Bigg Boss 5 Telugu Latest Promo: 8th Week Captency Contender Task | లాక్‌డౌన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌.. షాక్‌లో ఇంటి సభ్యులు - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: లాక్‌డౌన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌.. షాక్‌లో ఇంటి సభ్యులు

Published Tue, Oct 26 2021 4:26 PM | Last Updated on Tue, Oct 26 2021 8:04 PM

Bigg Boss 5 Telugu Latest Promo: House In Lockdown For Captaincy Contender Task - Sakshi

Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో ఏడువారాలను పూర్తి చేసుకొని ఎనిమిదోవారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎలిమినేషన్‌ రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్‌,షణ్ముఖ్‌ జస్వంత్‌, మానస్‌ ఉన్నారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘అభయహస్తం’అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటిని పూర్తిగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చాలెంజ్‌లో గెలిచిన సభ్యులకు మాత్రమే ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్‌-లోబో హోరా హోరిగా తలపడినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
(చదవండి: బిగ్‌బాస్‌: ప్రియ పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా?)

బురదతో నిండిన బాత్‌టబ్‌ నుంచి కాయిన్స్‌ని సేకరించే టాస్క్‌లో లోబో-షణ్ణ్నూ పోటీ పడ్డారు. ఆ సమయంలో విశ్వ-షణ్ముఖ్‌, కాజల్‌-లోబో మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. ‘వందమంది వంద వాగుతారు అని షణ్ణ్నూ అనగా.. విశ్వ మధ్యలో కలగజేసుకొని.. అంతా ఇక్కడ ఉన్నోళ్లమే కదా డార్లింగ్‌ అని సీరియస్‌ అయ్యారు. ఆ వంద మందిలో నువ్వు ఉన్నావా.. అంటూ షణ్ముఖ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఇక కాజల్‌ ఏదో అనబోతుండగా.. కాసేపు ఏం మాట్లాడొద్దని లోబో అడ్డుకోబోయాడు. ‘నా ఇష్టం నేను మాట్లాడతా. నీకు ఇబ్బంది ఉంటే చెవులు మూసుకో’అంటూ లోబోపై కాజల్‌ ఫైర్‌ అయ్యారు. మరి ఈ కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టిందో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement