టాలీవుడ్‌లోకి ప్రతి ఏడాది వందలాది మంది హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. క్లిక్ అయితే స్టార్స్ అవుతారు. లేదంటే కొన్నాళ్ల పాటు మూవీస్ చేసేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోతుంటారు. ఈ భామ కూడా అలానే. కాకపోతే కొన్నేళ్లుగా హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడేమో ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఓ విలన్‌తో ప్రేమలో పడింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ విమలా రామన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు గెస్ చేసింది నిజమే. 2009లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది. కానీ గ్లామర్ బాగుందని మెచ్చుకున్నారు. కానీ హిట్స్ పడకపోయేసరికి ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో సైడ్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టింది.
(ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)
ఈ ఏడాది రిలీజైన 'అశ్విన్స్', 'గాండీవధారి అర్జున' లాంటి మూవీస్ చేసింది. 'రుద్రంగి' అనే సినిమాలు మంచి రోల్ చేసింది. కానీ బ్యాడ్ లక్. ఇవేవి విమలా రామన్‌కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాం. ఈమెది మన దేశం కాదు. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. 2004లో 'మిస్ ఇండియా ఆస్ట్రేలియా' విన్నర్ అయిన తర్వాత సినిమా ఛాన్సులు వచ్చాయి. అలా ఇక్కడే ఉండిపోయింది.
ఈమె వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమెకి ఇప్పుడు 41 ఏళ్లు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉండటం, ఛాన్సులొస్తుండటం వల్ల పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ నటుడు వినయ్ రాయ్‌తో గత కొన్నాళ్లు ముందు ప్రేమలో పడింది. ఆ విషయం నేరుగా చెప్పలేదు గానీ ఇన్ స్టాలో అతడితో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో విమలా-వినయ్ రిలేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి బహుశా ఈ ఏడాదిలోనే విమలా రామన్ పెళ్లి చేసేసుకోవచ్చేమో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment