మాచినేనిపేట (జూలూరుపాడు), న్యూస్‌లైన్: మాచినేనిపేట గ్రామ సర్పంచ్ దేవి భర్త, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు సపావట్ రాములు జాడ శుక్రవారం నాటికి కూడా తెలీలేదు. ఆయన బుధవారం మాచినేనిపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రాములు భార్య దేవిని కూడా వారు ప్రశ్నించారు.
సాగర్ కాల్వలో గాలింపు
రాములును హత్య చేసి, మృతదేహాన్ని ఏన్కూరులోని సాగర్ కాల్వలో పడేశారన్న సమాచారంతో కుటుంబీకులు, గ్రామస్తులు, పోలీసులు గురువారం రాత్రి వరకు ఏన్కూరు నుంచి కల్లూరు వరకు గాలించారు.
పాత కక్షల నేపథ్యంలోనే...
పాత కక్షల నేపథ్యంలోనే సపావట్ రాములును కొందరు ‘మాయం’ చేసి ఉండవచ్చని స్థానికు లు భావిస్తున్నారు. ఐదేళ్ల కిందట రాములుకు, గురవాగుతండాకు చెందిన వ్యక్తికి మధ్య ఘర్ష ణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పం చాయతీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వా రిద్దరి మధ్య స్నేహం కుదిరిందని, ఎన్నికలలో కలిసి పనిచేశారని అంటున్నారు. రాములు బుధవారం తన ఇంటి నుంచి 20వేల రూపాయలు తీసుకుని, ఆ వ్యక్తితో కలిసి ఏన్కూరు వెళ్లారని (రాములు) కుటుంబీకులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాస్తారోకో
‘రాములును హత్య చేసి సాగర్ కాల్వలో మృతదేహాన్ని పడేసినట్టయితే ఈ రెండు రోజుల్లో ఎక్కడో ఒకచోట మృతదేహం కనిపించేది. శవాన్ని మరోచోట ఉంచి.. కావాలనే పోలీసులను, గ్రామస్తులను నిందితులు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై గ్రామస్తులు, రాములు కుటుంబీకులు, బంధువులు శుక్రవారం రాస్తారోకో చేశారు.
ఏఎస్‌పీకి ఫిర్యాదు
రాస్తారోకో సాగుతున్న సమయంలోనే ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఏఎస్‌పీ నాగేశ్వరరావు వాహనం వచ్చింది. పోలీసుల తీరుపై ఏఎస్‌పీకి ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. రాములు ఆచూకీ త్వరగా తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఏఎస్‌పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చారు. ఎస్‌ఐ ఆర్.అంజయ్య తన సిబ్బందితో కలిసి ఏన్కూరు సాగర్ కాల్వ వెంట గాలించి పోలీస్ స్టేషన్‌కు తిరిగొస్తుండగా ఆందోళనకారులు అడ్డగించి, రాస్తారోకోకు దిగారు. అటుగా వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృ ష్ణారెడ్డికి వారు సమస్యను వివరించారు. ఆయన ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.
మాచినేనిపేట సర్పంచ్ భర్త రాములు ఏమయ్యాడు..?
Published Sat, Jan 11 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement