
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడిపోమన్న బిగ్‌బాస్ వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్ షేక్, కొబ్బరి బోండాం నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు. దీంతో ఓవైపు ఆకలితో అలమటిస్తూనే మరోవైపు ఎలాగైనా టాస్క్‌లో గెలవాల్సిందేనని కసితో రగిలిపోతున్నారు కంటెస్టెంట్లు. కానీ ఆకలితో నకనకలాడిపోతున్న లోబో తన కడుపు మాడ్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాకయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.
కాగా ఈ టాస్క్ ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఫుడ్ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్ తన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ కెప్టెన్ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటు అతని జోడీ కాజల్ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్ షాక్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్‌ను టెంప్ట్ చేసేందుకు బిగ్‌బాస్ ఫుడ్ పంపించగా ప్రియాంక సింగ్ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ ఊరిళ్లు వచ్చేలా ఆ వంటకాన్ని ఆవురావుమని ఆరగించింది.
Comments
Please login to add a commentAdd a comment