
Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే, చాలామంది హైదరాబాదీ యాంకర్ లోబో అని టపీమని చెప్పేస్తారు. ఓవైపు ముక్కుసూటిగా మాట్లాడుతూనే కంటెస్టెంట్లందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తున్నాడు. తన యాసతో, మాటలతో కావాల్సినంత కామెడీ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. నేటి ఎపిసోడ్‌లో అతడు చేసే కామెడీ మామూలుగా ఉండదని తెలుస్తోంది.
హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్‌తో కలిసి లోబో నవ్వులు పూయించనున్నట్లు వినికిడి. ఏదైనా టాస్క్ ఫలితమో, బిగ్‌బాస్ ఆదేశమో కానీ షణ్నూకి లోబో సేవకుడిగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. షణ్నూ చెప్పినట్లు నడుచుకోవడమే కాకుండా అతడి పనులను కూడా లోబోనే చేయాల్సి ఉంటుందట! ఈ టాస్క్‌ను ఇద్దరూ రెచ్చిపోయి చేస్తున్నట్లు సమాచారం. కాగా షణ్నూ చిన్నపిల్లాడంటూ అతడిని నామినేట్ చేయకుండా వదిలేసిన లోబో ఇప్పుడతడికి సేవకుడిగా ఎలా నడుచుకుంటాడో చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment