నామినేషన్స్‌: లోబోకు ఇచ్చిపడేసిన సిరి, షణ్ముఖ్‌ | Bigg Boss Telugu 5 Promo: Telugu BB Housemates Fire on Nataraj Master and Lobo | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Promo: లోబో, మాస్టర్‌ మీద కంటెస్టెంట్ల ఫైర్‌

Published Mon, Sep 27 2021 7:44 PM | Last Updated on Mon, Sep 27 2021 8:16 PM

Bigg Boss Telugu 5 Promo: Telugu BB Housemates Fire on Nataraj Master and Lobo - Sakshi

'సింహంతో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే' అని మాస్టర్‌ ఓ డైలాగ్‌ వదిలాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన విశ్వ.. 'ఎహె, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో' అని చిరాకు ప్రదర్శించాడు.

Bigg Boss Telugu 5 Promo: Housemates Fire on Nataraj Master: బిగ్‌బాస్‌ హౌస్‌లో నటరాజ్‌ మాస్టర్‌ ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూనే కనిపిస్తాడు. వాళ్లు గేమ్‌ సరిగా ఆడట్లేదని, వీళ్లు హౌస్‌కు కరెక్ట్‌ కాదంటూ తెగ చిరాకు ప్రదర్శిస్తుంటాడు. తను చెప్పింది అందరూ ఆచరించాలని చూస్తాడు, కానీ అక్కడ కనీసం అతడు చెప్పేది కూడా ఎవరూ వినిపించుకోరు. హౌస్‌లో గుంటనక్క, ఊసరవెల్లి ఉన్నారంటాడు, కానీ వాళ్లెవరనేది బయటపెట్టడు. అయితే అతడు ఎప్పుడు? ఎందుకు? ఎవరిని తిడుతున్నారో అర్థం కాని కంటెస్టెంట్లు ఈ సారి నామినేషన్‌లో మాస్టర్‌ను గట్టిగానే వేసుకున్నట్లు కనిపిస్తోంది. 

నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారంటూ కాజల్‌ నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పమని అభ్యర్థించాడు మానస్‌. అటు హమీదా కూడా తన పనిని ఎవరైనా ఆపితే నచ్చదంటూ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. విశ్వ, మాస్టర్‌కు మధ్య కూడా హీట్‌ డిస్కషన్‌ నడవగా 'సింహంతో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే' అని మాస్టర్‌ ఓ డైలాగ్‌ వదిలాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన విశ్వ.. 'ఎహె, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో' అని చిరాకు ప్రదర్శించాడు.

నామినేషన్స్‌లో లోబో మరోసారి తను కింది స్థాయి నుంచి వచ్చానంటూ చెప్పడం ఆరంభించగా షణ్ముఖ్‌ మధ్యలోనే అడ్డుకున్నాడు. అందరం అక్కడి నుంచే వచ్చామని కౌంటరిచ్చాడు. ప్రతిసారి బస్తీ నుంచి, కింది స్థాయి నుంచి వచ్చానని చెప్పడం తప్పని దుమ్ము దులిపాడు. అటు సిరి కూడా నువ్వు సింపతీ కోసం ట్రై చేస్తున్నావనిపిస్తుందంటూ లోబోను నామినేట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement