న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది.
‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment