
బిగ్‌బాస్ హౌస్‌లో కంట్రోల్ తప్పిన కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు వీకెండ్ ఎపిసోడ్ ద్వారా రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఎవరు అతి చేశారో? ఎవరు అసలు ఆట ఆడకుండా ఉన్నారో? ఎవరు ఇన్‌ఫ్లూయెన్నస్ చేస్తున్నారో? ఇలా అన్ని లెక్కలు బయటపెడుతూ ఒక్కొక్కరికీ గట్టిగానే క్లాసులు పీకుతున్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మొదటగా షణ్ముఖ్‌ను మిర్చి తినమని చెబుతూ.. గేమ్ ఆడకుండా కూర్చుని కబుర్లు చెప్తున్నావ్, అంతేనని పరువు తీసేశాడు. ఇక సిరిని.. నీ ఆట నువ్వు ఆడని వార్నింగ్ ఇచ్చాడు. మీ ఇద్దరి మూలంగా జెస్సీ సఫర్ అవుతున్నాడని బాంబు పేల్చాడు.
తర్వాత నామినేషన్స్ సమయంలో బయటపడ్డ లోబోలోని అపరిచితుడి బిహేవియర్‌ను ప్రస్తావిస్తూ అతడి తప్పులను ఎత్తి చూపాడు. అయితే లోబో మాత్రం నావరకు అంతా బరాబర్ చేశాను అని చెప్పగా.. అరవడం కూడా బరాబరేనా, అట్లాగే అరుస్తావా? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. దీంతో తటపటాయించిన లోబో గొంతైతే చించుకోలేదు సర్ అని ఆన్సరివ్వగా నాగ్ వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో లోబో.. ప్రియ పైపైకి వెళ్లి అరవడం స్పష్టంగా కనిపించింది. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న లోబో.. సారీ అంటూ నేలచూపులు చూశాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాను అని చెప్తున్నావు... ఇది బస్తీకాదు, విల్లా కాదు, బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ అందరూ సమానమే అని తేల్చి చెప్పాడు నాగ్. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు వాయింపులు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment