హౌస్‌మేట్స్‌కు ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నాడు బిగ్‌బాస్. మొదట ఫుడ్ కట్ చేసి ముప్పు తిప్పలు పెట్టిన బిగ్‌బాస్ ఫుడ్ కోసం, ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడాలని చెప్పాడు. వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు రకరకాల టాస్కులు పెట్టాడు. అయితే ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడే క్రమంలో ఇంటిసభ్యులు బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఆడారు. ఇందులో ఇనయ టీమ్ గెలవగా శ్రీసత్య టీమ్ ఓడినట్లు తెలుస్తోంది. దీంతో ఓడిన టీమ్‌లో నుంచి ఒకరిని తర్వాతి వారానికి నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
దీంతో శ్రీసత్య, అర్జున్ ఒకరి పేర్లను మరొకరు సూచించారు. మెరీనా, వాసంతి.. గీతూను సూచించారు. రాజ్.. వాసంతి పేరును ఎత్తడంతో ఆమె ఒంటికాలిపై లేచింది. 'ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ తర్వాత ఎన్ని ఆటలు ఆడలేదు, అయినా సరే తీసుకొచ్చి లీస్ట్‌లో నిలబడితే ఎంత బాధుంటుంది' అని ఏడ్చేసింది. ఫైనల్‌గా వాసంతిని నామినేషన్‌లోకి పంపించారు.
చదవండి: ఆదిరెడ్డిన కొట్టేసిన వాసంతి, అనుకోకుండా అంటూ కవరింగ్
Comments
Please login to add a commentAdd a comment