రేప్ నకు గురవుతున్నా యాప్స్ పట్టించుకోవు!
న్యూయార్క్: మహిళల రక్షణార్థం ఎన్నో యాప్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ అవి నిజంగానే వారి మాన, ప్రాణాలు పోకుండా అడ్డుకట్ట వేస్తున్నాయా అంటే లేదనే సమాధానాలు వస్తున్నాయి. స్టాన్ ఫోర్డ్ వర్సిటీకి చెందిన ఓ రీసెర్చర్ అడమ్ ఎస్ తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. 7 ప్రముఖ మొబైల్ సంస్థల ప్రతినిధులను యాప్స్ గురించి ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరియైన జవాబులు రాలేదని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఆయా కంపెనీల స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్స్ ను పరీక్షించి చూసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా యువతులు, మహిళలు అత్యాచారానికి గురైతున్నా, వారితో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా, ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన సందర్భంలోనూ యాప్స్ వారిని సురక్షితంగా ఉంచుతాయని స్మార్ట్ ఫోన్ సంస్థలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
'సిరి' యాప్ కూడా ఇదే కోవలోకి చేరిపోయింది. యాపిల్, ఆండ్రాయిడ్, విండోస్ లోని కొర్టానా, శాంసంగ్ లోని ఎస్ వాయిస్ సంస్థలకు చెందిన అధికారులను సుదీర్ఘంగా యాప్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.
7 రకాల స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన 68 మొబైల్స్ ను పరీక్షించారు. కొర్టానా యాప్ ఉన్న విండోస్ మాత్రమే అత్యాచారం జరిగే సందర్భాలలో హెల్ప్ లైన్లకు సమాచారం అందిస్తుందట. సూసైడ్ అంశానికి సంబంధించి సిరి, గూగుల్ నౌ యాప్స్ ఉన్న యూజర్ మొబైల్స్ నుంచి హెల్ప్ లైన్లకు అలర్ట్ వెళ్తుందని వెల్లడించారు. డిప్రెషన్ కు లోనైనప్పుడు అలర్ట్ వాడితే 'సిరి' యాప్ ఇచ్చిన రిప్లై అంత ప్రభావం చూపేలా లేదు. 'ఐయామ్ వెరీ సారీ' మీ సమస్యను వేరే ఎవరినైనా సంప్రదించండి అనే సమాధానం వచ్చింది. సూసైడ్ అంశానికి సంబంధించి సిరి, గూగుల్ నౌ యాప్స్ ఉన్న యూజర్ మొబైల్స్ నుంచి హెల్ప్ లైన్లకు అలర్ట్ వెళ్తుందని వెల్లడించారు.
డిప్రెషన్ కు లోనైనప్పుడు అలర్ట్ వాడితే 'సిరి' యాప్ ఇచ్చిన రిప్లై అంత ప్రభావం చూపేలా లేదు. 'ఐయామ్ వెరీ సారీ' మీ సమస్యను వేరే ఎవరినైనా సంప్రదించండి అనే సమాధానం వచ్చింది. సూసైడ్ అంశానికి సంబంధించి సిరి, గూగుల్ నౌ యాప్స్ ఉన్న యూజర్ మొబైల్స్ నుంచి హెల్ప్ లైన్లకు అలర్ట్ వెళ్తుందని వెల్లడించారు. డిప్రెషన్ కు లోనైనప్పుడు అలర్ట్ వాడితే 'సిరి' యాప్ ఇచ్చిన రిప్లై అంత ప్రభావం చూపేలా లేదు. 'ఐయామ్ వెరీ సారీ' మీ సమస్యను వేరే ఎవరినైనా సంప్రదించండి అనే సమాధానం వచ్చింది. ఇతర మొబైల్ యాప్స్ అయితే ఈ విషయంలో మరీ నిర్లక్ష్యపూరితంగా పనిచేస్తున్నాయని అమెరికా రీసెర్చర్స్ చెబుతున్నారు.