సాధారణంగా హీరోయిన్లు ఎంత పెద్ద స్టార్‌డమ్‌తో వెలిగిపోతున్నా ఇప్పటికీ అమ్మ చాటు బిడ్డల్లానే ప్రవర్తిస్తుంటారు. వారికి ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా అమ్మ ఆలోచనలు, సలహాలే తీసుకుంటారు. అంటే వారికంటూ వ్యక్తిత్వం ఉండదా? అన్న ప్రశ్నను పక్కన పెడితే చాలా మంది అలానే ప్రవర్తిస్తుంటారు. నటి తమన్నా విషయానికొస్తే నేనూ అంతే అని చెప్పకనే చెప్పింది.
బాహుబలి చిత్రానికి ముందు పలు కమర్శియల్ చిత్రాల్లో నటించినా, ఆ చిత్రం తమన్నాకు తెచ్చి పెట్టిన ఇమేజ్ వేరు. ఇంకా చెప్పాలంటే బాహుబలితో ఈ మిల్కీబ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందనే చెప్పాలి. ప్రస్తుతం క్వీన్ చిత్ర తెలుగు వెర్షన్‌లో నటిస్తున్న తమన్నా, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది.
ఇక తమిళంలో ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో మరోసారి రొమాన్స్ చేస్తోంది. తన అందం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ సినిమా గ్లామర్ ప్రపంచంగా పేర్కొంది. ఇక్కడ అందం ముఖ్యమని, అయితే అంతకంటే ముఖ్యం ప్రతిభ అని పేర్కొంది. ప్రతిభ ఉంటేనే ఇక్కడ నాలుగు కాలాల పాటు నిలబడగలమని అంది.
తననే తీసుకుంటే 10 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తున్నానని చెప్పింది. అయినా మీ అందం ఏ మాత్రం తగ్గలేదని చాలా మంది అంటుంటారని, మీ సౌందర్య రహస్యం ఏమిటని అడుగుతుంటారని చెప్పింది. నిజం చెప్పాలంటే తాను అందానికి ఎక్కువ మెరుగులు దిద్దుకోను అని పేర్కొంది. ఇక షూటింగ్ ముగిసి ప్యాకప్ అనగానే మేకప్‌ను తుడిచేసి సాధారణ అమ్మాయిగా మారిపోతాను అని చెప్పింది.
ఇంట్లో ఉంటే సాధారణ అమ్మాయిలు సౌందర్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో తానూ అంతేనని చెప్పింది. అయితే తాను నటిని కావడంతో అందాలను ఎలా కాపాడుకోవాలన్నది బాగా తెలుసుని చాలా మంది అనుకుంటారని అంది. కానీ తాను ఇప్పటికీ అందం విషయంలో తన తల్లి ఆలోచనలనే అమలు పరుస్తానని చెప్పింది. అలా అందం విషయంలో పాత పద్ధతులనే పాటిస్తానని అంది. అవి కూడా షూటింగ్ సమయంలోనే ఇతర సమయాల్లో పెద్దగా పాటించనని తమన్నా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ అమ్మడు చెప్పేవి నమ్మశక్యంగా ఉన్నాయంటారా? ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment