![Bigg Boss Telugu 5 Promo: Nagarjuna Asks Who Is Not Eligible To Stay In BB House - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/16/Bigg-boss_5.jpg.webp?itok=6A_HupmU)
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం జరిగిన గొడవలను తిరగదోడుతున్నాడు నాగార్జున. తప్పొప్పులను ఎత్తిచూపుతూ కంటెస్టెంట్లతో పంచాయితీ పెడుతున్నాడు. ఇదంతా పక్కనపెడితే రేపు జరగాల్సిన ఎలిమినేషన్‌ను ఈరోజే జరిపించేలా ఉన్నాడు నాగ్. తాజాగా రిలీజైన ప్రోమోలో అందరికీ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాననంటూ సస్పెన్స్ పెట్టాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పండి? అంటూ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ అడిగాడు. ఈ క్రమంలో అందరూ తలా ఒకరి పేరు చెప్పారు. ఫైనల్‌గా ప్రియకు, లోబోకు ఇద్దరికీ 4 ఓట్లు పడ్డాయి. దీంతో నాగ్.. వీరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో వారి పక్కన నిల్చోమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. మరి మెజారిటీ హౌస్‌మేట్స్ ఎవరిని సేవ్ చేసే అవకాశం ఉంది? ఎవరిని హౌస్‌లో నుంచి పంపించేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే నెటిజన్లు మాత్రం ఆ ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కు పంపించినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. కావాలంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టండని సూచిస్తున్నారు. ఇక ప్రోమో ఈ రేంజ్‌లో ఉన్నప్పటికీ ప్రియ, లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలైతే లేనట్లే కనిపిస్తోంది. ఇలా అర్ధాంతరంగా వారిని హౌస్‌లోంచి వెళ్లగొట్టే సాహసం చేయరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగ్ నిజంగానే బ్రేకింగ్ న్యూస్ చెప్తాడా? లేదా జనాలను ప్రాంక్ చేస్తాడా? అన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment