ఆ ‌నియమం పెట్టుకున్నా : హీరోయిన్‌ తాప్సీ | Taapsee Shares Her Transformation Journey for Rashmi Rocket | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫర్మేషన్‌‌ వీడియో షేర్‌ చేసిన తాప్సీ

Published Fri, Dec 18 2020 4:27 PM | Last Updated on Fri, Dec 18 2020 4:45 PM

Taapsee  Shares Her Transformation Journey for Rashmi Rocket - Sakshi

అతి తక్కువ కాలంలో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ పన్ను. తన సినిమాల్లో మహిళ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ మరోవైపు విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో స‌డ‌న్‌గా బాలీవుడ్‌కు మ‌కాం మార్చిన తాప్సీ.. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో పాటు స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టిస్తూ బిజీబిజీగా మారారు. ప్రస్తుతం ఆమె 'రష్మి రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా న‌టిస్తున్నారు.  ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోక‌స్ పెడుతూ ప్రత్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు పెద్దగా జిమ్‌లో గడపని ఆమె..ఈ చిత్రం కోసం ప్రత్యేక కసరత్తులు నేర్చుకున్నారు. (తాప్సీకి ఛ‌లానా విధించిన పోలీసులు)

సినిమా ప్రారంభానికి ముందే 'నో స్టెరాయిడ్స్' ‌ అనే నియమం పెట్టుకున్నానని, సహజమైన పద్దతుల ద్వారా తన శరీరాన్ని ఎంత ధృడంగా మార్చుకుందో తెలియచేస్తూ.. దీనికి సంబంధించి ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ వీడియోను తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆర్డినరీ మనుషులు ఎక్స్‌ట్రార్డినరీ పనులు చేయాల్సి ఉంటుందంటూ ట్యాగ్‌లైన్‌ను జతచేస్తూ చిన్నప్పటి నుంచి తాను క్రీడల్లో పాలుపంచుకున్న విశేషాలను షేర్‌ చేశారు. ఈ సినిమా కోసం తాప్సీ ప్రత్యేక డైట్‌ తీసుకుంటూ అనేక వ్యాయామాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఇక  రష్మి రాకెట్ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిం​చిన ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో ప్రియాన్షు పెన్యూలీ నటించారు. (వైరలవుతున్న పవన్‌ భార్య ఫోటోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement