Old Is Gold
-
రంజుగా రాజకీయం.. తెల్లవారక ముందు గోడల ముందు వాలిపోతున్నారట!
కొత్తొక వింత..పాతొక రోత.. అనే సామెత పాతపడిపోయింది. ఇప్పుడు పాత దాన్నే సరికొత్తగా బయటికి తీస్తోంది నేటి తరం. కొందరు ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంటే..మరికొందరు దాన్ని ఫాలో అవుతుంటారు. రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారానికి సరికొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. పాతవాటినే కొత్తగా వాడుతున్నారు. నల్గొండ జిల్లాలో పాత ప్రచార విధానమే లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. అదేంటో చదవండి. గోడలపై ప్రచారం తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. రోజువారి కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏం చేస్తే ఓటర్లు తమవైపు చూస్తారో అని పొలిటికల్ మైండ్స్ తెగ ఆలోచిస్తున్నాయట నల్లగొండ జిల్లాలో. ఆ క్రమంలోనే కనుమరుగైన ఒకనాటి ప్రచార ఆయుధాన్ని తెరపైకి తీసుకొచ్చారట. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అయినా... ఏదైనా పార్టీ బహిరంగ సభ జరిగితే వాల్ రైటింగ్స్‌ను విపరీతంగా రాయించేవారు. టెక్నాలజీ పెరుగుతుండటంతో గోడ రాతలు చాలా కాలం క్రితమే కనుమరుగయ్యాయి. దీంతో ఎందరో పెయింటర్స్ ఉపాధి కోల్పోయారు. చాలా కాలం తర్వాత రాజకీయ నేతల కారణంగా మరోసారి బ్రష్‌లను చేతపట్టుకున్నారట గోడల మీద రాయగలిగే పెయింటర్స్. వాల్.. సవాల్ ఎన్నికలు వచ్చినపుడు వివిధ పార్టీల అభ్యర్థులు సాధారణంగా గోడ మీద రాతలతో తమ ప్రచారం చేసుకునేవారు. గోడల్ని ముందుగానే రిజర్వ్ చేసుకునేవారు. కాని నల్గొండ జిల్లాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికలకు ఇంకా 8 మాసాల టైమ్ ఉండటంతో అభ్యర్థులు కావాలనుకుంటున్నవారు గోడలకెక్కుతున్నారు. టికెట్ ఆశించే నేతలు నీ పెతాపమో..నా పెతాపమో గోడల మీద చూసుకుందాం రా అని సవాళ్ళు విసురుకుంటున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వాల్ రైటింగ్సే దర్శనం ఇస్తున్నాయి. ఒకే పార్టీకి చెందిన నేతలే పోటాపోటీగా గోడ రాతలు రాయిస్తున్నారట. బీఆర్ఎస్కు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి...అదే పార్టీ టికెట్ ఆశిస్తున్న పిల్లి రామరాజు యాదవ్... ఇంకొకరు చాడా కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈ ముగ్గురు నేతల రాతలే తీవ్ర చర్చనీయాంశం అయ్యాయట నల్లగొండ సెగ్మెంట్లో. అక్కడా.. ఇక్కడా కాదు పాడుబడిన బంగ్లాల గోడలపై కూడా గృహప్రవేశం చేసేవారిలా సున్నాలు వేసి రంగులతో రాయిస్తున్నారు. నాయకుల ప్రచారయావ జనానికి నవ్వు తెప్పిస్తున్నా... రాత్రిళ్లు అటు చూడాలంటేనే భయం వేసేలా ఉండే పాడుబడిన భవనాల గోడలు సున్నాలతో మెరుస్తుండటంతో సంతోష పడుతున్నారట. రాజకీయం.. రంగుల మయం తెల్లవారక ముందే పెయింటర్స్ కలర్ డబ్బాలతో రాతలు రాసేందుకు ఖాళీగా ఉన్న గోడల ముందు వాలిపోతున్నారట. నేతల పోటాపోటీతో...ఇంతకుముందు.. మీ సెప్టిక్ ట్యాంక్ నిండిందా..ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి అని కనిపించే ప్రకటనలకు చోటు లేకుండా పోయిందట. ఇదే సమయంలో పోస్టర్లు, ఫ్లెక్సీలతోనూ నేతలు చిన్నసైజు యుద్ధమే చేస్తున్నారట. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పిల్లి రామరాజు, బీజేపీ నేత నాగం వర్షిత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారట. కంచర్ల భూపాల్ రెడ్డి ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధికి సంబంధించిన పోస్టర్లను అతికిస్తుండగా ఆయనకు పోటీ నేతగా ప్రచారంలో ఉన్న పిల్లి రామరాజు కూడా వేలాదిగా పోస్టర్లను అతికిస్తున్నారట. నల్లగొండ అసెంబ్లీ సీటుకు బీజేపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న నాగం వర్షిత్ రెడ్డి కూడా ప్రధాన సర్కిల్స్‌లో భారీగా ఫెక్సీలను ఏర్పాటు చేస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. అధికార పార్టీకి ధీటుగా వర్షిత్‌రెడ్డి కూడా ప్రజల్ని ఆకర్షించేందుకు ఫెక్సీ వార్‌కు దిగడంతో రాజకీయం రంజుగా మారింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు జనాలను ఆకర్షించేందుకు పాత, కొత్త పద్ధతులను ఎంచుకోవడంతో పెయింటర్స్‌తో పాటు ప్రింటిగ్ ప్రెస్ వారికి ఉపాధి దొరుకుతోంది. రాజకీయ నాయకుల ప్రచారం కోసం సాగుతున్న గోడ రాతల యుద్ధం శ్రుతి మించకుండా ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
పెద్దంచు పట్టుచీర..
గిర్రున తిరిగే కాలం అన్నింటా కొత్తను పరిచయం చేస్తుంటే.. ఫ్యాషన్ ప్రపంచం మాత్రం పాత పోకడలనే కొంగొత్తగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూత్రాన్ని వంట బట్టించుకున్న ఫ్యాషన్ డిజైనర్లు.. ఆ పాత డిజైన్లకు మెరుగులద్ది ఈతరం మనసు దోచుకుంటున్నారు. పెద్దంచు పట్టు చీరలను మళ్లీ పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు. - సిరి అమ్మమ్మలు, నానమ్మల కాలంలో నీట్‌గా కనిపించిన పెద్దంచు చీరలు ఆ తర్వాత తరానికి వచ్చే సరికి నాటుగా అనిపించాయి. అందుకే ఒకప్పుడు ఆరు నుంచి ఎనిమిది అంగుళాలుగా ఉన్న పెద్దంచు కాస్త చిన్నబోయి రెండు మూడు ఇంచులకు చేరింది. అయితే రోజుకో థీమ్‌తో ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి చేరుతున్న డిజైన్లలో పెద్దంచు చీరలు మళ్లీ తళుక్కుమంటున్నాయి. తెలుగింటి పండుగ సంక్రాంతి, ఆ తర్వాత మొదలవుతున్న పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త పట్టు చీరలను తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. ఇంచు ఇంచులో ఫ్యాషన్.. లేటెస్ట్గా వస్తున్న హెవీ బార్డర్ శారీస్.. నయా ఫ్యాషన్స్‌ను ముడి వేసుకుని మెరిసిపోతున్నాయి. రిచ్, వైబ్రెంట్ కలర్స్‌లో మగువల మతులు చెదరగొడుతున్నాయి. హ్యాండ్ వోవెన్ సిల్క్స్, మిక్స్ అండ్ మ్యాచ్ వీవ్స్, కాంచీవరం, బెనారస్, లినెన్, ఖాదీ, జూట్ సిల్క్స్ వీటన్నింటినీ కలగలిపి ఈ కాంటెంపరరీ హెవీ బార్డర్ శారీస్ తయారు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. వీటి ధర రూ.3 వేల నుంచి రూ.లక్షల దాకా పలుకుతున్నాయి. హుందాగా కనిపిస్తారు.. హెవీ బార్డర్ వెడ్డింగ్ కలెక్షన్‌కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరిగింది. ఆధునికతకు స్వాగతం పలుకుతున్న యువతులు కూడా పెద్దంచు చీరలపై మనసు పడుతున్నారు. ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు బార్డర్ ఉండేలా డిజైన్ చేయించుకుంటున్నారు. రేర్ కలర్స్ కాంబినేషన్లో గోల్డ్, సీక్వెన్స్, ఆంటిక్ కలర్లను ప్రిఫర్ చేస్తున్నారు. వీటికి కాంబినేషన్‌గా కాంట్రాస్ట్ కలర్ హెవీ నెక్, మహారాణి నెక్ బ్లోవ్స్ను ధరిస్తున్నారు. హై నెక్, దానిపై వర్క్ ఉండటం వల్ల ఈ తరహా బ్లౌస్‌లు ధరించినపుడు హెవీ జ్యువెలరీ వేసుకోకున్నా హుందాగా కనిపిస్తారు. - అమృత మిశ్రా, ఫ్యాషన్ డిజైనర్ నచ్చుతాయి.. నప్పుతాయి.. నాకు చీరలంటే ఇష్టం. చిన్నప్పుడు అమ్మ చీరలన్నీ చుట్టేసుకునేదాన్ని. ఇక పెళ్లిళ్లు, పేరంటాళ్లకు వెళ్తే ఏదో శారీ ఎగ్జిబిషన్‌కు వెళ్లినట్టు అనిపిస్తుంటుంది. అందరూ కలర్ఫుల్గా కనిపిస్తారు. రోజు రోజుకీ డిఫరెంట్ ఫ్యాషన్స్ వస్తున్నాయి. హెవీ బార్డర్ వెడ్డింగ్ కలెక్షన్ సూపర్బ్‌గా ఉంది. డిఫరెంట్ డిజైనింగ్స్‌తో వస్తున్న ఈ శారీలు అందరికీ నచ్చుతాయి, నప్పుతాయి కూడా. - అర్చన, సినీ నటి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
Gold పాతధనానికి ఆసరా
కాలం కాంతికన్నా వేగంగా పరుగెడుతుంటే.. టెక్నాలజీ డే టు డే అప్డేట్ అవుతుంటే.. అప్పటిదాకా డామినేట్ చేసినవి కొన్ని కాలచక్రంలో అడుగున పడ్తాయి.. ఇంకొన్ని కరిగి క లసిపోతాయి.. అలాంటి జ్ఞాపక చక్రంలో పైకొచ్చినప్పుడు.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది.. అపురూపమన్న భావన కలిగిస్తుంది.. అలాంటి వస్తువుల సేకరణ కొందరికి అభిరుచి.. ఇంకొందరికి వ్యాపారం. సయ్యద్ జహంగీర్ మొదటి కోవలోని వ్యక్తి... నిశాత్ అహ్మద్ రెండో తరహా వ్యక్తి! పిండిమర కన్నా ముందున్న తిరగలి.. గ్రైండర్ రీప్లేస్ చేసిన రోలు, రోకలి.. డిజిటల్ వాచ్‌ల వెనక కనుమరుగైన పెండలం గడియారాలు.. బ్లూ రేతో వినిపించకుండా.. కనిపించకుండాపోయిన గ్రామ్ఫోన్లు.. ఎక్కా (చిమ్నీ)లను ఆర్పేసిన చార్జింగ్ లైట్స్.. అప్డేట్ అయిన భూతద్దాలు, బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లతో మూలనపడ్డ పాత మోడళ్లు.. ఇవన్నీ జ్ఞాపకాల ఊటలో తీపిని పెంచే కారకాలు. తలచుకుంటున్నకొద్దీ టన్నుల ఆనందాలను పంచుతాయి. వాటిని మూటగట్టి కావాలనుకుంటున్న వారికి పంచే పనిలో నిశాత్ ఉంటే.. ఆ మూటను అటక మీద పెట్టి భద్రపరిచే పనిలో జహంగీర్ మునిగిపోయాడు. శాలిబండ.. ముర్గీబజార్ ఇద్దరిదీ ఓల్డ్‌సిటీ. జహంగీర్ శాలిబండ నివాసి.. నిశాత్ ముర్గీచౌక్ వాసి. పాత వస్తువులపై ప్రేమ అనే కామన్ నేచర్ వాళ్ల వాళ్ల తండ్రుల నుంచి వారసత్వంగా అందుకున్నారిద్దరూ. గ్రామ్‌ఫోన్, చిమ్నీ, టెలిస్కోప్, దిక్సూచి, ఫొటోఫ్రేమ్స్, తాళాలు, భూతద్దాలు, హవర్ గ్లాస్ చివరకు పాతకాలం చేతికర్రలను కూడా సేకరించి దాస్తున్నారు. నిశాత్ అయితే అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వాటిని అమ్ముతున్నాడు కూడా. మూడోతరం ప్రతినిధి.. ఆ పాత మధురాల పర్యవేక్షణలో జహంగీర్ వాళ్ల కుటుంబంలో మూడోతరం ప్రతినిధి. ఈ పని జహంగీర్ వాళ్ల తాత సయ్యద్ అహ్మద్ నుంచి మొదలైంది. శాలిబండలో ఇప్పుడు జహంగీర్ నడుపుతున్న మెకానిక్ షాప్ ఆ తాత పెట్టిందే. గ్రామ్‌ఫోన్ రికార్డ్స్ అంటే ఆయనకు ప్రాణమట. ఆ కాలంలో ఆ రికార్డ్ ప్లేయర్ రిపేర్ పనిని ఇష్టంగా నేర్చుకొని అ దుకాణమే పెట్టుకున్నాడు. ఇది 1920నాటి సంగతి. తాత నుంచి జహంగీర్ తండ్రి సయ్యద్ మహమూద్కి ఆ షాప్ నిర్వహణతోపాటు ఆ అభిరుచీ వంశపారంపర్యమైంది. అయితే మహమూద్ హాబీ రెండు వస్తువులకు పెరిగింది. గ్రామ్‌ఫోన్‌తో పాటు రేడియోలు, కెమెరాలకూ పాకింది. ఈ ఇష్టానికి పక్కనే ఉన్న ఓ హిందూ ఫ్రెండూ తోడయ్యాడు. ఆయన రేడియోలు రిపేర్ చేస్తుండేవాడు. సయ్యద్ మహమూద్ ఎక్కడెక్కడి నుంచో రేడియోలు తెచ్చిస్తుంటే ఈయన వాటికి రిపేర్ చే సేవాడు. అలా జహంగీర్ తరం వచ్చేసరికి ఇల్లంతా వివిధ రకాల గ్రామ్‌ఫోన్ రికార్డ్ ప్లేయర్స్, రేడియోలు, కెమెరాలు, గోడ గడియారాలు లాంటి వస్తువులతో నిండిపోయింది. అయితే టేప్రికార్డ్ల మోతకే తట్టుకోలేక పోయినా జహంగీర్ వాళ్ల తాత పెట్టిన ఎలక్ట్రానిక్ అండ్ గ్రామ్‌ఫోన్ సెంటర్ బ్లూరే కాలంలో కేవలం ఎలక్ట్రానిక్ సెంటర్‌గా మాత్రమే మిగిలింది. అసాధారణ మెకానిక్ స్థాయి నుంచి సాధారణ మెకానిక్‌గా ఉండిపోయాడు. తాత, తండ్రులు మిగిల్చిపోయిన ఆ అపూర్వ ఆస్తికి పర్యవేక్షకుడిగా ఉన్నాడు జహంగీర్. నాటకాలు హౌస్‌ఫుల్‌గా ఆడుతున్న సమయంలో గ్రామ్‌ఫోన్ గళాలు కొంచెం గరగరమన్నా ఈ షాప్ ముందు క్యూ కనిపించేది. ఇప్పుడు ఆ కళలేదు.. అయినా వెలవెల బోవడంలేదు. ఎందుకంటే వెలకట్టలేని గొప్ప సంపదకు మ్యూజియంలా విరాజిల్లుతోంది జహంగీర్ నిలయం. ‘తాత, నాన్నలకు తమ అభిరుచినే వృత్తిగా మలచుకొనే భాగ్యం దొరికింది. కానీ నావరకు వచ్చేసరికి కేవలం అది హాబీగానే మారింది. ఇప్పుడు ఆ వస్తువులు లేవు. వాటిని మెచ్చే ఆసాములూ లేరు కాబట్టి మామూలు మెకానిక్‌గానే కుటుంబం కడుపు నింపే పనిలో పడ్డాను’ అంటాడు కొంచెం నిరాశగా జహంగీర్. రెండోతరం పని.. నిషాత్ అహ్మద్‌ది ఇంకో కథ. వాళ్ల నాన్న మఖ్బూల్ అహ్మద్‌కి కనుమరుగైన పాత వస్తువులు ఎక్కడ కనిపించినా డబ్బులిచ్చి మరీ కొనుక్కొని రావడం అలవాటు.. అభిరుచి. చిమ్నీ, టెలీస్కోప్, బైనాక్యులర్స్, హవర్‌గ్లాస్, దిక్సూచీలు, తాళాలు, భూతద్దాలు, గోడగడియారాలు, టేబుల్ క్లాక్‌లు, చేతికర్రలు ఇలా రకరకాలు. వీటిలో కొన్ని సేకరించినవి కూడా ఉన్నాయి. ఆఖరికి ఈ యాంటిక్ పీసెస్ అన్నిటితో ఓల్డ్ సిటీలోని ముర్గీచౌక్‌లో గిఫ్ట్ అండ్ నావెల్టీస్ అనే షాప్‌నే తెరిచాడు. తనలాంటి పాత వస్తువుల పిచ్చోళ్లకి వీటిని అమ్ముతాడు. ఆ పనిలోనే తండ్రి వారసత్వాన్ని అందుకున్నాడు నిషాత్. దేశంలో ఏ మూల ఈ యాంటిక్ పీస్ కనిపించినా రెక్కలు కట్టుకొని వాలిపోయి తెచ్చి షాప్‌లో పెట్టుకుంటాడు. అందుకే ఈ షాప్ ముందు అరుదైన కొనుగోలుదారులు కనిపిస్తుంటారు. తమకు కావల్సిన పాత వస్తువు ఆనవాలు చెప్పి వెదికిపెట్టే పనిని అప్పగిస్తుంటారు. ‘ఇలాంటి రేర్ కలెక్షన్‌ను కావాలనుకునే వాళ్లూ రేర్‌గానే ఉంటారు. అలాంటి వాళ్లకోసమే మా షాప్. మా దగ్గర 1904 నాటి కలె క్షన్ కూడా ఉంది. 1915నాటి టెలిస్కోప్, 1950ల నాటి ఫోన్లు వంటివున్నాయి. సామాన్యంగా ఎవరైనా ఆర్డరిచ్చింది కచ్చితంగా తెచ్చిపెడ్తాం. ఒక్కోసారి కొన్ని దొరకవు’ అని చెప్తాడు తన వ్యాపారం గురించి నిషాత్.గతకాలం మేలు వచ్చుకాలం కంటెన్.. అన్నది ఎంత నిజమో.. ఓల్డ్ థింగ్స్ ఇచ్చినవన్నీ గోల్డెన్ మూమెంట్సే అన్నవి కూడా అంతే నిజం! నిశాత్ అహ్మద్