పెద్దంచు పట్టుచీర.. | new fashion in this sankranti festival | Sakshi
Sakshi News home page

పెద్దంచు పట్టుచీర..

Published Tue, Jan 13 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

పెద్దంచు పట్టుచీర..

పెద్దంచు పట్టుచీర..

గిర్రున తిరిగే కాలం అన్నింటా కొత్తను పరిచయం చేస్తుంటే.. ఫ్యాషన్ ప్రపంచం మాత్రం పాత పోకడలనే కొంగొత్తగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూత్రాన్ని వంట బట్టించుకున్న ఫ్యాషన్ డిజైనర్లు.. ఆ పాత డిజైన్లకు మెరుగులద్ది ఈతరం మనసు దోచుకుంటున్నారు. పెద్దంచు పట్టు చీరలను మళ్లీ పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు.
 -  సిరి

అమ్మమ్మలు, నానమ్మల కాలంలో నీట్‌గా కనిపించిన పెద్దంచు చీరలు ఆ తర్వాత తరానికి వచ్చే సరికి నాటుగా అనిపించాయి. అందుకే ఒకప్పుడు ఆరు నుంచి ఎనిమిది అంగుళాలుగా ఉన్న పెద్దంచు కాస్త చిన్నబోయి రెండు మూడు ఇంచులకు చేరింది. అయితే రోజుకో థీమ్‌తో ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి చేరుతున్న డిజైన్లలో పెద్దంచు చీరలు మళ్లీ తళుక్కుమంటున్నాయి. తెలుగింటి పండుగ సంక్రాంతి, ఆ తర్వాత మొదలవుతున్న పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త పట్టు చీరలను తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు.
 
ఇంచు ఇంచులో ఫ్యాషన్..

లేటెస్ట్‌గా వస్తున్న హెవీ బార్డర్ శారీస్.. నయా ఫ్యాషన్స్‌ను ముడి వేసుకుని మెరిసిపోతున్నాయి. రిచ్, వైబ్రెంట్ కలర్స్‌లో మగువల మతులు చెదరగొడుతున్నాయి. హ్యాండ్ వోవెన్ సిల్క్స్, మిక్స్ అండ్ మ్యాచ్ వీవ్స్, కాంచీవరం, బెనారస్, లినెన్, ఖాదీ, జూట్ సిల్క్స్ వీటన్నింటినీ కలగలిపి ఈ కాంటెంపరరీ హెవీ బార్డర్ శారీస్ తయారు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.  వీటి ధర రూ.3 వేల నుంచి రూ.లక్షల దాకా పలుకుతున్నాయి.
 
హుందాగా కనిపిస్తారు..


హెవీ బార్డర్ వెడ్డింగ్ కలెక్షన్‌కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరిగింది. ఆధునికతకు స్వాగతం పలుకుతున్న యువతులు కూడా పెద్దంచు చీరలపై మనసు పడుతున్నారు. ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు బార్డర్ ఉండేలా డిజైన్ చేయించుకుంటున్నారు. రేర్ కలర్స్ కాంబినేషన్‌లో గోల్డ్, సీక్వెన్స్, ఆంటిక్ కలర్‌లను ప్రిఫర్ చేస్తున్నారు. వీటికి కాంబినేషన్‌గా కాంట్రాస్ట్ కలర్ హెవీ నెక్, మహారాణి నెక్ బ్లోవ్స్‌ను ధరిస్తున్నారు. హై నెక్, దానిపై వర్క్ ఉండటం వల్ల ఈ తరహా బ్లౌస్‌లు ధరించినపుడు హెవీ జ్యువెలరీ వేసుకోకున్నా హుందాగా కనిపిస్తారు.
 - అమృత మిశ్రా, ఫ్యాషన్ డిజైనర్
 
నచ్చుతాయి.. నప్పుతాయి..

నాకు చీరలంటే ఇష్టం. చిన్నప్పుడు అమ్మ చీరలన్నీ చుట్టేసుకునేదాన్ని. ఇక పెళ్లిళ్లు, పేరంటాళ్లకు వెళ్తే ఏదో శారీ ఎగ్జిబిషన్‌కు వెళ్లినట్టు అనిపిస్తుంటుంది. అందరూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు. రోజు రోజుకీ డిఫరెంట్ ఫ్యాషన్స్ వస్తున్నాయి. హెవీ బార్డర్ వెడ్డింగ్ కలెక్షన్ సూపర్బ్‌గా ఉంది. డిఫరెంట్ డిజైనింగ్స్‌తో వస్తున్న ఈ శారీలు అందరికీ నచ్చుతాయి, నప్పుతాయి కూడా.
 - అర్చన, సినీ నటి
 
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement