![Jayeshbhai Jordaar Actor Shalini Pandey About Her Incredible Transformation - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/5/shalini-pandy.jpg.webp?itok=9HeKvhPP)
షాలినీ పాండే
విజయ్ దేవరకొండను స్టార్‌ని చేసిన ‘అర్జున్ రెడ్డి’ని గుర్తుకు తెచ్చుకోండి. అదే సినిమాతో హీరోయిన్‌గా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు షాలినీ పాండే. ఆ సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందుకు ఉదాహరణ ఇక్కడున్న ఫొటో. హిందీ సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం ఇలా సన్నబడ్డారు షాలిని. ఈ సినిమాలో ఆమె డ్యాన్సర్‌గా చేశారు. ఈ పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గారు. ఈ విషయం గురించి షాలినీ పాండే మాట్లాడుతూ – ‘‘బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా మన శరీరాన్ని కష్టపెడతాం. కఠినమైన వర్కవుట్స్‌తో పాటు ఆహారం విషయంలోనూ చాలా నియమాలు పాటిస్తాం. అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే నేను తగ్గడానికి రెడీ.. పెరగడానికి కూడా రెడీయే.
మనం ఎంత బాగా నటించినా, క్యారెక్టర్‌కి తగ్గట్టుగా శరీరాకృతి లేకపోతే చూడ్డానికి బాగుండదు. ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం నేనెక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. వేరే వర్కవుట్స్, ప్రత్యేకమైన డైట్‌తో పాటు ఈ ప్రాక్టీస్ కూడా నేను సన్నబడ్డానికి హెల్ప్ అయింది’’ అన్నారు. ఇంకా అమ్మాయిల శరీరాకృతి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారని చెబుతూ – ‘‘అమ్మాయిలంటే ఇలా ఉండాలనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకని కొందరు అమ్మాయిలు ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే నా మటుకు నేను ఎలా ఉన్నా ఒత్తిడి ఫీల్ కాను. ఇప్పుడు తగ్గానంటే సినిమాలో క్యారెక్టర్ కోసమే. పాత్రకు తగ్గట్టు ఒదిగిపోగలిగినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు షాలిని. ఆ సంగతలా ఉంచితే చక్కనమ్మ చిక్కినా చక్కనే అన్నట్లుగా షాలినీ ఉన్నారు కదూ.
Comments
Please login to add a commentAdd a comment