు. కరుణించిన దానయ్య.. ఇదిలా ఉండగా దారినపోయే దానయ్య ఒకరు కోతి బోనులో ఉండటాన్ని చూసి చలించిపోయి, వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్లకు సమాచారం చేరవేశాడు. ఆ సంస్థ సభ్యులు వెంటపెట్టుకొచ్చిమరీ కోతిని విడిపించాడు. విముక్తిపొందే సమయానికి కోతి చిక్కి శల్యమైపోయింది. శరీరంలో నీటి నిల్వలు బాగా తగ్గిపోవడంతో కనీసం నిలబడలేకపోయింది. 'జైలు లాంటి బోను నుంచి అది బయటపడి వారం అవుతోంది. ఇప్పుడిప్పుడే మిగతా కోతులతో కలిసేప్రయత్నం చేస్తోంది' అంటూ కోతి బాగోగులను ఫేస్బుక్ ద్వారా వెల్లడింస్తున్నారు వైల్డ్ లైఫ్ సభ్యులు. -
విన్యాసాలతో ముద్దూ ముచ్చట
ఫ్లోరిడా: పరస్పర ప్రేమను వ్యక్తీకరించుకోవడంలోనూ పెళ్లి చేసుకోవడంలోనూ వినూత్న పద్ధతులను ఆశ్రయించడం అమెరికా యువతీ యువకులకు పరిపాటే. అలాగే ఫ్లోరిడాలోని ఒకోయిలో ఉంటున్న జో, ఇలియానాలు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశమార్గాన విహరిస్తూ, సముద్ర గర్భంలో జలకాలుడుతూ, పర్వతారోహన చేస్తూ నిశ్చితార్థం జరుపుకోవాలా? ఆహా...ఇవిన్నీ పాతపడిన విద్యలే. జీవితాంతం కలిసున్నా, లేకున్నా జీవితాంతం గుర్తుండేలా ఇంకా కొత్తగా, వినూత్నంగా నిశ్చితార్థం జరుపుకోవాలని ఆలోచించారు. వారి మధ్య ప్రేమ అంకురించి, వికసించిందీ జిమ్‌లోనే. కనుక జిమ్‌లోనే నిశ్చితార్థం జరుపుకోవాలని నిర్ణయానికొచ్చారు. అయితే ఎలా అన్నది మరో ప్రశ్న... మళ్లీ ఆలోచించారు. జిమ్నాస్టిక్స్లోనూ వెయిట్ లిఫ్టింగ్లోను ఇద్దరు నిపుణులే అవడం వల్ల కసరత్తు చేస్తూనే కళ్యాణ గడియలకు నిశ్చితార్థం జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే ఫొటోగ్రాఫర్‌ను పిలిపించారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ నిశ్చితార్థం పేరిట ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. వారిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసిన సదరు ఫొటోగ్రాఫర్ నిజంగా ఇది కొత్తగాను, గమ్మత్తుగాను ఉందంటూ భావి దంపతులను ఆశీర్వదించారు. బ్యూనా విస్టా సరస్సు సమీపంలోని ప్యారడైజ్ పందిట్లో ఏప్రిల్ 30వ తేదీన వారు పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థానికే సిగ్గేలనే... ఎగ్గేలనే ...అనుకుంటూ చెమటోడ్చి ముద్దులు పెట్టుకున్న వారు పెళ్లికి మరెలాంటి విన్యాసాలు చేస్తూ ఆహూతులను ఆకట్టుకుంటారో మరి!