అంత సులభం కాదు.. రెండున్నరేళ్లు పట్టింది: టాలీవుడ్ హీరోయిన్ | Anita Hassanandani Shares Interesting Post On Her Physical Transformation Goes Viral - Sakshi
Sakshi News home page

Anita Hassanandani: ఇదంతా సులభమేమీ కాదు.. రెండున్నరేళ్లు పట్టింది: టాలీవుడ్ హీరోయిన్

Published Fri, Apr 12 2024 2:08 PM | Last Updated on Fri, Apr 12 2024 3:04 PM

Anita Hassanandani on her physical transformation Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో నువ్వు -నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో  కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం రీ ఎంట్రీకి అనితా సిద్ధమవుతోంది. టాలీవుడ్‌ సినీ ప్రియులను త్వరలోనే అలరించనుంది. అయితే ఇటీవల తన వెయిట్‌ లాస్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది.

గతంలో బాబు పుట్టినప్పుడు 76 కిలోలు ఉన్న అనితా ప్రస్తుతం 58 కిలోలకు తగ్గింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. 'ఇలా మారడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. మరో ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నా లక్ష్యం  చాలా దూరంగా అనిపించడం లేదు. అంతా మనకు అనుకూలంగానే ఉందంటూ రాసుకొచ్చింది. కానీ ఇదంతా సులభం కాదని అనితా చెబుతోంది.

అనితా మాట్లాడుతూ.. 'ఇది కచ్చితంగా కష్టమే. కానీ నేను మాత్రం తొందరపడలేదు. వెయిట్ లాస్‌ కోసం ఇంత సమయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నా. నేను నా లక్ష్యానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నా. నటులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గతంలో నేను నా ప్రెగ్నెన్సీని ఆస్వాదించా.  మనం అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకసారి బిడ్డ పుట్టాక శరీరం, హార్మోన్ల మార్పులు, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయని' వివరించింది. సోషల్ మీడియాలో మీరు చాలా బరువు పెరిగారంటూ మేసేజులు పంపేవారని తెలిపింది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది. కాగా. 2014లో వ్యాపారవేత్త రోహిత్‌ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement