
బిగ్‌బాస్ అంటేనే వివాదాలు.. కాంట‍్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని చూసినా వారి మధ్య చిచ్చు పెడతాడు బిగ్‌బాస్. ఐదో సీజన్‌లో కూడా అదే పని చేశాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్.. ఇంటి సభ్యుల మధ్యవివాదానికి దారి తీసింది. ఎంతో స్నేహంగా కలిసి ఉండే రవి, విశ్వలు గొడవకు దిగారు. చలాకీగా ఉండి లోబో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ధైర్యంగా కనిపించే సన్నీ కంటతడి పెట్టాడు.ఇలా ఈ రోజు ఏపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో చదివేయండి మరి.
గుంటనక్క దొరికేసింది!
నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్ అయిన నటరాజ్ మాస్టర్.. హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క మంచి మనుషులుగా న్న ఏడుగురిని గొర్రెలుగా తయారు చేసిందని విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు యాంకర్ రవి మాస్టర్‌ని నిలదీశాడు. ఎందుకు అలా ఊహించుకుంటున్నావు? అది తప్పు అని రవి అనగా.. నేను ఊహించుకోవడం కాదు.. అది నిజం అని మరోసారి మాస్టర్ తనను తాను సమర్థించుకున్నాడు. దీంతో అసహనానికి గురైన రవి.. నువ్వు ఏమైనా దేవుడివా? ఎలా తెలుస్తుంది? నేనే ఎక్కిస్తున్నా అని అనుకుంటున్నావా? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి మాస్టర్ కాస్త వెతకారంగా ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? నీతో బానే ఉంటున్నాను కదా?అని చెప్పిన నటరాజ్ మాస్టర్.. వీజే సన్నీ అడిగినప్పుడు మాత్రం గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భూజాలు తడుముకున్నట్లు.. నా తను(రవి) నా దగ్గరకు వచ్చి అడిగేశాడు అని పరోక్షంగా రవినే గుంట నక్క అని చెప్పేశాడు.
రెండో వారం కూడా జన్యూన్ రీజన్స్ లేవు: ఉమాదేవి
ఇక లోబోని నామినేట్ చేసిన మానస్.. తను ఎందుకు చేశానో వివరించే ప్రయత్నం చేశారు. లోబో మాత్రం తాను కావాలని ఆయిల్ పోయలేదని, అనుకుంటే పడితే దాన్ని కారణం చెప్పి నామినేట్ చేశావని బాధపడ్డాడు. ఇక శ్వేత ఏమో ఉమాదేవి మాటలకు బాగా హర్ట్ అయినట్లుంది. ఆమె వయసుకి ఆమె మాట్లాడిన మాట్లాడిన మాటలకు పొంతనలేదని విమర్శించింది. మరోవైపు రవి, సిరి నటరాజ్ గుంటనక్క మాటలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆ మాటలతో మాస్టర్‌పై రెస్పెక్ట్ పోయిందని సిరి చెప్పుకొచ్చింది. రవి ఏమో నేను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే మాస్టర్ పట్టించుకోవడంలేదన్నాడు. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న ప్రియ, ఉమాదేవి.. నామినేషన్ గురించి చర్చించుకున్నారు. సెకండ్ వీక్ కూడా జన్యూన్ రీజన్స్ లేవని, అన్ని చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేశారని ఉమా చెప్పుకొచ్చింది.
లోబో యాటిట్యూడ్ అర్థం కావట్లేదు: రవి
నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా మానస్‌పై లోబో ఫైర్ అవ్వడాన్ని చర్చింకున్నారు రవి అండ్ లహరి. లోబో యాటిట్యూడ్ ఏంటో అర్థం కావట్లేదన్న రవి.. అతన్ని మంచి దారిలో తీసుకెళ్లి ఫ్రెండ్‌షిప్ మంచి అర్థం చెబుతానంటే నన్నే నామినేట్ చేస్తున్నాడని బాధను వ్యక్తం చేశాడు.
నా మొగుడితో అయినా అలానే మాట్లాడుతా: ఉమాదేవి
సన్నీ ఏమో ఉమాదేవికి గీతోపదేశం చేసే ప్రయత్నం చేశాడు. ఇంట్లో కోపం, ప్రేమ రెండూ ఉండాలని, ప్రేమగా మాట్లాడాలని ఆమెను రిక్వెస్ట్ చేశాడు. ఇక ఉమా ఏమో ఎప్పటి మాదిరే ‘నేను ఇలాగే ఉంటా, ఎవరితోనైనా ఇలానే మాట్లాడుతా’నని తెల్చిచెప్పింది. నేను మా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో అయినా కూడా అలానే మాట్లాడుతాను అంటూ ఉమా మరోసారి కౌంటర్ ఇచ్చింది. అందుకు సన్నీ అందరూ ఒకేలా ఉండరు ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారని చెబుతాడు. ఇక తన మెంటాలిటీ తన ఇష్టం అని ఎవరైనా అంగీకరిస్తే అంగీకరిస్తారు లేదంటే లేదు అని ఉమ మరో కౌంటర్ ఇస్తుంది.మరోవైపు కాజల్ దగ్గరకు వెళ్లిన సన్నీ.. నీలో స్వీట్‌నెస్, క్యూట్ నెస్ మిస్ అవుతుందని చెప్పాడు. నేను స్వీట్‌గా క్యూట్‌గా ఉంటే ఫేక్ అంటున్నారని, అయినా నా వాళ్ల ముందే నేను అలా ఉంటానని, ఇక్కడ నాకు ఆ ఫీలింగ్ రాలేదని, అందుకే ఇలా ఉంటున్నానని కాజల్ చెప్పింది.
‘పంథం నీదా నాదా’ సై
నిన్నటి నామినేషన్ కోసం రెండు టీమ్స్‌గా విడిపోయిన ఇంటి సభ్యులు.. ఇప్పుడు అదే టీమ్‌తో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనికి ‘పంథం నీదా నాదా’అనే టైటిల్‌ని పెట్టాడు. ఇందులో భాగంగా రెండు టీమ్స్ ఈ వారం వివిధ టాస్క్‌ల్లో పోటీ పడాల్సి వస్తుంది. తొలుత ‘దొంగలున్నారు జాగ్రత్త’అనే టాస్క్‌ని ఇచ్చాడు. ఇందులో భాగంగా యాక్టివిటీ ఏరియాలో రెండు టీమ్స్‌కి సంబంధించిన డగౌట్స్ ఉంటాయి. నక్క టీమ్( ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్)కు సంబంధించిన డగౌట్స్‌లో గద్ద టీమ్( లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక)కు చెందిన బ్యాటెన్స్(పిల్లోస్) ఉంటాయి. గద్ద టీమ్ డగౌట్స్‌లో నక్కటీమ్‌కు చెందిన పిల్లోస్ ఉంటాయి.
ప్రతి టీమ్ ఇతర టీమ్‌లోని డగౌట్స్‌లో ఉన్న పిల్లోస్‌ని తెచ్చుకొని తన డగౌట్స్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇతర టీమ్‌లోని పిల్లోస్‌ని వారికి దొరకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం టాస్క్ పూర్తయ్యే వరకు ఏ టీమ్‌లో ఎక్కువగా పిల్లోస్ ఉంటాయో అవే ఫ్లాగ్స్‌గా లెక్కించబడతాయి. చివరకు ఏ టీమ్ దగ్గరైతే ఎక్కువగా ఫ్లాగ్స్ ఉంటాయో వాళ్లే విజేతలుగా నిలుస్తారు. గెలిచిన టీమ్ నుంచే కెప్టెన్సీ కంటెండర్ ఎంచుకోబడతారు. ఈ టాస్క్‌ని ఇరు జట్లు సీరియస్‌గా తీసుకున్నాయి. పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని.. సిరి చాలా పెద్ద గొడవ చేస్తుంది. అయితే సన్నీ మాత్రం నేను అలా చేయలేదని చెప్పాడు.
కుప్పకూలిపోయిన లోబో.. మెడికల్ రూమ్‌కి తరలింపు
టాస్క్‌లో భాగంగా జరిగిన తోపులాటలో లోబో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. దీంతో ఇంటి సభ్యులంతా డాక్టర్‌ని రప్పించాలని బిగ్‌బాస్‌కు విన్నవించారు. బిగ్‌బాస్ ఆదేశంతో లోబోని మెడికల్ రూమ్‌కి తరలించారు. ఈ మధ్యలోనే రవి-విశ్వ మధ్య గొడవ జరిగింది. నక్క టీమ్ సభ్యుల నుంచి పిల్లోస్ లాక్కునేందకు శ్రీరామచంద్ర ప్రయత్నించడంతో... రవి ఫైర్ అయ్యాడు. రోబోకి అలా ఉంటే.. ఇప్పుడు కూడా గేమ్ అడుతారా ‘ఛీ’అంటూ గట్టిగా అరిచాడు. దీంతో గద్ద టీమ్ సభ్యుడైన విశ్వ.. మాటలు మంచిగా రానివ్వంటూ రవిపై సీరియస్ అయ్యాడు. తర్వాత రవి వెళ్లి విశ్వకి సారీ చెప్పాడు. మొత్తానికి ‘దొంగలున్నారు జాగ్రత్త’టాస్క్.. కంటెస్టెంట్స్‌ల్లోని కోపాన్ని వెలికితీసింది. ఇక రెండో టాస్క్ ‘సాగరా సోదరా’అయితే మరో రేంజ్‌లో ఉంటుందని ప్రోమో వదిలి చూపించాడు బిగ్‌బాస్. మరి రెండో టాస్క్‌లో గొడవలు ఏ స్థాయికి చేరాయో రేపటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment