నన్ను వాడుకుంటున్నావు: సిరికి షాకిచ్చిన షణ్ముఖ్‌ | Bigg Boss Telugu 5: Nagarjuna Save These Contestants For Fourth Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఈ వారం నాగ్‌ ఎవరిని సేవ్‌ చేశాడంటే?

Published Sat, Oct 2 2021 10:50 PM | Last Updated on Sat, Oct 2 2021 11:10 PM

Bigg Boss Telugu 5: Nagarjuna Save These Contestants For Fourth Week - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 28: జెస్సీని జైలు నుంచి విడుదల చేయడంతో వీకెండ్‌ ఎపిసోడ్‌ ప్రారంభమైంది. షణ్ముఖ్‌ తనను మళ్లీ దూరం పెడుతున్నాడని ఏడ్చేసింది సిరి. జెస్సీతో బానే ఉండి తనకు స్పేస్‌ ఇవ్వకపోవడంతో మండిపోతోంది అని కాజల్‌ దగ్గర వాపోయింది. అందుకే ఫ్రెండ్‌షిప్‌, కనెక్షన్స్‌ ఏమీ పెట్టుకోవద్దు, లేదంటే ఇదిగో ఇలా ఒకటే యాపారం ఉంటుందని అంది. తర్వాత షణ్ముఖ్‌, సిరి ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. 'మెంటల్లీ నెగెటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయి. నన్ను వాడుకుంటున్నారన్న ఫీలింగ్‌ వస్తోంది. జెస్సీతో నాకున్న బాండింగ్‌ వేరు, కాబట్టి వాడు నన్ను వాడుకున్నా ఆ ఫీలింగ్‌ రాదు. కానీ నీ విషయంలో అలా కాదు' అని సిరి ముఖం మీదే చెప్పాడు. నిన్ను వాడుకున్నారనుకోవడం నీ అభిప్రాయం, తప్పు అనడం లేదు. నేను నీ దగ్గరుంటే గేమ్‌పై ప్రెజర్‌ పడుతుందని ఫీలవుతున్నావ్‌, అంతేగా.. ఈ ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్‌ ఉంది కానీ చెప్పను, టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని చెప్పింది సిరి.

సింపతీ కార్డ్‌ వాడొద్దు: నాగ్‌ హెచ్చరిక
తర్వాత నాగార్జున.. ఇంటిసభ్యులకు హాయ్‌ చెప్తూనే.. జెస్సీ మీద జాలిపడ్డాడు. హౌస్‌లో అతడిని తొక్కేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తర్వాత లోబోను నామినేషన్స్‌లో అంతెత్తున అరిచేసి సారీ చెప్పడం కరెక్టా? అని ప్రశ్నించాడు. దీనికతడు తన ప్రేమ గురించి కామెంట్‌ చేయగానే హర్ట్‌ అయ్యానని, కానీ గొంతు చించుకోలేదని చెప్పాడు. దీంతో నాగ్‌ నామినేషన్స్‌ టైంలో లోబో అరిచిన వీడియోను ప్లే చేయమంటావా? అని ప్రశ్నించగానే అతడు నీళ్లు నమిలాడు. పదేపదే బస్తీ నుంచి వచ్చానంటూ సింపతీ కార్డ్‌ యూజ్‌ చేయొద్దని హితవు పలికాడు.

మీ వల్ల జెస్సీ సఫర్‌ అవుతున్నాడు
బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ను పంపించడంతో కంటెస్టెంట్లు వాటిని గబగబా ఆరగించారు. అయితే షణ్ముఖ్‌- సిరి జోడీకి మాత్రం ఘాటైన పచ్చిమిర్చిని పంపించాడు. ఈ సందర్భంగా నాగ్‌.. షణ్ముఖ్‌ కూర్చుని కబుర్లు చెప్తున్నాడని, అతడిలోని ఫైర్‌ బయటకు తీసుకురావాలని  మిర్చి పంపించాడని పేర్కొన్నాడు. నీ ఆట నువ్వు ఆడని సిరికి సూచిస్తూనే మీ వల్ల జెస్సీ సఫర్‌ అవుతున్నాడని తెలిపాడు. తర్వాత నాగ్‌ గిటార్‌ అందుకుని శ్రీరామ్‌ పాడిన పాట ప్లే చేశాడు. ఈ పాట వింటుంటే ఏం ఫీల్‌ వస్తుందని అడగ్గా.. హమీదా లవ్‌ ఫీల్‌ వచ్చిందని పేర్కొంది. దీంతో ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తోందని మరోసారి చెప్పకనే చెప్పాడు నాగ్‌. తర్వాత యాంకర్‌ రవి సేవ్‌ అయినట్లు ప్రకటించాడు.

లోబో ఉరిమి ఉరిమి చూస్తున్నాడు
అనంతరం నాగ్‌ హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్‌ ఆడించాడు. మొదటగా వచ్చిన రవి.. ప్రియాంక సింగ్‌ను అటెన్షన్‌ సీకర్‌గా పేర్కొన్నాడు. తర్వాత వచ్చిన ప్రియ.. లోబోను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటూ వాచ్‌ యువర్‌ టంగ్‌ అని పేర్కొంది. అతడు ఏం చేస్తానో తెలుసా? అంటూ భయపెట్టాడని, ఇప్పటికీ ఉరిమి ఉరిమి చూస్తున్నాడని చెప్పడంతో నాగ్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరూ సేఫ్‌ అని వెల్లడించాడు. తర్వాత మానస్‌.. లోబో బ్రెయిన్‌ వాడితే బాగుంటుందని సూచించాడు. ఇక లోబో, యానీ మాస్టర్‌ కూడా ప్రియాంక సింగ్‌ను అటెన్షన్‌ సీకర్‌గా పేర్కొన్నాడు. ఇంతలో ప్రియ కలగజేసుకుంటూ.. శ్రీరామ్‌- మానస్‌ మధ్య ఏదైనా ఫైటింగ్‌ జరిగితే.. నా రెండు కళ్లు కొట్టుకుంటున్నాయ్‌ అని పింకీ తెగ బాధపడిపోతుందని చెప్పుకొచ్చింది.

లోబో భార్యకు నాగ్‌ స్పెషల్‌ విషెస్‌
తర్వాత హమీదా.. సన్నీని బుర్ర వాడమని సూచించింది. కాజల్‌.. లోబో సింపతీ కోరుకుంటాడని పేర్కొంది. అనంతరం ప్రియ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. ఇక మళ్లీ గేమ్‌ కొనసాగగా నటరాజ్‌ మాస్టర్‌.. విశ్వ సింపతీ పొందాలని చూస్తాడని విమర్శించాడు. ఇక విశ్వ, సిరి.. లోబో మెదడు వాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇంతలో లోబో లేచి.. తన భార్య ఫాతిమా.. ఏడు నెలల గర్భవతి అని, ఆమెది ఈరోజు బర్త్‌డే అని చెప్పడంతో నాగ్‌ స్పెషల్‌ విషెస్‌ చెప్పాడు. ప్రియాంక సింగ్‌, శ్రీరామ్‌.. లోబోను, శ్వేత.. కాజల్‌ను వాచ్‌ యువర్‌ టంగ్‌ అని పేర్కొన్నారు.

సేవ్‌ అయితే నాలో కొత్త సిరిని చూస్తారు
తర్వాత వచ్చిన జెస్సీ.. రవిని మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌ అని వార్నింగ్‌ ఇచ్చాడు. నీ గేమ్‌ నువ్వు ఆడుకో, నా మీద ఫోకస్‌ పెట్టడం ఆపేయ్‌ అని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. దీంతో నాగ్‌ కూడా రవికి మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌ అని మరోసారి వార్నింగ్‌ ఇచ్చాడు. తర్వాత షణ్ముఖ్‌.. సిరిని బ్రెయిన్‌ వాడమని సలహా ఇచ్చాడు. దీంతో సిరి.. తాను సేవ్‌ అయితే రేపటినుంచి ఇంకో సిరిని చూస్తారని సవాలు విసిరింది. అనంతరం నాగ్‌.. సన్నీ, కాజల్‌ సేవ్‌ అయినట్లు వెల్లడించాడు. దీంతో లోబో, యానీ మాస్టర్‌, సిరి, నటరాజ్‌ మాస్టర్‌ ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో నటరాజ్‌ ఎలిమినేట్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement