మోడల్‌గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది విమలా రామన్. మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోనూ అనేక చిత్రాలు చేసింది. ఎవరైనా ఎపుడైనా, కులుమనాలి, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చట్టం వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనున్నట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్ హీరో కమ్ విలన్ వినయ్‌రాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విమల త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా కొన్నేళ్లుగా వినయ్-విమల లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే! తరచూ వీళ్లిద్దరూ విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు. ఆ మధ్య మాల్దీవులు వెళ్లిన ఈ జంట అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది.
వినయ్ రాయ్ విషయానికి వస్తే అతడు 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన ఈ హీరో జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై వంటి పలు హిట్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్ సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు. డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు) చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రస్తుతం అతడు హీరో సూర్య నిర్మిస్తున్న 'ఓ మై డాగ్' సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment