కాజల్‌కు మిడిల్‌​ ఫింగర్‌ చూపించిన లోబో, వేలు నరికేస్తానన్న పింకీ! | Bigg Boss Telugu 5: Lobo Shows Middle Finger To RJ Kajal | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: కాజల్‌కు లోబో అసభ్య సైగ, తానైతే వేలు నరికేసేదాన్నన్న పింకీ

Published Tue, Oct 5 2021 11:53 PM | Last Updated on Wed, Oct 6 2021 12:03 AM

Bigg Boss Telugu 5: Lobo Shows Middle Finger To RJ Kajal - Sakshi

Bigg Boss Telugu 5, Episode 31: కెప్టెన్‌ శ్రీరామ్‌ ఎప్పుడైతే ఎవరి ఫుడ్‌ వాళ్లు వండుకుని తినాలని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడో అప్పటినుంచి సిరి గ్యాంగ్‌కు యాంటీ అయిపోయాడు. జెస్సీ మాటతీరు వల్లే తాను అలా అనాల్సి వచ్చిందని అతడు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ సిరి, షణ్ను వినిపించుకోలేదు. జెస్సీ తన క్లోజ్‌ ఫ్రెండ్‌ కాబట్టి స్టాండ్‌ తీసుకున్నానని షణ్ను, అయినా మధ్యలో ఏజ్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నావని సిరి శ్రీరామ్‌ మీద ఒంటికాలిపై లేచారు. మొత్తంగా ఈ గొడవతో అటు సిరి, షణ్ను, జెస్సీ, ఇటు శ్రీరామ్‌, హమీదా ఏమీ తినకుండా ఫుడ్‌ మీద తమ ప్రతాపాన్ని చూపించారు.

తమ పేరెంట్స్‌కు టీవీ, వాచ్‌, స్మార్ట్‌ ఫోన్‌ గిఫ్టులుగా ఇచ్చిన కంటెస్టెంట్లు..
అయితే నీకు ఆకలేస్తే తినంటూ శ్రీరామ్‌ హమీదాను బుజ్జగించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో పస్తులతోనే పడుకున్నారు. అయితే తర్వాతి రోజు అందరూ వారి గిల్లికజ్జాలను పక్కన పెట్టి టిఫిన్‌ కుమ్మేసినట్లు కనిపించింది. అనంతరం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో భాగంగా పలువురు ఇంటిసభ్యులు వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కొట్టేశారు. ఇందుకోసం కెప్టెన్‌ శ్రీరామ్‌.. ప్రియ, షణ్ముఖ్‌, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు. మొదటగా ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. తర్వాత షణ్ముఖ్‌.. డైరెక్టర్‌ సుబ్బుకు ల్యాప్‌టాప్‌ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. మానస్‌.. తన తల్లికి బ్రాండెడ్‌ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు. హమీదా.. తన తల్లికి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది.

మజాక్‌ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్‌..
ఇక రవి, కాజల్‌ మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. నెల రోజుల నుంచి లోబో, రవి వాష్‌రూమ్‌ క్లీనింగ్‌ తప్ప కిచెన్‌ వంకే చూడట్లేదని సెటైర్‌ వేసింది కాజల్‌. దాన్నే కాస్త పొడిగిస్తూ డ్యాన్సులు కూడా చేసింది. అయితే మజాక్‌ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్‌ అని కాజల్‌పై చిరాకుపడ్డాడు రవి. ఇక లోబో అయితే ఏకంగా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో లోబో చేసింది తప్పని వాదించింది కాజల్‌. ఇదే విషయాన్ని కాజల్‌ పింకీతో చెప్పుకురాగా.. తనకుగానీ అలా వేలు చూపిస్తే కట్‌ చేసి పడేస్తానని హెచ్చరించింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు తావు లేనందున అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేశానంది కాజల్‌.

రవిని ఫ్రెండుగా ఉండమని నేనేమైనా అడిగానా?: కాజల్‌
నెల రోజులన నుంచి కిచెన్‌లో తానేమీ పని చేయలేదని ఎలా స్టేట్‌మెంట్‌ ఇస్తావని కాజల్‌ను నిలదీశాడు రవి. దీంతో మాట మార్చిన కాజల్‌.. కేవలం మీకు కిచెన్‌ డ్యూటీ రాలేదని మాత్రమే అన్నానని కవర్‌ చేసింది. కాజల్‌ వింత ప్రవర్తన చూసిన మానస్‌ ఎందుకు అరుస్తున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? అని ప్రశ్నించాడు. ఇదేమీ పెద్దగా పట్టించుకోని కాజల్‌.. అయినా రవిని నా ఫ్రెండుగా ఉండమని ఎప్పుడైనా అడిగానా? అని అసహనానికి లోనైంది. లోబో మిడిల్‌ ఫింగర్‌ చూపిస్తే సపోర్ట్‌ చేస్తున్నావు అనడంతో షాకైన రవి.. అలా వేలు చూపించడం తప్పని లోబోను కూడా హెచ్చరించానన్నాడు. ఇక శ్రీరామ్‌ వీళ్ల మధ్య గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశాడు కానీ ఎవరూ అతడు మాటను పట్టించుకున్న పాపాన పోలేదు.

ఏ రాజు దగ్గర ఎక్కువ ధనం ఉంటే ఆ రాజ్యంలోని వాళ్లే కెప్టెన్సీకి అర్హులు
తర్వాత బిగ్‌బాస్‌.. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు. ఇద్దరు రాకుమారులు వారి దగ్గరున్న ధనాన్ని టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. టాస్క్‌ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటారు.

దీంతో రవి, సన్నీ సపోర్ట్‌ కోసం హౌస్‌మేట్స్‌ వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్‌ రవికి విశ్వ, శ్రీరామ్‌, హమీదా, శ్వేత, యానీ మాస్టర్‌ సపోర్ట్‌ చేయగా.. సన్నీకి మానస్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ప్రియ, సిరి, షణ్ముఖ్‌, జెస్సీ మద్దతుగా నిలబడ్డారు. తర్వాత సడన్‌గా సిరి.. రవి గ్యాంగ్‌లో జాయిన్‌ అయిపోయింది. అయితే ఖజానాలో నుంచి ఒక్క పైసా దొంగిలించేది లేదని విశ్వ కుండ బద్ధలు కొట్టి చెప్పేశాడు. కానీ జెస్సీ, సిరి, షణ్ముఖ్‌, కాజల్‌ మాత్రం దొంగిలించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతలో ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే పనులంటూ చీదరించుకున్నాడు.

తర్వాత బిగ్‌బాస్‌ ప్రవేశపెట్టిన 'మట్టిలో మహాయుద్ధం' అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్‌; సన్నీ వైపు నుంచి మానస్‌, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టారు. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ కోసం ఎదురు చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement