Bigg Boss 5 Telugu,10th Week Nomination List: బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే నామినేషన్స్‌తో హోరెత్తిపోతుంది. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి సభ్యులు చేయని ప్రయత్నాలు, కుట్రలు ఉండవు. అయితే పదోవారం మాత్రం నామినేషన్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కాజల్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన సిరి, రవిలో చివరకు బకరాలయ్యారు. యానీ మాస్టర్‌పై ప్రేమను పెంచుకున్న బిగ్‌బాస్.. ఆమెకు వరుసగా స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. దీంతో పదోవారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురు ఎవరు? వారు ఎలా నామినేట్ అయ్యారు? సిరి, రవిలు వేసిన ప్లాన్ ఏంటి? బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులేంటి? చదివేయండి.
ప్రస్తుతం హౌజ్‌కి కెప్టెన్‌గా ఉన్నయానీ మాస్టర్‌ని ఎవరైన నలుగురు కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేసి జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో యానీ.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది.యానీ మాస్టర్ చేసిన నామినేషన్‌ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళాలను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరి నామినేట్ అయి జైలుకు వెళ్లాలి.
అయితే మొదట బజర్ మోగేసరికి పింకీ పరుగున వెళ్లి సంకెళ్లను చేజిక్కించుకుంది. వెంటనే మానస్‌ని జైలు నుంచి విముక్తి కల్పించింది. అయితే మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా.. చివరికి ప్రియాంక, మానస్‌లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు.
ఆ తర్వాతి బజర్‌కి సిరి తాళాలను దక్కించుకొని షణ్ముఖ్‌ని కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. అయితే తనను బయటకు తీసుకురావొద్దని ముందు సిరికి చెప్పాడు షణ్ముఖ్. అందుకే అతన్ని కాదని జెస్సీని విడిపించింది. బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి మానస్‌ని నామినేట్ చేసింది.
ఆ తరువాత జెస్సీ సంకెళ్లను చేజిక్కించుకుని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. షణ్ముఖ్‌కి నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. వారిలో ప్రియాంక జైలుకు వెళ్లింది. ఇక్కడ పింకీ, షణ్ముఖ్‌ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పడం పట్ల బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్‌లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్‌లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక కాజల్‌పై పగ పెంచుకున్న సిరి ఈ సారి ఎలాగైనా ఆమెను నామినేషన్స్‌కి పంపాలని కుట్రపన్నింది. కాజల్‌ని నామినేషన్స్‌లో ఉంచాలంటే ఇలా గేమ్ ఆడాలంటూ..
రవి, శ్రీరామ్, షణ్ముఖలకు ట్రైనింగ్ ఇచ్చింది. సిరికి మద్దతుగా నిలిచాడు రవి. బజర్ మోగగానే తాళాలను దక్కించుకొని ప్లాన్ ప్రకారం.. పింకీని బయటకు తీసుకొచ్చాడు.
ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్‌గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్‌ని మళ్లీ జైలు లోపలికి పంపాడు.
రవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం.. శ్రీరామ్ తాళలను దక్కించుకొని కాజల్‌ని సేవ్ చేశాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేయగా.. శ్రీరామ్ సిరిని ఫైనల్ చేసి జైలుకు పంపాడు. ఇలా కాజల్‌ని జైలులో ఉంచాలని కుట్ర పన్నిన సిరి... చివరకు ఆమె వల్లే జైలుపాలై నామినేషన్స్‌లో నిలిచింది.
మరోవైపు ఎలాంటి ఒప్పందం లేకుండా నిన్ను బయటకు తెచ్చానని.. నీకు చాన్స్ వస్తే సిరిని సేవ్ చేయాలని కాజల్‌పై ఒత్తిడి తెచ్చాడు శ్రీరామ్. దీనికి కాజల్ ఒప్పుకోలేదు. తన స్నేహితులైన మానస్, సన్నీలలో ఒకరిని బయటకు తెస్తానని చెప్పింది. అలా చెయ్యొద్దని, గతంలో లెటర్ త్యాగం చేసిన షణ్ముఖ్‌ని అయినా బయటకు తీసుకురా అని శ్రీరామ్ చెప్పడంతో.. కాజల్ అదే పని చేసింది. బయటకు వచ్చిన షణ్ముఖ్.. ట్విస్ట్ ఇస్తూ రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది.
చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా.. అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అన్నట్టు చివరిలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్ అయిన యానికి మరో పవర్ ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యులు కాకుండా మిగిలిన వారిలో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమని ఆదేశించాడు. దీంతో యానీ అంతా ఊహించినట్లే కాజల్‌ని నామినేట్ చేసింది. దంతో పదోవారం నామినేషన్స్‌లో మానస్, సిరి, కాజల్, రవి, సన్నీ ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ ఐదురురిలో ఎవరు పదోవారం బయటకు వెళ్లారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment