
Lobo In Bigg Boss 5 Telugu: లోబో మరో పేరు మహమ్మద్ ఖయ్యూం. స్కూలులో దొంగతనం చేసి దొరికిపోవడంతో అతడికి తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి పంపించేశారు. అలా మధ్యలోనే చదువు మానేసిన లోబో మొదట్లో టాటూ షాపులో పని చేసిన అతడు రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. ఆవిడే ఇతడికి లోబో అని పేరు పెట్టింది. తన కట్టుబొట్టు, మాట తీరు అన్నీ విభిన్నంగా ఉండటం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. తన స్టైల్‌కు తోడు హైదరాబాదీ యాసలో యాంకరింగ్ చేస్తూ జనాలను అలరించాడు.
నిజానికి లోబో గతంలోనే బిగ్‌బాస్ షోలో పాల్గొనాల్సింది కానీ అతడు తన ఎంట్రీని ముందుగానే లీక్ చేయడంతో నిర్వాహకులు తనను షోలోకి తీసుకోలేదు. ఇక బిగ్‌బాస్ అంతా స్క్రిప్టెడ్ అన్న లోబో షోలో అడుగుపెట్టాక తన మాట వెనక్కు తీసుకుంటాడా? ఏం జరుగుతుంది? అన్నది సస్పెన్స్‌గా మారింది.