Bigg Boss 6 Telugu: Arjun Kalyan Might Get Eliminated For This Week - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఆ గొడవే మైనస్‌.. చివరకు ఎలిమినేట్‌!

Published Sat, Oct 22 2022 6:39 PM | Last Updated on Sat, Oct 22 2022 7:24 PM

Bigg Boss 6 Telugu: Arjun Kalyan Might Get Eliminated For This Week - Sakshi

చూస్తుండగానే బిగ్‌బాస్‌ షో ఏడోవారం ముగింపుకు చేరుకుంది. అంటే ఇంట్లో నుంచి మరొకరిని బయటకు పంపించే సమయం ఆసన్నమైంది. సండే ఎపిసోడ్‌ షూటింగ్‌ ఈరోజే జరుగుతుంది కాబట్టి ఎప్పటిలాగే లీకువీరులు ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనే విషయాన్ని లీక్‌ చేసేశారు. అర్జున్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడని చెప్తున్నారు. నామినేషన్‌, ఎలిమినేషన్‌ అన్నీ వాళ్లు చెప్పినట్లే జరుగుతోంది. ఈ లెక్కన అర్జున్‌ ఎలిమినేషన్‌ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 

నిజానికి అర్జున్‌ మాట్లాడటంలో తడబడ్డా ఆటలో మాత్రం తడబడడు. ఇప్పుడిప్పుడే శ్రీసత్య వెనకాల తిరగడం మానేసి ఆట మీద దృష్టి పెట్టాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. జరగరాని నష్టం జరిగిపోయింది. ఒక మాట మీద నిలబడలేని ఈ కన్ఫ్యూజన్‌ మాస్టర్‌ ఈ వారం రేవంత్‌తో గొడవకు దిగాడు. ఒక్క ఈ వారమేంటి, చాలాసార్లు తన ఫ్రెండ్‌ రేవంత్‌తోనే గొడవపడ్డాడు. కాకపోతే ఈసారి శ్రీసత్య ఉసిగొల్పడంతో కావాలని కయ్యానికి కాలు దువ్వాడు, చివరికి చేతులు కాల్చుకుని తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేస్తున్నాడు.

చదవండి: మాట మార్చిన శ్రీసత్య, ఆమె ప్లాన్‌కు వాసంతి బలి
రేవంత్‌కు క్లాస్‌ పీకిన నాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement