Bigg Boss 6 Telugu Today Latest Promo: Is Baladitya Quit Smoking To Recharge Battery - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలి: బిగ్‌బాస్‌

Published Wed, Oct 12 2022 4:04 PM | Last Updated on Fri, Oct 14 2022 12:02 AM

Bigg Boss 6 Telugu Promo: Is Baladitya Quit Smoking - Sakshi

బిగ్‌బాస్‌ షో మొదలై ఆరు వారాలైందో లేదో అప్పుడే ఇంటిసభ్యుల మీద వరాల జల్లు మొదలైంది. కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యుల మీద బెంగను తీర్చుకునే అవకాశం కల్పిస్తున్నాడు బిగ్‌బాస్‌. ఇప్పటికే శ్రీహాన్‌ తన తల్లి వండిన మటన్‌ బిర్యానీని ఆరగించగా ఆదిరెడ్డి భార్యాబిడ్డలతో వీడియో కాల్‌ మాట్లాడాడు. ఈ రోజు మిగతా హౌస్‌మేట్స్‌కు సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే అదే సమయంలో వారి నుంచి కొన్ని త్యాగాలు కోరుతున్నాడు బిగ్‌బాస్‌. ఈ మేరకు తాజాగా రిలీజైన ప్రోమోలో పెద్ద తిరకాసే పెట్టాడు.

ఇంటిసభ్యులందరూ ఏమీ తినకూడదు లేదంటే బాలాదిత్య సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలి.. అప్పుడే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్‌ అవుతుందన్నాడు. అందరూ ఇబ్బందిపడేకంటే తనే సిగరెట్‌ మానేస్తానన్నాడు బాలాదిత్య. అతడు స్మోక్‌ చేయకుండా చూడాల్సిన బాధ్యత కెప్టెన్‌దేనని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇకపోతే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన అర్జున్‌.. తనకిచ్చిన మూడు ఆప్షన్‌లు ఎంచుకోకుండా.. సత్య గురించి తెగ ఆలోచించాడు. తనకే ఆప్షనూ వద్దని వీలైతే సత్య తన తల్లితో మాట్లాడేలా చూడండని వేడుకున్నాడు. కానీ అది కుదరదనడంతో తండ్రితో వీడియోకాల్‌ ఎంచుకున్నాడు. తండ్రిని చూడగానే అర్జున్‌ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరోవైపు గీతూ తనకు పిల్లి బొచ్చు, ఆడియో కాల్‌ రెండూ కావాలని కోరింది. మరి బిగ్‌బాస్‌ గీతూ అడిగిన రెండు కోరికలను నెరవేరుస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: ఘోరమైన బూతు, అదేంటో తెలిస్తే ఇనయ చెప్పుతో కొడుతుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement