బిగ్‌బాస్‌-5: లోబోకి స్పెషల్‌ పవర్‌.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు? | Bigg Boss 5 Telugu Promo: Lobo Who Is Given Black And Golden Egg | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu : లోబోకి స్పెషల్‌ పవర్‌.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు?

Published Thu, Oct 21 2021 7:17 PM | Last Updated on Thu, Oct 21 2021 11:09 PM

Bigg Boss 5 Telugu Promo: Lobo Who Is Given Black And Golden Egg - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కంటెస్టెంట్స్‌ అంతా ఒకటి ఆలోచిస్తే.. బిగ్‌బాస్‌ మరోకటి ఆలోచిస్తాడు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్‌బాస్‌. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్‌ అటాక్‌ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్‌ కావాలనే కసితో టాస్క్‌ ఆడుతున్నారు కంటెస్టెంట్స్‌. అయితే టాస్క్‌ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్‌బాస్‌. మధ్య మధ్యలో స్పెష​ల్‌ పవర్‌ ఉన్న ఎగ్స్‌ ఇస్తూ.. అదృష్ట పరీక్షలు పెడుతున్నాడు.
(చదవండి: బిగ్‌బాస్‌: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్‌)

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గేమ్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన  లోబో చేతికి ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతని చేతిలో బ్లాక్‌, గొల్డెన్‌ కలర్‌ ఎగ్స్‌ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్‌ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్‌ ఎగ్‌ ఎవరికిస్తే వారు ఈ టాస్క్‌ నుంచి ఔట్‌ అయినట్లు. గొల్డెన్‌ ఎగ్‌ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement