
Bigg Boss Telugu 5, Lobo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్ లోబో తండ్రయ్యాడు. ఈ శుభవార్తను అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్యకు కవలలు జన్మించినట్లు చెప్పాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన అభిమానులు లోబోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా లోబో తన భార్య గర్భవతి అని, ఈ సమయంలో తనకు తోడుగా లేనంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తన కూతురు వీడియో చూసినప్పుడు సైతం ఫ్యామిలీ గుర్తొస్తుందంటూ ఏడ్చాడు. ఇక షో నుంచి బయటకు రాగానే కుటుంబంతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్న లోబో మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో లోబో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment