నటి తమన్నా బోల్డ్ అండ్ బ్యూటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మరింత అందాన్ని సంతరించుకున్నారనే చెప్పాలి. అవకాశాలు కూడా మధ్యలో కాస్త తడబడ్డా ఇప్పుడు వరుస కడుతున్నాయి. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథ చిత్రం సైరా నరసింహారెడ్డిలో చాలా ముఖ్యమైన పాత్రను షోషిస్తున్నారు.
ఇక హిందీలో ప్రభుదేవాతో జత కట్టిన ఖామోషి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా ప్రభుదేవాతో నటిస్తున్న మరో చిత్రం దేవి–2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇది ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రానికి సీక్వెల్. దేవీ–2 తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తమన్నా గురువారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.
దేవి–2 చిత్రం గురించి?
దేవి–2 చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకు ముందు తెరపైకి వచ్చిన దేవి చిత్రం మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. ఇప్పుడు దేవీ–2 చిత్రం అంతకంటే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
దేవి 2 చిత్రాన్ని అంగీకరించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా?
కథే ప్రధాన కారణం. దర్శకుడు విజయ్ కథ చెప్పగానే నచ్చేసింది. ఇందులో ప్రభుదేవాకు భార్యగా నటించాను.
దేవి–2లోనూ డీగ్లామర్‌గా నటించారటగా?
అయ్యో ఆ రూపం కోసం చాలా కష్ట పడ్డాను. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు అందరూ తమ చిత్రాల్లో అలానే కనిపించమంటున్నారు. సైరా చిత్రంలో కూడా నా గెటప్ విభిన్నంగా ఉంటుంది. అందులో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను.
సైరా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించారటగా? ఇకపై కూడా అలాంటి పాటల్లో నటించడం కొనసాగిస్తారా?
ఖచ్చితంగా. అయితే ఆ పాటకు చిత్రంలో ప్రాధాన్యత ఉండాలి. పాట నాకు నచ్చాలి.
మీపై వస్తున్న వదంతుల గురించి?
అలాంటి వాటిని చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిని ఎవరు?ఎలా కల్పిస్తారో అర్థం కావడం లేదు.
పెళ్లెప్పుడు చేసుకుంటారు?
మంచి పెళ్లి కొడుకు దొరకాలి. దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పాను మంచి పెళ్లి కొడుకు ఉంటే చెప్పమని. మీలో ఎవరైనా మంచి వ్యక్తిని చూస్తే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ.
చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి, ఎంఎల్‌ఏలు, ఎంపీలు అవుతున్నారు.మీకూ అలాంటి ఆలోచన ఉందా?
అలాంటి ఆలోచన నాకు లేదు.నిజం చెప్పాలంటే నాకు రాజకీయాలు తెలియవు. ఏమో మరో ఐదేళ్లలో రాజకీయాల గురించి నేర్చుకుని, ఆ దిశగా పయనిస్తానేమో.
Comments
Please login to add a commentAdd a comment