Bigg Boss 5 Telugu Latest Promo: Lobo Re-entry, Shanmukh Jaswanth Crying - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu : లోబో రీఎంట్రీ, మోసపోయానని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్‌

Published Thu, Oct 21 2021 4:39 PM | Last Updated on Thu, Oct 21 2021 6:28 PM

Bigg Boss 5 Telugu Latest Promo: Lobo Reentry, Shanmukh Jaswanth Crying - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘బంగారు కోడిపెట్ట’అనే టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్కే సన్నీ, ప్రియల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. వీరిద్దరూ మాటలతో ఆగకుండా ఫిజికల్‌ అటాక్‌ వరకు వెళ్లారు. ఇలా నిన్నటి ఎపిసోడ్‌ అంతా వాడివేడిగా జరగ్గా.. ఎండింగ్‌లో మాత్రం భారీ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో రీ ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమోలో తెలిపారు.  

మెయిన్ గెట్ తెరుచుకోవడం, అక్కడ లోబో నిలబడి ఉండటం చూసిన రవి.. లోబో వచ్చాడు అంటూ చెప్పడంతో అందరి ముఖంలో ఆనందం కనిపించింది. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకున్నాడు. మరోవైపు జెస్సీకి ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ త్రిమూర్తులు(షణ్ముఖ్‌, సిరి, జెస్సీ)మధ్య గొవడవకు దారి తీసినట్లు కనిపిస్తోంది.  జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నాడు.  అందరూ టాస్క్‌ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్‌ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్‌ వాపోయాడు.

జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను. నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం.. అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జెస్సీ, సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్‌ ఆగకుండా సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు. దీంతో సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్-సిరి-జెస్సీల మధ్య ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement