జకర్తా: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం సాధించాడు. దీంతో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, పది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 17 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. 50 మీటర్ల బట్టర్‌ఫ్లై (స్విమ్మింగ్) విభాగంలో విర్ద్వాల్ ఖడే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అతడు 24.09 సెకన్లలోనే ఫీట్‌ను పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకోల్పాడు
మరోవైపు ఆర్చరీలో తీవ్ర నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య ఆసియా క్రీడల బరిలోకి దిగిన దీపికా కుమారి ప్రీక్వార్టర్స్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో చియాంగ్ యంగ్ లి (చైనీస్ తైపీ) చేతిలో 3-7 చేతిలో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment