ponnada
-
హీరోయిన్ పూజిత పొన్నాడ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్‌తో రహస్యంగా దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి? ఆమె ఏమందంటే..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్‌తో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది. -
బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..) ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్‌స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
గ్రామాల్లో విజృంభిస్తున్న విష జ్వరాలు
-
ఇద్దరు కూలీలు సజీవ సమాధి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ పైప్‌లైన్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. దాంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఓ రైతు పొలంలో లైప్ లైను వేస్తున్న సమయంలో చెరువు కట్ట మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో కొయ్యల వాసు, రఘునాథ్ అనే వ్యక్తులు మృతి చెందారు. జేసీబీల ద్వారా మట్టిని తొలగించి మృతదేహాలను వెలిగి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.