నాగ్ సరసన! | Vimala Raman to act with Nagarjuna | Sakshi
Sakshi News home page

నాగ్ సరసన!

Published Tue, May 24 2016 12:09 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

నాగ్ సరసన! - Sakshi

నాగ్ సరసన!

అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరై 30 ఏళ్లయింది. ‘విక్రమ్’తో తెరంగేట్రం చేసిన నాగ్  వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ఓం నమో వెంకటేశ’కు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. ఇందులో హథీరామ్ బాబాగా కనిపించడానికి నాగ్ సిద్ధమవుతున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఇప్పటికే  ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం అనుష్క,‘ కంచె’ ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్‌లను ఎంపిక చేసుకున్నారట. మరో పాత్ర కోసం విమలా రామన్‌ను తీసుకున్నారని సమాచారం. ‘ఎవరైనా ఎప్పుడైనా’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన విమలా రామన్ ఆ తర్వాత జగపతిబాబు, శ్రీకాంత్, తరుణ్ తదితర హీరోల సరసన నటించారు. 2013లో విడుదలైన ‘చక్కనైన అబ్బాయి-చుక్కలాంటి అమ్మాయి’ సినిమా తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు. నాగ్‌తో నటించనున్న చిత్రంతో విమలా రామన్ రీ-ఎంట్రీ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement