త్వరలో నీ గేమ్‌ బెడిసికొట్టే రోజొస్తుంది: రవికి కాజల్‌ వార్నింగ్‌ | Bigg Boss 5 Telugu: RJ Kajal Feels Anchor Ravi Is Slave | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: రవిని బానిసనను చేసిన కాజల్‌, ఆ రోజు దగ్గర్లోనే ఉందంటూ వార్నింగ్‌

Published Sat, Oct 9 2021 11:23 PM | Last Updated on Mon, Oct 11 2021 6:35 PM

Bigg Boss 5 Telugu: RJ Kajal Feels Anchor Ravi Is Slave - Sakshi

Bigg Boss Telugu 5, Episode 35: ఐదు రెట్ల ఫన్‌, ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐదు రెట్ల కాంట్రవర్శీ, ఐదు రెట్ల ఎఫైర్స్‌, ఐదు రెట్ల డ్రామా గ్యారెంటీ.. అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌. ఈ రియాలిటీ షో ప్రారంభమై అప్పుడే ఐదు వారాలు ముగిశాయి. ఈ వారం నామినేషన్‌లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరి వీరిలో నాగార్జున ఎవరిని సేవ్‌ చేశారు? ఎవరికి చీవాట్లు పెట్టారు? అనేది తెలియాలంటే నేటి (అక్టోబర్‌ 09) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

రవి అందరికీ బ్రెయిన్‌వాష్‌ చేస్తున్నాడు..
ఇంటిసభ్యులందరూ కలిసి తనను జైల్లో వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది కాజల్‌. ఈ క్రమంలో ఆమెను ఊరడించాల్సింది పోయి అగ్గిపుల్ల గీకాడు మానస్‌. నువ్వు సింపథీ కార్డ్‌ ప్లే చేస్తున్నావని యాంకర్‌ రవి తనతో అన్నాడంటూ కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అతడు హౌస్‌లో అందరికీ బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇది విన్న కాజల్‌ తన వెనక ఇంత కుట్ర జరుగుతోందా? అని ఓ లుక్కిచ్చింది.

సిరికి క్లాస్‌ పీకిన నాగ్‌
వీకెండ్‌ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు హాయ్‌ చెప్పిన నాగార్జున వచ్చీరాగానే శ్రీరామ్‌కు ఇబ్బందికర ప్రశ్న విసిరాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని సూటిగా అడిగేశాడు. దీంతో కొద్ది క్షణాలపాటు ఆలోచించిన శ్రీరామ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ అని తడుముకోకుండా ఆన్సరిచ్చాడు. అతడి సమాధానం విని మన్మథుడిలా నవ్వేసిన నాగ్‌.. నీ కెప్టెన్సీ బాగుందంటూనే, ఎవరి వంట వాళ్లు వండుకోవాలని ఆర్డర్‌ వేయడం బాగోలేదని చురకలంటించాడు. తర్వాత సిరిని నిల్చోబెట్టి క్లాస్‌ పీకాడు. రోజంతా పక్కవాళ్ల గురించి మాట్లాడటమే పనా? అని కడిగిపారేశాడు. ఎదుటివాళ్లకు నీతులు చెప్తాం కానీ మనం మాత్రం చేయమని కౌంటరిచ్చాడు. దీంతో సిరి సిగ్గుతో తలదించుకోక తప్పలేదు.

రకుల్‌ను ప్రేమించావా?: వైష్ణవ్‌కు నాగ్‌ సూటి ప్రశ్న
తర్వాత 'కొండపొలం' సినిమా టీమ్‌ బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేసింది. ఈ క్రమంలో నాగ్‌..  ఇంత చిన్నవయసులోనే రకుల్‌ను ప్రేమించేశావా అనడంతో వైష్ణవ్‌తేజ్‌ తెగ సిగ్గుపడ్డాడు. తర్వాత క్రిష్‌.. టాస్కులు ఆడకుండా ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో అతడు నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ప్రియాంక సింగ్‌ ఫినాలే గురించి మాట్లాడుతూ.. తనతో పాటు షణ్ముఖ్‌, రవి, మానస్‌, శ్రీరామ్‌ టాప్‌ 5లో ఉంటారని అభిప్రాయపడింది. కంటెస్టెంట్లను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టించిన అనంతరం వైష్ణవ్‌ తేజ్‌, క్రిష్‌ బిగ్‌బాస్‌ స్టేజీకి వీడ్కోలు పలికారు.

కావాలని వేలు చూపించలేదు: లోబో
ఎవరైనా మిడిల్‌ ఫింగర్‌ చూపించారా? అని నాగ్‌ కాజల్‌ను ప్రశ్నించగా ఆమె అవునని తలూపింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించాడు నాగ్‌. అందులో లోబో మిడిల్‌ ఫింగర్‌ చూపించినట్లు స్పష్టమైంది. అయితే తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేశాడు. దీంతో చల్లబడిన నాగ్‌.. చేసింది తప్పే.. కానీ కావాలని చేయలేదంటున్నావు, దాన్ని మేమంతా నమ్ముతున్నాం అనడంతో లోబో ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం నాగ్‌.. హౌస్‌మేట్స్‌తో రూలర్‌ ఎవరు? బానిస ఎవరు? అన్న టాస్క్‌ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్‌ ప్రియ.. శ్రీరామ్‌ రూలర్‌, హమీదా బానిస అని చెప్పింది. శ్రీరామ్‌.. హౌస్‌ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన కాజల్‌ రూలర్‌, షణ్ముఖ్‌ బానిస అని పేర్కొన్నాడు.

ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే రవి బానిస: కాజల్‌
కాజల్‌.. అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్‌గా, అందరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్‌ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని హెచ్చరించింది. ప్రియాంక సింగ్‌.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలైంది. రవి.. మానస్‌ను రాజుగా, ప్రియాంక సింగ్‌ను బానిసగా తెలిపింది. సన్నీని రాజుగా చూసుకుంటానంటూ మానస్‌.. తన బెస్ట్‌ ఫ్రెండ్‌కు కిరీటం ధరించాడు. శ్రీరామ్‌తో ఎక్కువ కనెక్ట్‌ అయి, గేమ్‌కు డిస్‌కనెక్ట్‌ అవుతున్నావంటూ హమీదాను బానిసగా ఫీలయ్యాడు.

ఈ వారం హమీదా కనిపించనేలేదు: షణ్ను
సన్నీ.. మానస్‌ రాజు, విశ్వ బానిస అని పేర్కొన్నాడు. లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్‌.. నాకు నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్‌.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్‌ చేశారని కౌంటరిచ్చాడు. దీంతో కొంత వెనక్కు తగ్గని షణ్ను.. మైండ్‌గేమ్‌ ఆడిన రవి కింగ్‌ అని చెప్తూనే, ఈ వారం మొత్తంలో హమీదా ఎక్కడా కనిపించలేదంటూ ఆమెను బానిసగా అభివర్ణించాడు. ఇక హమీదా.. మానస్‌ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే కాజల్‌ రాణి, ఇన్‌ఫ్లూయెన్స్‌ అయ్యే మానస్‌ బానిస అని అభిప్రాయపడింది. 

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజు..
జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్‌.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా పేర్కొంది. సిరి.. రవికి కిరీటం తొడిగించి రాజుగా అందలం ఎక్కించగా, శ్రీరామ్‌ను బానిసగా ఫీలైంది. తర్వాత విశ్వ వంతు రాగా.. అతడు రవిని రాజుగా కీర్తించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రవి అని మెచ్చుకున్నాడు. కెప్టెన్‌ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు. 9 మంది నామినేషన్‌లో ఉన్నప్పటికీ నాగార్జున ఈరోజు ఎవరినీ సేవ్‌ చేయకపోవడం గమనార్హం. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం హమీదా ఎలిమినేట్‌ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి,

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement