Model Jessie
-
షణ్ముఖ్, సిరితో గొడవలు.. నా ఫోన్ కట్ చేస్తున్నారు.. జెస్సీ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరికీ బయట ప్రేమికులు ఉన్నా కూడా హౌస్ లోపల మాత్రం నీకు నేను, నాకు నువ్వు అన్నట్లుగా మెదిలారు. వీరి అతి ప్రేమను చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. అటు సిరి ప్రియుడు శ్రీహాన్ కూడా ఓసారి స్టేజీపైకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తున్నవారా? అని ఎంతో దీనంగా అడిగిన డైలాగ్ ఇప్పటికీ బిగ్‌బాస్ ఆడియన్స్ మర్చిపోలేరు. అయితే షణ్ను, సిరిలతో మోడల్ జెస్సీ క్లోజ్‌గా ఉండేవాడు. మిగతా హౌస్మేట్స్ ఈ ముగ్గురిలో ఎవరినైనా ఒక్క మాట అంటే చాలు మిగతా ఇద్దరూ రెచ్చిపోయి గొడవ చేసేవారు. కానీ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సీన్ మారింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. అంతేకాదు ఎంతో స్నేహంగా మెదిలినవాళ్లే ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో జెస్సీ మాట్లాడుతూ.. 'నాకు బాగా క్లోజ్ అయినవాళ్లకు ఐ లవ్యూ చెప్తుంటాను. కానీ వాళ్లు(సిరి, షణ్ముఖ్) ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఒక్కసారి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డాక అంత ఈజీగా తెగిపోతుందని నేను ఊహించలేదు. చెప్పుడు మాటలు విని దూరం పెట్టారు. చాలా బాధేసింది. నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు, నిజమా? కాదా? అని అడిగి తిట్టే స్వతంత్రం వారికుంది. నేను తప్పు చేశానంటే కచ్చితంగా ఒప్పుకుంటాను. వీళ్లకి అర్థం కాని విషయం ఏంటంటే.. ఒకప్పుడు వాళ్లను ఛీ, తూ.. అన్నవాళ్ల దగ్గరకే వెళ్తున్నారు. వాళ్లు మిమ్మల్ని వాడుకుంటున్నారు. అది తెలుసుకుంటే మంచిది. నేను ఫేమస్ అవ్వడానికి వాళ్లను వాడుకుంటున్నానని టాక్ వచ్చింది. నాకంత అవసరం లేదు, అయినా షణ్ముఖ్ అంత పిచ్చోడేం కాదు. వాడికి ఫలానా వాడు ఫేక్ అనిపిస్తే వదిలేస్తాడు. బిగ్‌బాస్ షోలో నాకోసం ఏడ్చాడు. నాలుగో వారంలో నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను నిన్ను నమ్ముతానురా అని నాతో కూర్చున్నాడు. నేను ఫేక్‌గా లేను కాబట్టే నాతో ఉన్నాడు. కానీ ఇప్పుడు నా ఫోన్ కట్ చేసేంత స్థితికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరిని ఫ్రెండ్ అనుకున్నానంటే ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తాను. వారికిప్పుడు నా ప్రవర్తన నచ్చడం లేదంటే సరే! షణ్ను నన్ను అన్‌ఫాలో కొట్టాడు. ఎందుకు అలా చేశాడో తెలియదు. బాధేసింది. కొందరైతే నేనేదో తప్పు చేసినట్లు కామెంట్లలో నన్ను తిట్టేవాళ్లు. వాడికి నా పిల్లచేష్టలు, ప్రవర్తన నచ్చలేదని దూరం పెట్టాడేమో! నావంతు ప్రయత్నం చేశాను. కలిశా, అడిగా, సంవత్సరం వెయిట్ చేశా.. కానీ వాళ్లు వద్దనుకుంటున్నారు. ఒకానొక సమయంలో నాకూ కోపమొచ్చింది. వారు నన్ను ఇష్టపడనప్పుడు ఎందుకు వెనకపడటం అనిపించింది. అందుకే నేనూ దూరంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చాడు జెస్సీ. -
దీప్తి సునయన బ్లాక్ చేసింది.. అప్పటివరకు వదలను: షణ్నూ
Shanmukh Comments On Deepthi Sunaina And Siri In Live Chat: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.(షణ్నూ). అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా కప్పు చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచాడు. హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్మెంట్ జరగడం, షణ్నూ, దీప్తి సునయనతో రిలేషన్ షిప్లో ఉండటంతో వీరి రిలేషన్ ఆడియెన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో సోషల్ మీడియాలో సిరి-షణ్నూలు విపరీతమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇటీవలె బిగ్‌బాస్ ముగియడంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్నూ.. తాజాగా ఇన్‌స్టాలో లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీప్తి సునయన గురించి ఎక్కువగా అడుగుండటంతో షణ్నూ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తనని బ్లాక్ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను' అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు సిరితో తన ఫ్రెండ్షిప్ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్‌ఫ్రెండ్స్ అని తెలిపాడు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీ ఫస్ట్ మూవీ.. లుక్ అదిరింది!
Bigg Boss 5 Telugu Contestant Model Jaswanth Padala First Movie: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో అడుగుపెట్టిన ఏకైక మోడల్ జశ్వంత్ పడాల. వర్టిగో వ్యాధితో బాధపడుతున్న అతడు పదవ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తన ఆరోగ్యం బాగుండుంటే మరిన్ని వారాలు హౌస్‌లోనే కొనసాగేవాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడికి సినిమా ఆఫర్ కూడా వచ్చింది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజీ మీదే చెప్పాడు జెస్సీ. తాజాగా తన సినిమా టైటిల్ పోస్టర్‌ను వదిలాడు. ఎర్రర్ 500 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జెస్సీ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. పోస్టర్లో నెత్తుటి గాయాలతో చేతిలో గన్ పట్టుకుని యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. సందీప్ మైత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మైత్రి మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. View this post on Instagram A post shared by jaswanth padala (jessie) (@jaswanth_jessie) -
బిగ్‌బాస్ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..ఫోటో వైరల్
Shanmukh And Siri, Jessie First Time Met After Bigg Boss, Video Viral: బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్లో ఎక్కువ ట్రోలింగ్ బారిన పడ్డ వారిలో వీరు ముందుంటారు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఇద్దరూ ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించడంతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టైటిల్ రేసులో ఉన్న షణ్నూ రన్నరప్‌గా సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన సిరి-షణ్నూ తొలిసారిగా కలుసుకోవడం ఇప్పడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బెస్ట్‌ఫ్రెండ్ జెస్సీతో కలిసి వైజాగ్ రోడ్లపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నెగిటివిటితో బయటకు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత కూడా ఫ్రెండిప్ కంటిన్యూ చేయడం నెటిజన్లు మనసు గెలుచుకుంటుంది. -
Viral Video: బిగ్‌బాస్ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..
-
బిగ్‌బాస్ : సంతోషంలో మునిగిపోయిన జెస్సీ.. పోస్టు వైరల్
Bigg Boss 5 Telugu: Jessie Gets Movie Offer: బిగ్‌బాస్ ఐదో సీజన్లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ జెస్సీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పాడు. బిగ్‌బాస్‌తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన జెస్సీ ఇప్పుడు వెండితెరపై కూడా సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన ఫస్ట్ మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. సందీప్ మైత్రేయ దర్శకత్వంలో తాను డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఫస్ట్‌లుక్ సైతం త్వరలోనే షేర్ చేస్తాను అంటూ జెస్సీ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్లో బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో జెస్సీ ముందుగా మూవీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. దీంతో జెస్సీకి బెస్ట్ విషెస్ చెబుతూ పలువురు నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
బిగ్‌బాస్ టీమ్‌కు లంచం? బ్యాంక్ బ్యాలెన్స్ చూపించిన జెస్సీ
Bigg Boss 5 Telugu, Model Jaswanth Padala: తెలుగు బిగ్‌బాస్ షోలో ఎక్కువగా నటీనటులు, కమెడియన్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లు, యూట్యూబర్లే కనిపిస్తూ ఉంటారు. మోడల్స్ పాల్గొనడం అనేది చాలా తక్కువ. అయితే ఈ సీజన్లో మాత్రం మోడల్ జెశ్వంత్ షోలో ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అతడికి నిజంగానే బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చిందా? లేదా అతడే బిగ్‌బాస్‌కు ఎదురు డబ్బులిచ్చి కంటెస్టెంట్‌గా వచ్చాడా? అన్న రూమర్లు వినిపించాయి. నిజానికి బిగ్‌బాస్ టీమ్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు పారితోషికం ముట్టజెప్పుతుంది కానీ జెస్సీనే బిగ్‌బాస్ నిర్వాహకులకు డబ్బులిచ్చాడా? అని ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు జెస్సీ. 'బయట ఉన్నవాళ్లతో పాటు హౌస్‌లో ఉన్నవాళ్లు కూడా నేను బిగ్‌బాస్‌కు డబ్బులిచ్చి వచ్చానన్నారు. కానీ నేను బిగ్‌బాస్ వాళ్లకు డబ్బులివ్వడమేంటి? నా అకౌంట్లో రూ.11 వేలు మాత్రమే ఉన్నాయి. నేను ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నాకు తండ్రి లేడు. రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బుతో మోడలింగ్ నేర్చుకుంటూ ఎదిగాను. రూపాయి విలువ కూడా నాకు తెలుసు. బిగ్‌బాస్ ఆఫర్ ఫ్రీగా వచ్చినా వెళ్దాం అనుకున్నాను. కానీ వాళ్లే నాకు డబ్బులిచ్చారు. అంతేకానీ వారికి ఎదురు డబ్బులిచ్చేంత స్థోమత లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. నేను బిగ్‌బాస్‌కు దొడ్డిదారిన రాలేదు. స్ట్రయిట్‌గా వెళ్లాను, స్ట్రయిట్‌గా ఆడాను' అని చెప్పుకొచ్చాడు జెస్సీ. -
ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే
Bigg Boss Priyanka Singh first Interview After Elimination: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 5 తెలుగు చివరకి దశకు చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. హౌజ్‌లో తన అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌజ్‌ను వీడి బయటకు వచ్చిన ప్రియాంకకు ఆమె ఫ్యాన్స్ నీరాజనాలు పట్టారు. రోడ్‌షోలో అభిమానులంతా క్యూ కట్టి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చదవండి: దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి ఇక ఈ రోడ్‌షోకు మోడల్ జశ్వంత్(జెస్సీ) మాత్రమే వచ్చి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. బయటకు వచ్చిన ప్రియాంకను కలిసేందుకు వచ్చిన జెస్సీ ఆమెతో పాటు ఈ రోడ్‌షోలో పాల్గొన్నాడు. అనంతరం ప్రియాంక సాక్షి టీవీతో ముచ్చిటించింది. ఈ సందర్భంగా మానస్ గురించి అడగ్గా.. ప్లీజ్ మానస్ గురించి అడగకండి.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంకా మానస్ గురించి పింకీ ఏం చెప్పుకొచ్చింది, తన బిగ్‌బాస్ జెర్నీతో పాటు హౌజ్‌లోని మిగతా కంటెస్టేంట్పై తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలంటే ప్రియాంక సింగ్ మాటల్లోనే వినండి.. చదవండి: Kareena Kapoor: కరీనా డ్రెస్సింగ్‌పై నెటిజన్ల విమర్శలు, ‘హే భగవాన్ ఇంకేం చూడాల్సి వస్తుందో బిగ్‌బాస్ ద్వారా పింకీ ఎన్ని లక్షలు వెనకేసిందంటే? -
నేను ఉంటే సిరి చెంప పగులకొట్టేవాడిని : జెస్సీ
Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship: బిగ్‌బాస్ షోలో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు బెస్ట్‌ఫ్రెండ్స్‌లా ఉన్నవాళ్లు కూడా హౌస్‌లో బద్ద శత్రువులుగా మారొచ్చు.. ఏ పరిచయం లేని వాళ్లు సైతం హస్‌లో బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మరొచ్చు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-5లో షణ్ముఖ్, సిరిలు కూడా పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా..వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ విషయాన్ని లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో సిరి స్వయంగా ఒప్పుకుంది. తప్పు అని తెలిసినా కనెక్షన్ పెరుగుతుందంటూ మనసులో మాటను బయటపెట్టింది. వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పబ్లిక్‌గా హద్దులు మీరి హగ్గులు, కిస్సులు ఇచ్చుకోచడం ఫ్యామిలీ ఆడియోన్స్‌ను సైతం రుచించడం లేదు. ఇక వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు. ఇక షణ్నూ కోసం సిరి తలను గోడకేసి గుద్దుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే..సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్ చేశాడు. -
ప్రియ ఇంట పెళ్లి వేడుకలు, హాజరైన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ షోలో వాలిపోయింది. అక్కడ ఇతర కంటెస్టెంట్లను, వారి గేమ్‌ను అంచనా వేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గేమాడింది ప్రియ. కెప్టెన్సీ కాలేరని తెలిసినా చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎందరో మనసులను కొల్లగొట్టింది. చివరకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీని సైతం సుసాధ్యం చేస్తూ ఐదో వారం కెప్టెన్‌గా అవతరించింది. కానీ సన్నీతో వైరం కొనితెచ్చుకుని అతడి మీద నోరు పారేసుకోవడంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. టాస్క్‌లో అతడిని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ హెచ్చరించడంతో సోషల్ మీడియాలోను ఆమెను ట్రోల్ చేశారు. ఫలితంగా ఓట్లు తగ్గి ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. View this post on Instagram A post shared by Priya (@priyaartist) ఇదిలా వుంటే నేడు(నవంబర్ 21న) ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 'మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ' అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంది. View this post on Instagram A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79) View this post on Instagram A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79) -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఆస్పత్రిలో చికిత్స..
సాక్షి, కాచిగూడ(సికింద్రాబాద్): అనారోగ్యం కారణంగా ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ జశ్వంత్ కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. విజయవాడకు చెందిన జశ్వంత్ మోడల్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ బిగ్‌బాస్ 8వ కంటెస్టెంట్‌గా చోటు సంపాదించాడు. బిగ్‌బాస్ షోలో గేమ్ ఆడుతుండగా మరో కంటెస్టెంట్ చేయి జశ్వంత్ మెడపై బలంగా తగిలి నొప్పి ఎక్కువ కావడంతో షో నుంచి వైదొలిగాడు. జశ్వంత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నుంచి వైదొలగడం బాధగా ఉందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు. -
బిగ్‌బాస్: జెస్సీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Bigg Boss Telugu 5: Model Jessie Remuneration Revealed: బిగ్‌బాస్ ఐదో సీజన్లో8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ జెస్సీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. వారం రోజులుగా సీక్రెట్ రూంలోనే ఉన్న జెస్సీ కోలుకొని రీఎంట్రీ ఇస్తాడని భావించినా వర్టిగో వ్యాధి తీవ్రం అవుతుండటంతో బిగ్‌బాస్ షో మధ్యలోంచి అతను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. దీంతో నామినేషన్లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్ సేఫ్ అయ్యింది. బిగ్‌బాస్ నుంచి వెళ్లేముందు కంటెస్టెంట్లకు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి. దీంతో ప్రేక్షకుల కన్నా మరింత క్షుణ్ణంగా జెస్సీ అబ్జర్వ్ చేసిన ఉంటాడని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా పది వారాలకు గాను జెస్సీకి ఎంత ముట్టిందన్నది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జెస్సీకి వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన పది వారాలకు గాను మొత్తం రూ. 10 -15 లక్షల వరకు వెనకేసుకున్నట్లు అంచనా. -
షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్
Bigg Boss 5 Telugu Jessie Shocking Comments On Shanmukh Jaswanth: బిగ్‌బాస్ హౌజ్ నుంచి జెస్సీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ నిరాశే ఎదురైంది. అయితే జెస్సీ వెళ్లిపోయేముందు కంటెస్టెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు. కాజల్‌కు అందరిని నమ్మకు నీ ఆట నువ్వు ఆడు అంటూ హెచ్చరించాడు. హౌజ్ వీడాకా బిగ్‌బాస్ బజ్‌లో అరియాన గ్లోరీతో ముచ్చటించాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను విడులైంది. ఈ సందర్భంగా జెస్సీ తన విశ్వరూపం చూపించాడు. హౌజ్‌లో పిల్లాడిలా ఉన్న జెస్సీ బయటకు వచ్చాక మిస్టర్ మజ్నుగా మారాడు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! ఇక సిరి, శ్వేతలో ఎవరు నీకు ఇష్టం అని అరియానా ప్రశ్నిస్తే.. ఇద్దరు కలిసొస్తే బావుంటుందని జెస్సీ అన్నాడు. ఇక అరియాన తనదైనశైలో పంచ్ వేయడంతో ఆమెకు కూడా కూడా ఐ లవ్ యూ చెప్పేశాడు. ఈ నేపథ్యంలో సిరిని చూడగానే తెలియని క్రష్ ఏర్పడిందా? అని అరియాన ప్రశ్నించగా షాకింగ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సిరి, షణ్నుల గురించి మాట్లాడుతూ.. షణ్నుని సిరి భరిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ముగ్గురం టీంగా ఉన్నప్పటికీ షణ్ను ఏదైన తప్పు చేసినా తామే అతని దగ్గరకు వెళ్లి సారీ చెప్పేవాళ్లమన్నాడు. ఇదిలా ఉంటే హౌజ్‌లో అమ్మాయిల ప్రస్తావన రాగానే జెస్సీ ప్లేబాయ్‌లా మాట్లాడటం మొదలు పెట్టాడు. చదవండి: నిన్ను వాడుకుంటున్నారు, జాగ్రత్త: జెస్సీ హెచ్చరిక దీంతో అసలు ఏ అమ్మాయిని వదలవా అని అరియానా అడిగితే, సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని పంపుతారని ఎదురుచూశానని. కానీ బిగ్‌బాస్ ఎవరినీ పంపలేదన్నాడు. రూంలో ఒక్కడినే ఉన్నా అనడంతో అరియాన అలా అంటుంటే చంఢాలంగా ఉందనడంతో.. నువ్వు సోహైల్ మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉండలేదా? అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటతో అరియాన కామ్ అయిపోయింది. బాబోయ్ ఎక్కువ మాట్లాడితే నా సీక్రెట్స్యే బయటకు పడేలా ఉన్నాయంటూ వెనక్కి తగ్గింది. ప్రొమో చూస్తుంటే ప్రతి సారి అరియాన అందరిని ఆడుకుంటే ఈ సారి జెస్సీ అరియానను ఆడుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రోగ్రామ్ చివరల్లో ఏదీ ఎడిట్ చేయకండని, అది ఎడిట్ చేస్తే చంపేస్తానని అరియానా వార్నింగ్ ఇవ్వడం కొస మెరుపు. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం -
నిన్ను వాడుకుంటున్నారు, జాగ్రత్త: జెస్సీ హెచ్చరిక
Bigg Boss 5 Telugu, 10th Week Jessie Eliminated: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! అదృష్టం బాగుండి నామినేషన్లో లేకపోయినా అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ ఆశలు అడియాశలే అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో నీ జర్నీ పూర్తైందని పంపించివేశారు. అయితే వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్లకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్కరితో పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ముందుగా జెస్సీ.. సన్నీతో మాట్లాడుతూ.. 'జాగ్రత్తగా ఉండు, టెంపర్ లూజ్ అవకు. ఒక్కడిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువల్ హీరో అవుతావు, లేదంటే కమెడియన్ అవుతావు' అని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత మానస్‌తో మాట్లాడుతూ.. 'నువ్వు సైలెంట్ కిల్లర్. రవికే బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అందరినీ నెగెటివ్‌గా చూడకు' అని సూచించాడు. కాజల్‌తో.. 'నీ గేమ్ ఏమైంది? నువ్వు పక్కవాళ్లను హైలైట్ చేయడానికి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నారనుకుంటున్నావు, కానీ ఇవ్వట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో' అని హెచ్చరించాడు. యానీ మాస్టర్ గేమ్ బాగుందన్న జెస్సీ ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయమని హితవు పలికాడు. నీ గేమ్ ఇదేనా? అని నిలదీశాడు. 'తర్వాత సీజన్లో వచ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది? అని చులకనచేయొద్దు' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దేనిలో ఇన్వాల్వ్ అవని శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. రవితో ఫోన్లో ముచ్చటిస్తూ.. ఇన్ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైనల్లో కలుస్తానని చెప్పాడు. తర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క తంతానంటూనే మరోపక్క నీ ఫైటింగ్ బాగుందని మెచ్చుకున్నాడు. కానీ నీ గేమ్ నువ్వు ఆడమని హెచ్చరించాడు. తర్వాత కిస్సులు లేవా? అని అడడగడంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివర్లో వచ్చేవారమే బయటకు వచ్చేయకు, ఫైనల్‌దాకా అక్కడే ఉండమని చెప్పాడు. షణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు జెస్సీ. 'హౌస్‌లో ఉన్న చివరి రోజుల్లో నీతో ఉండలేకపోయానన్నదే నా బాధ. నేను ఎప్పటికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే' అన్నాడు. ఇక షణ్ను మాట్లాడుతూ.. 'నువ్వు ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావనుకున్నారు, కానీ పదో వారంలో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్.. అదిరా నా జెస్సీ' అని పొగిడేయడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఈ ఫోన్ సంభాషణల్లో జెస్సీ.. సిరి, షణ్ను, శ్రీరామ్, రవి టాప్ 5లో ఉంటారని చెప్పకనే చెప్పాడు. తర్వాత జెస్సీ భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. -
ఒకరికి లైఫ్ ఇచ్చి మరీ వెళ్లిపోయిన జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 71, Jessie Exit From Show: బిగ్‌బాస్ షో ద్వారా గంగవ్వ కొత్తింటి కల నెరవేరిందన్న శుభవార్తను హౌస్‌మేట్స్‌కు తెలియజేశాడు నాగార్జున. గంగవ్వ ఇంటిని వీడియో ద్వారా హౌస్‌మేట్స్‌కు చూపించాడు. తర్వాత ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించి గేమ్స్ ఆడించాడు. టీమ్ Aలో షణ్ముఖ్, యానీ, ప్రియాంక, సన్నీ ఉండగా మిగిలినవారంతో టీమ్ Bలో ఉన్నారు. మానస్ సంచాలకుడిగా వ్యవహరించాడు. మొదటి గేమ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నాగార్జున ఫైర్, ఐస్, వాటర్ అని పలికినప్పుడు ఆయా బోర్డుల దగ్గరకు పరిగెత్తుకెళ్లాలి. చివరగా బోర్డును చేరుకున్న వ్యక్తి ఓడిపోయినట్లు లెక్క! అంతేకాకుండా వారికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. అలా ఈ గేమ్‌లో నాగ్.. రవితో గోడకుర్చీ వేయించి, షణ్నును మోకాళ్ల మీద కూర్చోబెట్టి, సిరిని ఒంటికాలిపై, యానీని రెండు చేతులు పైకెట్టి నిల్చోబెట్టాడు. మొత్తంగా ఈ గేమ్‌లో A టీమ్‌లోని సన్నీ గెలిచాడు. తర్వాత గేమ్‌లో హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చూపించగా అది ఎవరో గుర్తుపట్టాలన్నాడు నాగ్. ఈ గేమ్‌లోనూ A టీమ్ విజయం సాధించింది. తర్వాతి గేమ్‌లో కొన్ని పదాలున్న మెడల్స్‌ను దానికి సరిగ్గా సరిపోయే వ్యక్తికి వేయాలన్నాడు. సన్నీ.. ఫేక్ అన్న మెడల్‌ను రవికి వేశాడు. మానస్.. ప్రియాంక తనకు తలనొప్పిగా మారిందన్నాడు. శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పాడు. రవి.. పొగరుబోతు(యారోగెంట్) అన్న మెడల్‌ను యానీకి ఇచ్చాడు. ప్రియాంక సింగ్.. షణ్ముఖ్ సెల్ఫిష్ అని చెప్పింది. యానీ.. సన్నీ సెల్ఫిష్ అంది. కాజల్.. సిరి డబుల్ ఫేస్ (రెండు నాలుకల పాము) అని తెలిపింది. సిరి.. షణ్ముఖ్ ప్రతిసారి నేను వెళ్లిపోతానేమోనని నెగెటివ్‌గా మాట్లాడుతాడని బుంగమూతి పెట్టుకుంది. తర్వాత మానస్, కాజల్ ఇద్దరూ సేఫ్ అని ప్రకటించిన నాగ్ మీ ఇద్దరూ కాకుండా మరొక హౌస్‌మేట్ వెళ్లిపోతున్నాడని చెప్పాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ ఆరోగ్యం బాగోలేనందున అతడిని పంపించివేయక తప్పదని వెల్లడించాడు. అలా మానస్, కాజల్‌లలో ఒకరికి బదులుగా అసలు నామినేషన్లోనే లేని జెస్సీ ఆట నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. స్టేజీ మీదకు వచ్చిన పిదప తన జర్నీ వీడియో చూసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. నిజానికి పలు పోల్స్‌లో కాజల్ తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఆమె ఎలిమినేట్ అవడం ఖాయం అనుకున్నారంతా! కానీ చివరకు జెస్సీని పంపించేయడంతో ఆమెను సేవ్ చేసి లైఫ్ ఇచ్చినట్లైంది. -
అనారోగ్యంతో బిగ్‌బాస్‌కు జెస్సీ గుడ్‌బై
Bigg Boss 5 Telugu, 10th Week Elimination: బిగ్‌బాస్ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్ట్రాటజీకి మారుపేరైన కాజల్ తక్కువ ఓట్లతో పోలింగ్‌లో వెనకబడటంతో అందరూ ఆమె వెళ్లిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే జెస్సీని అనారోగ్యం వేధించడంతో వారం మధ్యలోనే హౌస్ నుంచి నిష్క్రమించాడు. కానీ ఎలిమినేట్ అవలేదు. అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపించి తిరిగి హౌస్‌కు పంపిద్దామనుకున్నారు. అయితే అతడి ఆరోగ్యం మెరుగవకపోవడంతో ఈ వారం జెస్సీని ఇంటికి పంపించివేస్తున్నారట! దీంతో జెస్సీ తిరిగి వస్తాడేమోనన్న సిరి, షణ్ముఖ్‌ల ఆశ అడియాశలైనట్లు కనిపిస్తోంది. ఇక జెస్సీ ఎలిమినేషన్‌తో కాజల్ ఎలిమినేషన్ గండం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. -
జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!
Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్‌బాస్ షోలో బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్, ప్రియాంక, మానస్.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్ స్టాఫ్ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని తెలిసిపోయింది! చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్ కపుల్ ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్ వాటర్ బాటిల్లో కారం పోశాడు. అయితే హౌస్మేట్స్ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు. డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ మరోపక్క సన్నీ.. పింకీ-మానస్‌ల క్యాండిల్ లైట్ డిన్నర్‌ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్ చేశాడు మానస్. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్మేట్స్ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది. జెస్సీకి తిరగబెట్టిన రోగం ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు. -
సీక్రెట్ రూమ్‌కు జెస్సీ, రగిలిపోయిన షణ్ముఖ్!
Bigg Boss 5 Telugu, Episode 66: జెస్సీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. నీకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని, ఇందుకోసం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నాడు. దీంతో జెస్సీ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ 'బిగ్‌బాస్ నా లైఫ్ అనుకున్నా, ఇంతవరకు వచ్చినందుకు హ్యాపీ' అంటూనే అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. జెస్సీ తిరిగొస్తాడు కదూ* జెస్సీ ఉన్నఫళంగా హౌస్ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్, సిరి గుక్కపెట్టి ఏడ్చారు. సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్, పింకీ, కాజల్, యానీ.. అందరూ పాంపరింగ్ చేశారంటూ బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి.. జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. మానస్ కోసమే వచ్చావా?: పింకీపై కాజల్ ఫైర్ మరోపక్క నామినేషన్స్ ఎఫెక్ట్‌తో ప్రియాంక సింగ్ మీద అలక బూనాడు మానస్. ఆమె దగ్గరవ్వాలని ప్రయత్నించేకొద్దీ అతడు తప్పించుకు తిరిగాడు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్ మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో పింకీ.. మానస్ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్.. నువ్వు తనకోసం వచ్చావా? అని ఫైర్ అయింది. మనం గేమ్ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్ చెయ్, లేదంటే వదిలెయ్ అని సలహా ఇచ్చింది. (చదవండి: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు) మాట్లాడే అధికారమే కోల్పోయావు: సన్నీ పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ కాజల్ బాధను దిగమింగుతోంది. నామినేషన్స్‌లో తన ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లను సేవ్ చేయనందుకు వారు మాట్లాడకపోవడంతో ఎంతగానో బాధపడింది. ఎలాగో ఈవారం ఎలిమినేట్ అవుతానని అటు కాజల్, ఇటు మానస్ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్ వెళ్లిపోతాడంటే తట్టుకోలేకపోయిన పింకీ.. అలా అనొద్దని వేడుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు. ఇక కాజల్ నామినేషన్స్ సమయంలో వారిని సేవ్ చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది. సీక్రెట్ రూమ్‌లో జెస్సీ, క్వారంటైన్ అయ్యాక హౌస్‌కు! ఇదిలా వుంటే జెస్సీని బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్. శ్రీరామ్.. కాజల్ బాగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోపక్క మానస్.. పింకీ ఇచ్చిన వస్తువులను తిరిగిచ్చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రవి కోసం బంటులా పని చేస్తే మాత్రం పింకీని అస్సలు నమ్మనని తెగేసి చెప్పాడు. తాను, జెస్సీ, షణ్ను ముగ్గురం కంటెండర్ అవగానే కెప్టెన్ అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్ అవగానే నామినేట్ అవుతున్నానని రవి అనగా.. ఎలిమినేట్ మాత్రం అవడం లేదు, అదే నా బాధ అని మనసులో మాట బయటపెట్టాడు షణ్ను. నా మీదే జోకులా, నేనేంటో చూపిస్తా! తర్వాత సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను. ఎవడన్నా జోకేస్తే చెప్పు తీసి కొట్టేవాడినని చిరాకుపడ్డాడు. క్లోజ్ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడంతో బాగా హర్టయ్యాడు. ఇలాంటి వెకిలి జోకులను తాను తీసుకోలేనని ముఖం మీదే చెప్పాడు. పింకీ నన్ను గెలికింది, ఇక ఎలా ఉంటుందో చూడని సిరితో చెప్పుకొచ్చాడు. ఇలా చనువు తీసుకుని అతి చేస్తారనే మనుషుల్ని దూరం పెడతానని పేర్కొన్నాడు. (చదవండి: ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్) ముద్ద వద్దు, ముద్దులే కావాలన్న మానస్ సన్నీ, మానస్‌ల పోరుతో ఆలోచనలో పడ్డ కాజల్.. షణ్నును సేవ్ చేయకుండా నన్నెందుకు సేవ్ చేశావని శ్రీరామ్‌ను అడిగింది. దీంతో అతడు మనిద్దరి మధ్య గొడవకు ముగింపు పలకడానికే చేశానని బదులిచ్చాడు. ఎట్టకేలకు మానస్ కోపాన్ని కరిగించేసింది ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది. -
జెస్సీని తిప్పలు పెడుతున్న వర్టిగో వ్యాధి ఎలాంటిదంటే?
Bigg Boss 5 Telugu Contestant Jessie Suffering From Vertigo: కొద్ది రోజులుగా జెస్సీ అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే! టాస్కుల్లో పాల్గొనడం అటుంచితే గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, కుదురుగా నడవలేకపోతున్నాడు. తనకు వర్టిగో ఉందన్న విషయాన్ని అతడే స్వయంగా హౌస్‌లో పలుమార్లు వెల్లడించాడు. రోజులు వారాలవుతున్నా అతడి ఆరోగ్యం మాత్రం మెరుగవలేదు. పైగా రోజురోజుకీ అతడిని ఆ వ్యాధి ఇబ్బందిపెడుతూనే ఉంది. దీంతో బిగ్‌బాస్ అతడిని హౌస్ నుంచి పంపించేస్తున్నాడు. అతడికి సీక్రెట్ రూమ్‌లో చికిత్స అందిస్తారా? లేదంటే అటునుంచటే ఇంటికి పంపించేస్తారా? అన్నది శనివారం నాగార్జున క్లారిటీ ఇస్తాడు. ఇంతకీ ఈ వర్టిగో అంటే ఏమిటి? దానివల్ల తలెత్తే సమస్యలేంటి? అనేవి తెలుసుకుందాం.. ► తల తిరగడాన్ని వైద్యపరిభాషలో డిజీనెస్, గిడీనెస్, వర్టిగో అని పిలుస్తున్నారు. ► ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది. ► వర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది! ► కళ్లు తిరగడం, బ్యాలెన్స్ అదుపు తప్పడం ► గాల్లో తేలినట్లుగా అనిపించడం ► చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు తిరుగుతున్నట్లు అనిపించడం ► వర్టిగో రెండు రకాలు: సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో ► తరచూ తల తిరగడం, విపరీతంగా వాంతులు కావడం, సరిగా నడవలేకపోవడం సెంట్రల్ వర్టిగో లక్షణం. సెంట్రల్ వర్టిగో లక్షణాలు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి ► ఒక వైపుకు తిరిగినప్పుడో, ఒక వైపుకు పడుకున్నప్పుడో తల తిరుగుతూ ఉంటుంది. దీన్ని పెరిఫరల్ వర్టిగో అంటారు. చెవిలో ఒక్కోసారి హోరుమని శబ్ధం రావడం, ఒక్కోసారి సడన్‌గా వినికిడి శక్తి మందగించడం వంటి లక్షణాలు కూడా దీనికిందకే వస్తాయి. ► డాక్టర్ ఇచ్చిన ఔషధాలను తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయడం వల్ల వర్టిగోను అదుపులో ఉంచవచ్చు. -
షాక్: జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపేసిన బిగ్‌బాస్
Bigg Boss 5 Telugu: Jaswanth Out From BB5 House for Health Issues: బిగ్‌బాస్ సీజన్-5లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి(సోమవారం)ఎపిసోడ్లో సైతం జెస్సీ అస్వస్థతకు గురవగా, అతన్ని సీక్రెట్ రూంలో ఉంచి చికిత్స అందించారు. అయితే అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడం సహా సమస్య పెద్దది కావడంతో బిగ్‌బాస్ జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపించాడు. ఈ ఊహించని పరిణామంతో హౌస్మేట్స్ షాక్‌కి గురయ్యారు. ముఖ్యంగా జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్ సిరి, షణ్నుక్ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా కాసేపటి క్రితమే ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో సంపూర్ణేష్ బాబు, తర్వాత గంగవ్వ, నోయల్ ఇలా గేమ్ మధ్య నుంచి బయటకు వచ్చేసిన వారే.మరోవైపు జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని టాక్ వినిపిస్తుంది. Health issue valla #Jessie house bayatiki vellalsi undi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/GDDNA5VNyc — starmaa (@StarMaa) November 9, 2021 -
మీరు నా బేబీలు.. ఇద్దరూ చెరో ముద్దివ్వొచ్చుగా: జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 60: పింకీ గురించి అందరి నోటా ఒకటే మాట.. ఆమె మానస్ ధ్యాసలో పడి గేమ్ ఆడటం లేదని! తాజాగా ఇదే మాటను సన్నీ కూడా అన్నాడు. పింకీ.. నీ జోన్లో ఉందని మానస్‌తో చెప్పుకొచ్చాడు సన్నీ. నీ ఆట నువ్వాడని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. దీనిపై మానస్ స్పందిస్తూ.. 'ఆమె ఎవరి మాటా వినదు, తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్ తీసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే పింకీ గేమ్‌ను తాను డిస్టర్బ్ చేయడం లేదన్నాడు మానస్. ఇక మెడలు పట్టేసిన జెస్సీ హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఓవైపు సిరి, మరోవైపు ప్రియాంకను కూర్చోబెట్టుకుని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. 'బుగ్గలు రెండు ఒకలా మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని కోరిక వెలిబుచ్చాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలి వచ్చి తంతుందని సెటైర్ వేసింది. ఏంటీ ముద్దులు పెట్టరా? అని మరోసారి అడగ్గా ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు. అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీములుగా విడిపోయారు. రవి, జెస్సీ, యానీ, విశ్వ, సిరి, సన్నీ నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్ విలన్స్ టీమ్‌గా, ఎర్ర గులాబీలను ఎంచుకున్న మిగిలిన వారంతా సూపర్ హీరోస్ టీమ్‌గా విడిపోయారు. ఇతర టీమ్‌లోని సభ్యులతో ఐ క్విట్ అని చెప్పేలా చేయడమే గేమ్. అలా చెప్పించడం కోసం ఏమైనా చేయవచ్చు! గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోస్ టీమ్‌లోని కాజల్ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ తాళాలన్నీ ఓపెన్ చేసింది. ఇది చూసిన విలన్స్ టీమ్‌లోని విశ్వ వెంటనే వచ్చి తన టీమ్‌వైపు ఉన్న డోర్ తాళాలను తెరిచి హౌస్‌లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ విశ్వ మొదటగా స్టోర్ రూమ్‌లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. మీరు ఫిజికల్ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది. మొదటి రౌండ్లో విలన్స్‌కు ఛాన్స్ రాగా వాళ్లు హీరోల టీమ్ నుంచి శ్రీరామ్‌ను సెలక్ట్ చేశారు. అతడికి పెయింట్ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్‌లు తాగడం వంటి టాస్క్లిచ్చారు. అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్‌కు ఒక పాయింట్ లభించినట్లైంది. తర్వాతి రౌండ్లో పింకీ తనను తోసిందని సిరి ఆరోపించింది. తనను అందరూ చుట్టుముట్టేస్తే తోయకుండా ఏం చేయాలంది పింకీ. ఈ ఇద్దరి వాదనలు విన్న షణ్ను.. పింకీ, సిరి ఇద్దరిదీ తప్పేనంటూ పెదరాయుడిలా తీర్పునిచ్చాడు. తర్వాతి రౌండ్లో హీరోలు.. విలన్స్ టీమ్‌లోని రవిని టార్గెట్ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్ చేయాలన్నారు. అయితే రవి దేనికీ జంకకుండా, వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మరోసారి జ్యూస్ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు. అయితే అతడికి బ్యాక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయింది యానీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి మీకే ఇస్తానని చెప్పింది. అయినప్పటికీ లెక్క చేయని విలన్లు అతడితో గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ వెంటనే మరో జ్యూస్ గ్లాస్‌ను సైతం గడగడా తాగాడు. అయినప్పటికీ వారూ మరో డ్రింక్‌ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్‌ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు -
జెస్సీకి అస్వస్థత, లెక్క చేయని షణ్ముఖ్, సిరి
Bigg Boss 5 Telugu, 9th Week Nominations: జెస్సీ పొద్దుటినుంచి వాంతింగ్ చేసుకుంటుంటే పక్కనే ఉండి కాసేపు అతడికి అండగా నిలబడ్డాడు. జెస్సీ ఆరోగ్యం బాగోలేకపోతే షణ్నూ, సిరి ఏమాత్రం పట్టించుకోవట్లేదేంటని సన్నీ మానస్‌తో వాపోయాడు. కానీ మానస్ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సలహా ఇచ్చాడు. మరోవైపు జెస్సీ లోపలికి వెళ్లి బెడ్‌పై కూర్చుని అవస్థ పడుతున్నాడు. అతడి పక్కనే ఉన్న షణ్ను చూసి వదిలేశాడే కానీ, కనీసం ఏమైందని కూడా ఆరా తీయకపోవడం గమనార్హం. సీక్రెట్ టాస్క్ ఫెయిలయినప్పటి నుంచి జెస్సీని వాళ్లు దూరం పెడుతున్నారని మానస్ అభిప్రాయపడ్డాడు. అనంతరం 9వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరాఖ్ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా ఫరాఖ్ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్. తర్వాత సంచాలకుడిగా సరైన నిర్ణయం తీసుకోలేదని జెస్సీని నామినేట్ చేశాడు. కాలేజీ బ్యాచ్‌లాంటి గొడవలొద్దంటూ శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను నామినేట్ చేశాడు. 'అన్నీ గుడ్ క్వాలిటీస్, ఫెంటాస్టిక్ పర్సన్.. కానీ ధైర్యం కోల్పోతున్నావ్' అంటూ రవి.. మానస్‌ను, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. పింకీ.. స్ట్రాంగ్ అంటూ విశ్వను, రవి ఆలోచనలను అందుకోలేకపోతున్నానని అతడిని నామినేట్ చేసింది. సిరి.. సన్నీ, యానీని; జెస్సీ.. సన్నీ, మానస్‌ను; సన్నీ.. జెస్సీ, సిరిని నామినేట్ చేశారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు వెళ్లిపోవాలంటే వీక్‌గా ఉండేవాళ్లు కూడా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ విశ్వ ప్రియాంకను, తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. ఇక కాజల్- రవి మధ్య మరోసారి ఫైట్ జరిగింది. ఆమె రవితోపాటు శ్రీరామ్‌ను నామినేట్ చేసింది. యానీ.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. షణ్ను.. మానస్‌తో పాటు ప్రియాంకను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, అందరిలో నువ్వే స్ట్రాంగ్ అనిపిస్తావు' అని సలహా ఇచ్చాడు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. 'నామినేట్ చేసి వెళ్లిపోయాక ఇంకెవరు ఆడతారు?' అని చిర్రుబుర్రులాడింది. అయినా నేను ఏ గేమ్ సరిగా ఆడటం లేదో చెప్పాలి కదా! అని ఆవేశపడింది. షణ్ను ఫోమ్ పూయబోతే పింకీ ఆ ప్లేట్‌ను తన ముఖాన గట్టిగా కొట్టుకుంది. నామినేషన్ పూర్తయ్యాక సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్ చేశానో అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ ఇది వారిద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. హైలైట్ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్ గుసగుసలు పెట్టడంతో వినేసిన సిరి... నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ, విశ్వ నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: బిగ్‌బాస్‌లో లోబో మిత్రువులు, శత్రువులు ఎవరో తెలుసా? -
అది నిరూపిస్తే బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతా: సన్నీ సవాల్
Bigg Boss Telugu 5, Episode 55: కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన గొడవ నుంచి తేరుకోలేకపోయాడు సన్నీ. తాను, మానస్ ఎలా ఓడిపోయానని చెప్తారని ఆవేశంతో ఊగిపోయాడు. ఇదంతా హౌస్‌లో నుంచి చూసిన రవి.. సన్నీతో మాట్లాడు కానీ మానస్‌తో మాట్లాడొద్దు అని జెస్సీకి సలహా ఇచ్చాడు. గేమ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మండుతుందని ఫైర్ అయ్యాడు శ్రీరామ్. మరోపక్క రవి ఈవారం పెద్దగా పర్ఫామ్ చేయలేదని అభిప్రాయపడ్డాడు షణ్ను. అటు కాజల్ మాత్రం శ్రీరామ్ ఇంకా మాస్క్ తీయలేదని సన్నీ, మానస్‌లతో చెప్పుకొచ్చింది. అటు శ్రీరామ్.. నామినేషన్స్ తప్పించుకునేందుకు కాజల్ కాంట్రవర్శీలకు పోవడం లేదని పేర్కొనగా రవి అవునని తలూడించాడు. ఆమెను సేఫ్ ప్లేయర్‌గా అభివర్ణించాడు. తర్వాత హౌస్‌లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. ముందుగా కెప్టెన్ షణ్ను.. నీ ఫ్రెండ్స్ వల్ల నీ గేమ్ కనిపించలేదంటూ కాజల్ పేరు సూచించాడు. సన్నీ.. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు. ఇక మానస్ కూడా సంచాలకుడిగా సరిగా పని చేయలేదని జెస్సీనే వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. రవి, సిరి.. సన్నీని; యానీ.. ప్రియాంకను; ప్రియాంక సింగ్, లోబో.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా.పేర్కొన్నారు టాస్క్‌లో శ్రీరామ్ ప్రవర్తన ప్రొవోకింగ్‌గా అనిపించిందని చెప్పింది కాజల్. తర్వాత జెస్సీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్ అని చెప్పే క్రమంలో వీళ్లిద్దరికీ మరోసారి గొడవైంది. నీ గేమ్ నువ్వు ఆడు, పక్కవాళ్ల గేమ్ ఆడకు అని హెచ్చరిస్తూ కాజల్ చెత్తగా ఆడిందన్నాడు శ్రీరామ్. మొత్తంగా ఈ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షణ్ను.. సన్నీ బస్తాను తన్నడం నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో త్రిమూర్తులకు, సన్నీకి మధ్య పెద్ద గొడవ జరిగింది. సిరి కత్తి పట్టుకోవడం తప్పు కాదా? అని ప్రశ్నించాడు జెస్సీని కావాలని తన్నాను అని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతానన్నాడు. అతడికి మద్దతుగా రంగంలోకి దిగి వాదనకు దిగారు మానస్, కాజల్. చివర్లో యానీ.. తన ఓటును సన్నీకి మార్చడంతో ఇంట్లో అందరికన్నా ఎక్కువగా సన్నీకే 4 ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని జైల్లో వేశారు. -
కాలితో తన్నిన సన్నీ, పోటుగాడివా అంటూ జెస్సీ ఫైర్
Bigg Boss 5 Telugu Promo, Final Fight For Captaincy: కెప్టెన్సీని దక్కించుకునేందుకు కొట్టుకోవడానికి కూడా వెనుకాడట్లేదు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. తాజాగా హౌస్‌లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్‌లో పెద్ద రగడ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను ఓడించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయితే సంచాలకుడైన జెస్సీ సర్కిల్ దాటి బయటకు వచ్చిన శ్రీరామ్, మానస్ ఇద్దరూ ఔట్ అని ప్రకటించాడు. కానీ అంతలోనే మాట మారుస్తూ శ్రీరామ్ ఇంకా ఆటలోనే ఉన్నాడని, అతడు కొనసాగొచ్చని వెల్లడించాడు. దీంతో షాకైన సన్నీ.. ఇద్దరూ ఔట్ అని చెప్పాక మళ్లీ కొత్తగా ఇదేంటని ఫైర్ అయ్యాడు. ఆవేశంతో జెస్సీ ముందున్న సంచిని కాలితో తన్నాడు. అతడి చర్యకు చిర్రెత్తుకొచ్చిన జెస్సీ.. కాలితో కొడతావేంటి? పెద్ద పోటుగాడిలాగా! అంటూ మండిపడ్డాడు. మరి జెస్సీ నిజంగానే గేమ్‌లో పక్షపాతం చూపించాడా? లేదా అనవసరంగా సన్నీ, మానస్ అతడితో గొడవకు దిగుతున్నారా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
కెప్టెన్సీ పోటీలో ఆరుగురు! తగ్గేదేలే అంటూనే జెస్సీ వెనకడుగు!
Bigg Boss Telugu 5, Captaincy Task Fight Between Priyanka Singh And Anee Master: కెప్టెన్ అవడానికి హోరాహోరీగా పోరాడుతున్నారు కంటెస్టెంట్లు. అందులో భాగంగా బిగ్‌బాస్ ఇస్తున్న ప్రతీ టాస్క్‌ను చీల్చి చెండాడేస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీకి పోటీపడేందుకు ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో మొదటి ఛాలెంజ్‌లో షణ్ముఖ్, రెండోదాంట్లో సిరి, మూడవ టాస్క్‌లో శ్రీరామచంద్ర గెలుపొందారు. నేడు మిగిలిన రెండు ఛాలెంజ్‌లు పూర్తి చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్. తాజాగా రిలీజైన ప్రోమో మేరకు.. రంగు పడుద్ది అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు ప్రియాంక సింగ్, యానీ మాస్టర్.. ఎవరికివారే తీవ్రంగా శ్రమించారు. ఇక ఐదో ఛాలెంజ్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై చర్చోపచర్చలు సాగించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కెప్టెన్ అయినంత మాత్రాన మళ్లీ కెప్టెన్సీకి ప్రయత్నించకూడదా? అని ఫైర్ అవుతున్నాడు జెస్సీ. అప్పుడెప్పుడో మూడోవారం కెప్టెన్ అయ్యానని, నేనెందుకు ఈ అవకాశాన్ని వదిలేసుకోవాలని ప్రశ్నించాడు. కానీ అతడితో ఎవరూ ఏకీభవించినట్లు కనిపించడం లేదు. దీంతో జెస్సీ తాను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనివల్ల తనకు వరస్ట్ పర్ఫామర్ ఇచ్చినా నాకనవసరం అని అసహనం వ్యక్తం చేశాడు. మొత్తంగా ఈవారం కెప్టెన్సీ కోసం యానీ, శ్రీరామ్, షణ్ను, మానస్, సిరి, సన్నీ పోటీపడుతున్నట్లు సమాచారం. -
పుట్టుకతోనే నాకు ఆ సమస్య, మా అమ్మ బయటకు చెప్పుకోదు: జెస్సీ
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కొట్లాటలకు కొదువ లేకుండా పోయింది. ఫన్ కన్నా ఫ్రస్టేషన్, ఫైటింగ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని పక్కనపెట్టి కంటెస్టెంట్లతో ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. తాజాగా వారి జీవితంలోని జ్ఞాపకాలను పంచుకోమని ఆదేశించినట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోలో.. సన్నీ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ముగ్గురు అబ్బాయిలను ఒక మహిళ కష్టపడి పెంచడమనేది ఎంత ఛాలెంజింగో నాకు తెలుసు అంటూ తన స్టోరీ చెప్తున్నాడు. ఇక జెస్సీ వంతు రాగా.. 'నాకు గొంతు సమస్య ఉంది. దానివల్ల వాయిస్ సరిగా రాదు. అది నాకు పుట్టుకతోనే ఉంది. కానీ నేను గిన్నిస్‌బుక్ ఎక్కాను, ఫ్యాషన్ ఐకాన్ అయ్యాను, జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే మా అమ్మ ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని బయటకు చెప్పుకోదు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లి ఏమన్నా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి అని అందరూ అన్నారంటూ ఎమోషనల్ అయింది సిరి. హౌస్మేట్స్ చెప్పే జ్ఞాపకాలను వినాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
అగ్ని పరీక్ష.. ఛీ కొట్టిన పింకీ, చిందులు తొక్కిన షణ్ముఖ్
Bigg Boss Telugu, Episode 37: హమీదా వెళ్లిపోయాక శ్రీరామచంద్ర కాస్త డల్ అయిపోయినట్లు కనిపించింది. అర్ధరాత్రి నిద్రలో కూడా ఏవేవో కేకలు వేయడంతో ఇంటిసభ్యులు ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న విశ్వ.. అతడి పరిస్థితి అర్థమై అతడి వీపు నిమురుతూ నిద్రపుచ్చాడు. మరోపక్క నామినేషన్స్‌లో ఎలా ఫైట్ చేయాలా? సిరి, జెస్సీ, షణ్ముఖ్ చర్చించుకున్నారు. ఏదేమైనా సరే, అతడికి రివర్స్ కౌంటరివ్వు, ఏం కాదంటూ సిరిని శ్రీరామ్ మీదకు ఉసిగొల్పాడు షణ్ముఖ్. మరోపక్క కెప్టెన్, రేషన్ మేనేజర్‌కు అస్సలు పడటం లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. రేషన్ మేనేజర్‌గా నువ్వు ఫెయిలయ్యావంటూ విశ్వ ముఖం మీదే చెప్పేసింది ప్రియ. అంతేకాకుండా అందరికీ గిన్నెల్లో వేసి పెట్టిన తర్వాతే తినాలని అతడిని ఆదేశించింది. కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ మొదలయ్యాయి. నిప్పులా ఎగసిపడుతున్న అభిప్రాయాలను 'అగ్నిపరీక్ష' టాస్క్‌లో బయటపెట్టాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన సన్నీ.. రవి, జెస్సీ ఫొటోలను మంటలో వేశాడు. తర్వాత వచ్చిన విశ్వ.. ఎంతో కష్టపడి బిగ్‌బాస్‌కు వచ్చిన తనను స్ట్రాంగ్ అంటూ పదేపదే నామినేట్ చేయడం నచ్చలేదంటూ యానీ మాస్టర్ ఫొటోను నిప్పులో పడేశాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యానీ ఉగ్రావతారం ఎత్తింది. ఇకపై తనను అక్క అని పిలవద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తర్వాత అతడు ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. నా గేమ్ నా ఇష్టం, నాకు నీతులు చెప్పకు: సిరి శ్వేత.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. అనంతరం లోబో వంతు రాగా.. నమ్మకం అంటే చచ్చిపోతా, అలాంటిది తన నమ్మకాన్ని చంపారంటూ ప్రియాంక సింగ్, జెస్సీని నామినేట్ చేశాడు. దీనిపై జెస్సీ రియాక్ట్ అవుతూ.. నమ్మకంతో తనకు పని లేదని, గేమ్ ఆడటానికి వచ్చానని సమాధానమిచ్చాడు. సిరి మాట్లాడుతూ.. నీ కెప్టెన్సీలో పక్షపాతం కనిపించిందంటూ శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. నా గేమ్ నా ఇష్టం, ఏం చేయాలో నాకు సూక్తులు చెప్పకంటూ చిర్రెత్తిపోయింది. యాంకర్ రవి.. కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని మానస్‌ను నామినేట్ చేశాడు. జనాలను ఎంటర్టైన్ చేయాలని తాను, లోబో బిగ్‌బాస్‌కు వచ్చామని, కానీ మా ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ సిరి ఫొటోను కాల్చి బూడిద చేశాడు. విశ్వను ఛీ కొట్టిన పింకీ, నవ్వాపుకున్న ప్రియ జెస్సీ.. శ్రీరామ్, సన్నీని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో జెస్సీ, సన్నీ మధ్య పెద్ద ఫైటే నడిచింది. నేను గేమ్ ఆడితే తట్టుకోలేవు, నా మంచితనం పోతే చాలా వరస్ట్‌గా ఉంటుంది అని హెచ్చరించాడు సన్నీ. ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ప్రతిసారి సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయడమే కాకుండా నమ్మకం గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ లోబో ఫొటోను నిప్పుల్లో వేసింది. విశ్వ గురించి మాట్లాడుతూ.. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలి. ఎధవ రీజన్లు చెప్తారు.. ఛీ.. అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయింది. ఇదంతా చూసి ప్రియ నవ్వాపుకోవడం గమనార్హం. మానస్.. యాంకర్ రవి, లోబోను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నే నామినేట్ చేస్తానంటూ షణ్ముఖ్ ఫొటోను నిప్పుల్లో పడేసింది. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకు, వెనకాల నుంచి పొడవకు అని హెచ్చరిస్తూ విశ్వ ఫొటోను కాల్చివేసింది. అందుకోసం నేను బిగ్‌బాస్‌కు రాలేదు: కాజల్ తర్వాత శ్రీరామ్ వంతురాగా.. మీ అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోవద్దని సూచిస్తూ సిరిని నామినేట్ చేశాడు. ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్నెవరూ నామినేట్ చేయడంలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతడి ఫొటోను మంటల్లో వేశాడు. ఈ క్రమంలో నిప్పులు తొక్కిన షణ్ను బిగ్‌బాస్ హౌస్‌కు నువ్వు దేవుడివి, నువ్వేం చెప్తే అది చేయాలా? అని ఫైర్ అయ్యాడు. దీంతో శ్రీరామ్ అతడికి కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత కాజల్ మాట్లాడుతూ.. హమీదా నన్ను అక్కా అంటూ పిలిచింది కానీ నేను కనెక్ట్ కాలేకపోయా.. నేను నిన్ను బ్రదర్ అంటూ మాట్లాడదామని ముందుకు వస్తే నువ్వు కనెక్ట్ అవ్వలేదు. ఇదే కర్మ.. ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు, కేవలం గేమ్ ఆడటానికే వచ్చానని తేల్చి చెప్పింది కాజల్. తనను నామినేట్ చేసినందుకు శ్వేత ఫొటోను నిప్పుల్లో వేసింది. అందరికీ పెట్టాకే తినాలి: ప్రియ ప్రియ.. నువ్వేం మాట్లాడతావో అర్థం కాదు, టక్కున నోరు జారేస్తావు. రేషన్ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరికీ పెట్టాకే తినాలి అంటూ విశ్వను నామినేట్ చేసింది. తర్వాత సన్నీ ఫొటోను మంటల్లో వేసింది. ప్రతివారం తనను నామినేట్ చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు సన్నీ. మీరున్నన్ని రోజులు మిమ్మల్నే నామినేట్ చేస్తానంటూ ప్రియను హెచ్చరించాడు. మొత్తంగా ఈ వారం షణ్ముఖ్, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించిన తండ్రి
Bigg Boss Telugu 5, Episode 32: బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి లెవల్లో ఇచ్చిన కుస్తీపోటీలో విశ్వ మానస్‌ను ఓడించి పైచేయి సాధించాడు. తర్వాత తనతో పోటీలోకి దిగిన యానీ మాస్టర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు జెస్సీ. అనంతరం ప్రియాంక సింగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది శ్వేత. మొత్తంగా ఈ టాస్క్‌లో యాంకర్ రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. దీంతో అతడికి 150 నాణాలు వచ్చాయి. అయితే ఖజానాలో నుంచి నాణాలు దొంగిలిస్తున్నారంటూ విశ్వ చిర్రుబుర్రులాడాడు. కానీ విశ్వ పేరు పెట్టి ఎవరినీ తిట్టకపోవడంతో మానస్ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. సైగలతో సంభాషించుకున్న శ్రీరామ్, హమీదా ఇక రాత్రిపూట దుప్పటి కప్పుకుని జెస్సీ, సిరి, షణ్ముఖ్ నాణాలు పంచుకున్నారు మరోపక్క హమీదా శ్రీరామ్‌ను తన కౌగిలిలో బంధించింది. తర్వాత వీళ్లిద్దరూ ఎప్పటిలాగే సైగలతో సంభాషించుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'రాజుగారి గోడ' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్మేట్స్ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క! శ్రీరామ్ గాలి తీసేశారు..: షణ్ను దీంతో సన్నీకి సపోర్ట్‌గా మానస్, జెస్సీ బరిలోకి దిగారు. ఈ క్రమంలో యువరాజు రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్ తీవ్రంగా ప్రయత్నించాడు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని ఆవేశపడ్డాడు సన్నీ. దీంతో చిర్రెత్తిపోయిన శ్రీరామ్.. ఏకంగా గోడను మొత్తం నేలకూల్చాడు. కానీ చివరగా ఈ టాస్క్‌లో యువరాజు సన్నీ విజయం సాధించడం విశేషం. సన్నీ గెలుపును అభినందించిన షణ్ను.. ఇప్పటిదాకా స్ట్రాంగ్ అనుకున్న శ్రీరామ్ గాలి తీసేశారంటూ సెటైర్ వేశాడు. ఆ అవార్డు ఉంటే అది కాజల్‌కే చెల్లుతుంది: యానీ ఇంతలో కాజల్ నాణాలు దొంగతనం చేయడం చూశాడు రవి. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించమంటూ బుకాయించింది కాజల్. అడ్డంగా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నించిన కాజల్ యవ్వారంతో ఇరకాటంలో పడ్డాడు రవి.. ఆమెతో పెట్టుకుంటే పనులు అయినట్లేనని ఆమెను అలా వదిలేశాడు. ఈ సీను అంతా చూసిన యానీ మాస్టర్.. నిజానికి ప్రోవోక్ అనే అవార్డు ఉంటే అది కాజల్‌కే ఇవ్వాలంది. ఇంతలో సిరి.. సడన్‌గా రవి రాజ్యంలో నుంచి సన్నీ రాజ్యంలోకి షిఫ్ట్ అయింది. మళ్లీ గెలిచిన సన్నీ.. అనంతరం బిగ్‌బాస్.. 'లాక్కో లాక్కో తాడు' టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు లెక్క! ఈ టాస్క్‌లో మరోసారి యువరాజు సన్నీ గెలుపు సాధించడంతో అతడి ప్రజానీకం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఆమెగా మారిన విషయాన్ని పింకీ తండ్రి స్వాగతించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పింకీ ఎంతో భావోద్వేగానికి లోనవగా హౌస్ మొత్తం కూడా ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది. -
బిగ్‌బాస్: జెస్సీతో పోటీకి సై అన్న యానీ మాస్టర్
బిగ్‌బాస్ షోలో ఆడామగా అనే తేడా ఉండకూడదని నాగార్జున చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అదే రూల్‌ను పాటిస్తున్నారు హౌస్మేట్స్. కుస్తీపోటీకి ఇద్దరు మగవాళ్లు కాకుండా, ఒక లేడీ కంటెస్టెంట్, ఒక మేల్ కంటెస్టెంట్ పోటీపడ్డారు. సన్నీ రాజ్యంలో నుంచి జెస్సీ, యాంకర్ రవి రాజ్యంలో నుంచి యానీ మాస్టర్ ముఖాముఖిగా తలపడనున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. మరీ వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే అబ్బాయిలు, అమ్మాయిలకు మధ్య ఇలాంటి టాస్క్ పెట్టినప్పుడు బాయ్స్కే ఎక్కువ మైనస్ అంటున్నారు నెటిజన్లు. ఆడవాళ్లతో కలిసి వారు కంఫర్టబుల్‌గా గేమ్ ఆడలేరని, పూర్తి శక్తిని వినియోగించలేరని చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఎదురుగా ఉంది ఆడ, మగ అని కాకుండా కేవలం పోటీదారులుగా మాత్రమే చూడాలని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా జెస్సీ, యానీ మాస్టర్ల మధ్య ఫైటు మంచి రసపట్టుగా మారనున్నట్లు తెలుస్తోంది. -
శ్రీరామ్‌ను ఎత్తిపడేసిన జెస్సీ, ఇది కదా అసలైన కొట్లాట!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హింసకు తావు లేదని బిగ్‌బాస్ గతంలోనే హెచ్చరించినా కంటెస్టెంట్లు మరోమారు ఆ మాటను పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్కులో హౌస్మేట్స్ దెబ్బలు తాకినా, రక్తాలు కారినా తగ్గేదేలే అన్న రీతిలో పోరాడుతున్నారు. ఈ వారం బిగ్‌బాస్ 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా.. యువరాజులుగా ఉన్న రవి, సన్నీ సింహాసనాన్ని అధిష్టించేందుకు పోటీపడతారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాస్కులు కొనసాగేకొద్దీ కొందరు ప్రజలు తమ యువరాజుకు మద్దతును ఉపసంహరించుకునేందు ప్రయత్నిస్తుండగా మరికొందరు పట్టపగలే ఖజానాను దొంగిలించేందుకు యత్నించారు. ఇది చూసిన శ్వేత.. 'ఇంకా గేమ్ ఎందుకు ఆడటమో' అని సెటైర్ వేసింది. మరోవైపు సన్నీ వర్సెస్ రవి అని రాసి ఉన్న బోర్డులపై యువరాజుల ఫొటోలు పెట్టి ఉండగా హౌస్మేట్స్ దాన్ని విసిరి పారేసేందుకు తీవ్రంగా శ్రమించారు. బోర్డులను కింద పడేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేసినట్లు కనిపించింది. మరీ ఇంత అరాచకంగా మారిన ఈ గేమ్‌లో ఏ యువరాజును ఎవరెవరు గెలిపించారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది! -
కెప్టెన్‌తో కొట్లాట.. సిగ్గు, శరం ఉండాలంటూ యానీ మాస్టర్ ఫైర్
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: నామినేషన్స్ వచ్చాయంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో లెక్కలు మారిపోతుంటాయి. అప్పటిదాకా స్నేహితులుగా ఉన్నవారు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోవచ్చు. ఆల్రెడీ శత్రువులైన వారి మధ్య మరింత దూరాన్ని పెంచవచ్చు. మొత్తంగా కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టే నామినేషన్ పర్వం నేడు స్టార్ట్ అయింది. దీంతో ఎవరెవర్ని నామినేట్ చేయాలా? అని హౌస్మేట్స్ పరిపరివిధాలుగా ఆలోచించారు. మరి నేటి గేమ్‌లో ఎవరు నామినేట్ అయ్యాడు? ఏమేం గొడవలు జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే.. గేమ్‌లో గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేయాలి కానీ ఒకరిని తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే అంతకన్నా లేకిడివాళ్లు ఎవరూ ఉండరు అని జెస్సీ యాంకర్ రవి మీద పరోక్షంగా మండిపడ్డాడు. ఇక్కడ హౌస్‌లో విశ్వ, రవి, లోబో, సన్నీ, మానస్ ఒక గ్రూప్ అయ్యారని షణ్నుతో చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే కిచెన్‌లో పనులు పంచుకోండని కెప్టెన్ శ్రీరామ్ సన్నీకి సలహా ఇచ్చాడు. అయితే ఇంతలో సిరి వచ్చి.. కిచెన్‌లో ఆల్రెడీ మనం పనులు పంచేసుకున్నాం కదా అని చిర్రుబుర్రులాడింది. అయినా ఇక్కడ కెప్టెన్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడంటూ తన గ్యాంగ్‌తో కూర్చున్నప్పుడు శ్రీరామ్ మీద జోకులు పేల్చింది. లోబో వల్లే నాకా శిక్ష, అందుకే నామినేట్: జెస్సీ తర్వాత ఐదోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ఇంటిసభ్యులు ఒకరి తర్వాత ఒకరు కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన జెస్సీ... తన మాటలే వినాలి, తను చెప్పినట్లే ఆడాలని రవి మానిప్యులేట్ చేస్తున్నాడంటూ అతడిని నామినేట్ చేశాడు. లోబో వల్లే కెప్టెన్సీ టాస్క్‌లో శిక్ష పడిందని అతడిని నామినేట్ చేశాడు. తర్వాత సన్నీ.. షణ్ముఖ్, సిరితో కనెక్ట్ కాలేకపోయానంటూ వారిద్దరినీ నామినేట్ చేశాడు. ఆమె ఏది మాట్లాడినా సీరియస్‌గా తీసుకుంటుంది..: పింకీ విశ్వ.. జెస్సీ చాలాసార్లు నోరు జారాడని, షణ్ముఖ్ రేషన్ మేనేజర్ అయ్యాక అతడి ప్రవర్తన మారిపోయిందంటూ వారిని నామినేట్ చేశాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన రవి, సన్నీని నామిట్ చేస్తున్నానని తెలిపింది. అనంతరం లోబో.. 'గతవారం ప్రియ మీద అరిచినప్పుడు మానస్, షణ్ముఖ్ సడన్‌గా నా మీద పడి నామినేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈ ఇద్దరినీ నామినేట్ చేస్తున్నా'నని వెల్లడించాడు. ప్రియాంక సింగ్.. సరదాగా మాట్లాడినా హమీదా సీరియస్‌గా తీసుకుంటుందని, లోబో టాస్కుల్లోనూ స్ట్రాంగ్‌గా అవ్వాలని నామినేట్ చేస్తున్నానని తెలిపింది. షణ్ముఖ్ నన్ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడు: రవి సిరి మాట్లాడుతూ.. పక్కవాళ్ల గేమ్‌లో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్న రవిని, రేషన్ మేనేజర్ అయ్యాక హమీదా ప్రవర్తనలో తేడా వచ్చిందంటూ ఆమెను నామినేట్ చేసింది. రవి.. జెస్సీది ఇమ్మెచ్యూర్ బిహేవియర్డ్ అనిపిస్తుందన్నాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని తన పేరు ట్యాగ్చేయడం చాలా నెగెటివిటీగా అనిపించిందని పేర్కొన్నాడు. గతవారం అకారణంగా తనను నామినేట్ చేసిన షణ్ముఖ్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. అతడు వేరేవాళ్ల గురించి తన దగ్గర చెప్తూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడనిపించిందని అభిప్రాయపడ్డాడు. విశ్వ సొంతంగా గేమ్ ఆడట్లేదు: షణ్ను యానీ మాస్టర్.. తనకు టఫ్ కాంపిటీటర్స్ అయిన రవి, విశ్వను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. అనంతరం షణ్ముఖ్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ చూసిన విశ్వ వేరు, ఇప్పుడు చూస్తున్న విశ్వ వేరు.. పక్కవాళ్ల ఇన్ఫ్లూయెన్స్ వల్లో, మరింకేదైనా కారణమో తెలీదు కానీ ఇండిపెండెంట్ గేమ్ మర్చిపోయాడనిపిస్తోందని తెలిపాడు. తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. హమీదా వంతు రాగా.. ప్రియ తనతో సరిగా ఉండదని, షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండనుకున్నా, కానీ అతడు వేరే జోన్లో ఉంటున్నాడంటూ వారిద్దరినీ నామినేట్ చేసింది. జెస్సీ హైపర్ అయిపోతుంటే, షణ్ను వేరే ప్రపంచంలో ఉంటున్నాడు.. శ్వేత.. తనకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని కాజల్, మానస్‌ను నామినేట్ చేసింది. ప్రియ.. ఎవరి గేమ్ వారు ఆడాలని చెప్పే షణ్ముఖ్ అతడిదాకా వచ్చేసరికి మాత్రం పాటించడం లేదంది. ఇక సన్నీ తనను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తోందంటూ అతడిని నామినేషన్లోకి పంపింది. మానస్.. జెస్సీ, షణ్ముఖ్‌ను నామినేట్ చేశాడు. కెప్టెన్ శ్రీరామ్.. జెస్సీ హైపర్ అవుతున్నాడని, షణ్ముఖ్ వేరే ప్రపంచంలో ఉండిపోతున్నాడంటూ వాళ్లిద్దరినీ నామినేట్ చేశాడు. ఆ ఒక్కరు తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌కు వ్యతిరేకమే! తర్వాత ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారన్న విషయాన్ని బిగ్‌బాస్ పేర్లతో సహా వెల్లడించాడు. అత్యధికంగా షణ్ముఖ్‌ను ఎక్కువమంది నామినేట్ చేశారు. మరీ ముఖ్యంగా జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ను ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు. మొత్తంగా ఈ ఐదోవారంలో షణ్ముఖ్, రవి, హమీదా, లోబో, మానస్, సన్నీ, ప్రియ, విశ్వ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అలా హార్ష్‌గా మాట్లాడకురా.. : షణ్నును అభ్యర్థించిన రవి ఈ ప్రక్రియ అనంతరం కిచెన్‌లో మరోసారి చిచ్చు చెలరేగింది. మానస్‌ను నామినేట్ చేసినందుకు అతడు ఇంత యాటిట్యూడ్ చూపించాలా అని శ్వేత మండిపడింది. అతడితో మాట్లాడటమే అనవసరం అని ఫీలైంది. మరో పక్క శ్రీరామ్.. షణ్ముఖ్, జెస్సీ, సిరి రెండు రోజుల నుంచి డిఫరెంట్‌గా ఉంటున్నారని అభిప్రాయపడ్డాడు. మరోవైపు షణ్ముఖ్-రవిల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. నీతో దూరంగా ఉంటున్నంత మాత్రాన నేను సరిగా పర్ఫామ్ చేయనట్లు కాదని ముఖం పట్టకుని మాట్లాడాడు షణ్ను. దీంతో రవి.. అంత హార్ష్‌గా మాట్లాడకురా అని రిక్వెస్ట్ చేసినప్పటికీ అతడు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జెస్సీ ఫుడ్ తనే వండుకుని తినాలి: కెప్టెన్ కొత్త రూల్ ఇక కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో ఎవరి వంట వాళ్లు వండుకుని తినేలా రూల్ పెడతానని జెస్సీని హెచ్చరించాడు శ్రీరామ్. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని ఆదేశించాడు. దీంతో హర్ట్ అయిన జెస్సీ.. నాకు ఫుడ్ పెట్టరంట, నా ఫుడ్ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్ అయిపోయారు. 'ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కెప్టెన్ మీద విరుచుకుపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలోకి రాకంటూ హెచ్చరించాడు శ్రీరామ్. ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్ కెప్టెన్‌వి అంతే! అని అగ్గి మీద గుగ్గిలమైంది సిరి. నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్. వాళ్లు తినకపోతే నేనూ తినను: కెప్టెన్ ఇక ఈ గొడవతో చిర్రెత్తిపోయిన యానీ మాస్టర్ సిగ్గు, శరం ఉండాలి అలా గ్రూప్‌ను వేసుకుని రావడానికి అంటూ జెస్సీ మీద ఫైర్ అయినట్లు కనిపించింది. కానీ కొద్ది సేపటికే సిరి, షణ్ను, జెస్సీ తినకుండా కూర్చోవడంతో యానీ వారి దగ్గరకు వెళ్లి తినమని బుజ్జగించింది. ఆకలేస్తే తింటారు, లేకపోతే వదిలేయండి అంటూ కెప్టెన్ శ్రీరామ్ ఓపక్క చిరాకు పడుతూనే వాళ్లు తినకపోతే తాను కూడా తిననని శపథం చేశాడు. వెంటనే జెస్సీ, షణ్ముఖ్‌లకు ప్లేటులో భోజనం పట్టుకెళ్లి తినిపించడం విశేషం. -
ఇది నీ ఇల్లు కాదన్న షణ్ను, మధ్యలోకి రాకంటూ శ్రీరామ్ వార్నింగ్!
Bigg Boss Telugu 5 Promo, Shanmukh Vs Sreeram బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయా? అన్న ప్రశ్నకు మెజారిటీగా అవునని కొద్దిమంది మాత్రం కాదని సమాధానాలిస్తారు. అయితే తాజా ప్రోమోతో హౌస్‌లో గ్రూపులు ఉన్నాయన్న విషయం బట్టబయలైంది. గ్రూపులో ఉన్న ఏ ఒక్కరితో పెట్టుకున్నా మిగతా వాళ్లు గయ్యిమని లేస్తారని తేట తెల్లమైంది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు ఏ గ్రూప్‌తో ఏరికోరి గొడవ పెట్టుకున్నారు? వీటికి సమాధానాలు తెలియలాంటే తాజాగా వచ్చిన ప్రోమో చూసి తీరాల్సిందే! షణ్ముఖ్‌ను నామినేట్ చేసింది వీళ్లే అంటూ బిగ్‌బాస్ 8 మంది కంటెస్టెంట్ల ఫొటోలను టీవీలో వేసి చూపించాడు. అందులో యాంకర్ రవి, లోబో, శ్రీరామ్, ప్రియ, హమీదా, సన్నీ, విశ్వ, మానస్ ఉన్నారు. తన మీద అంతమంది పగపట్టారా? అని ఒక్క క్షణం పాటు షాకైన షణ్ను తనను నామినేట్ చేసినందుకు థాంక్యూ చెబుతూ ఓ స్మైల్ విసిరాడు. ఇక కిచెన్‌లో పెద్ద యుద్ధమే జరిగినట్లు కనిపిస్తోంది. ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్ పెడతాను అని కెప్టెన్ శ్రీరామ్ జెస్సీకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జెస్సీ ఫుడ్ ఇవ్వను, ఫుడ్ పెట్టను అనడం ఏంటని అసహనానికి లోనయ్యాడు. తన ఫ్రెండ్ జెస్సీ మీదకు శ్రీరామ్ ఫైర్ అవడం చూసిన సిరి, షణ్ను.. కెప్టెన్ మీద అరిచినంత పనిచేశారు. 'నీ ఇష్టం వచ్చినట్లు రూల్ పెట్టుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కౌంటరిచ్చాడు షణ్ను. విషయం తెలియకుండా మధ్యలోకి రావద్దని హెచ్చరించాడు శ్రీరామ్. అయినా నువ్వెవరు మాకు చెప్పడానికి అని సిరి సీరియస్ అవగా.. నువ్వొచ్చి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్. మొత్తంగా నేడు జరిగిన పరిణామాలను బాగా సీరియస్‌గా తీసుకున్న షణ్ను ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ హౌస్‌మేట్స్‌కు సవాలు విసిరాడు. మరి ఇప్పటికైనా షణ్ను గేమ్ ఆడటం మొదలు పెడతాడో? లేదో? చూడాలి! -
నా మీద పడి ఏడవకు: అందరిముందే రవికి జెస్సీ వార్నింగ్
Bigg Boss Telugu 5 Promo: సింగర్ శ్రీరామ్, హమీదా మధ్య లవ్ ట్రాక్‌ను మరోసారి గుర్తు చేశాడు కింగ్ నాగార్జున. హమీదా కోసం గిటార్‌తో ఓ మ్యూజిక్ ప్లే చేయడం, హమీదా తనకు లవ్ ఫీలింగ్ వస్తుందనడం నిన్నటి ఎపిసోడ్లో చూశాం కదా! దీంతో నాగ్ కూడా గిటార్ అందుకుని సేమ్ మ్యూజిక్ ప్లే చేశాడు. పాట ఎలా ఉందని నాగ్ అడగ్గా.. లవ్ ఫీల్ వస్తుందని తెగ సిగ్గుపడిపోయింది హమీదా. గతవారం నటరాజ్‌ను గుంటనక్క ఎవరని అడిగిన నాగ్.. ఈసారి మాత్రం ఆ నత్త ఎవరు? అని ప్రశ్నించాడు. దీంతో నటరాజ్ తెలిసిపోయిందా అని పడీపడీ నవ్వాడు. అప్పటివరకు సరదాగా సాగిన వాతావరణం జెస్సీ ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. తనను ఫోకస్ చేయడం ఆపేయాలని యాంకర్ రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జెస్సీ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అందరిముందే హెచ్చరించడంతో రవి గుడ్లు తేలేశాడు. జెస్సీ వ్యాఖ్యలపై రవి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: రెండోసారి ఊచలు లెక్కబెట్టనున్న కంటెస్టెంట్
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది ఓ వరం. ఆ వరాన్ని అందుకోవడం కోసం ఎన్ని పాట్లైనా పడతారు కంటెస్టెంట్లు. అయితే కెప్టెన్ అవడం కోసం పడే కష్టం ఒక ఎత్తైతే కెప్టెన్‌గా నిరూపించుకోవడం మరో ఎత్తు. హౌస్‌లో ఏ చిన్న గొడవ జరిగినా, పనుల పంపకాల్లో తేడాలు వచ్చినా, రూల్స్ సరిగా పాటించకపోయినా అందరూ కెప్టెన్ వైపే వేలు చూపిస్తారు. గత వారం కెప్టెన్ అయిన జెస్సీ నాయకత్వంలో విఫలమయ్యాడు. తను చెప్పిన మాటలను ఇంటిసభ్యులు పట్టించుకోకపోవడంతో బిగ్‌బాస్ ఆగ్రహానికి గురయ్యాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ఇంట్లోని ఆహారాన్ని మొత్తం పంపించేయాలని చెప్పినప్పుడు లోబో అందుకు ఒప్పుకోలేదు. అయితే అతడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హౌస్ కెప్టెన్‌గా బిగ్‌బాస్ ఆదేశాన్ని శిరసావహిస్తూ ఫుడ్ మొత్తాన్ని పంపించి తీరాల్సిందే! కానీ తినే ఫుడ్ లాక్కునేందుకు మానవత్వం అడ్డురావట్లేదా? అని హౌస్మేట్స్ భారీ డైలాగులు కొట్టడంతో సైలెంట్ అయిపోయాడు. ఇదే అతడి కొంప ముంచింది. తన ఆదేశాలను ధిక్కరించినందుకుగానూ బిగ్‌బాస్ జెస్సీతో పాటు, ఆ టాస్క్‌లో అతడితో జోడీ కట్టిన కాజల్‌పై అనర్హత వేటు వేశాడు. దీంతో ఈ ఇద్దరూ కెప్టెన్సీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ కూడా చాలామంది జెస్సీనే తప్పుపట్టారు. కెప్టెన్‌గా బిగ్‌బాస్ ఆదేశాలను మాత్రమే పట్టించుకోవాలని, ఇంటిసభ్యుల మాటలు చెవికెక్కించుకోరాదని చురకలు అంటించారు. అతడి వైఫల్యం వల్లే అనర్హత వేటు పడిందని కామెంట్ చేశారు. కెప్టెన్ అంటే కమాండింగ్ ఉండాలని, జెస్సీ అందులో విఫలమయ్యాడని పెదవి విరిచారు. అంతేకాదు, ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆదేశించగా చాలామంది జెస్సీ పేరునే సూచించారట! దీంతో తొలివారంలోనే జైలు జీవితం గడిపిన అతడు మరోసారి ఊచలు లెక్కబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. -
కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు, గెలుపెవరిదో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 25: బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వల్ల హౌస్‌మేట్స్‌కు అన్నం విలువేంటో తెలుసొచ్చింది. కడుపులో పేగులు అరుస్తున్నా గేమ్ కోసం వారి ఆకలిని చంపుకుని మరీ ఆడారు. వీరి జిహ్వచాపల్యానికి పరీక్ష పెడుతూ బిగ్‌బాస్ పదేపదే రుచికరమైన వంటకాలను పంపించాడు. మరి వాటిని ఎవరెవరు ఆరగించారు? ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే నేటి(సెప్టెంబర్ 29) ఎపిసోడ్ చదివేయాల్సిందే! ఎలాగైనా ఒక్క బజర్ అయినా కొట్టి బరువు తగ్గాల్సిందేనని సన్నీ, మానస్ తెగ ఆశపడ్డారు. కానీ అదేసమయంలో ముద్దపప్పు, ఆవకాయ గుర్తొస్తుందంటూ ఊహల్లో తేలిపోయారు. అటు లోబో పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ అతడి జంటసభ్యుడు అయిన నటరాజ్ మాస్టర్ మాత్రం ఎలాగైనా నోరు కట్టేసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో లోబో సరేనని తలూపాడు. మరోపక్క బిగ్‌బాస్ పావ్‌బాజీ పంపించగా ఇంటిసభ్యులు దాన్ని తిరస్కరించారు. ఆకలికి, ఆహారానికి మధ్య గ్యాప్‌లో బతికేస్తున్న ఎన్నో జీవితాలకు ఏదైనా మంచి సందేశమివ్వాలని బిగ్‌బాస్ ఆదేశమివ్వడంతో హౌస్మేట్స్ చిన్న స్కిట్ వేసి అందరినీ అలరించారు. అనంతరం కెప్టెన్ జెస్సీ తన ఆదేశాలను బేఖాతరు చేశాడని బిగ్‌బాస్ ఆగ్రహించాడు. ఇంట్లోని ఆహార పదార్థాలను ఇచ్చేయమని చెప్పినప్పుడు లోబో, సన్నీ తింటున్నా ఏమనకుండా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడికి పెద్ద శిక్ష విధించాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో నుంచి జెస్సీతో పాటు అతడి జోడీ కాజల్‌ను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన జెస్సీ.. ఏ ఒక్కరూ తన మాట వినలేదని చిర్రెత్తిపోయాడు. తనను టార్గెట్ చేయడమైతే వచ్చని చిందులు తొక్కాడు. అయినా కెప్టెన్‌కు సహకరించకపోవడం మన తప్పేనని కొందరు ఇంటిసభ్యులు పశ్చాత్తాపపడుతుంటే నటరాజ్ మాస్టర్ మాత్రం అసలు కెప్టెన్ ఇలా ఉంటాడా? కమాండింగ్‌గా ఉండాలి అని హితబోధ చేశాడు. ఇక జెస్సీని చెడగొడుతున్నారని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు షణ్ముఖ్.. జెస్సీని కూర్చోబెట్టుకుని ఇక్కడ అందరూ సమానమే, ఎవరినీ అన్న, తమ్ముడు అని కాకుండా పేరు పెట్టి పిలవమని సూచించాడు. తర్వాత పిడుగుల శబ్ధం వినబడగానే విశ్వ మొదటగా వెళ్లి బజర్ నొక్కాడు. దీంతో విశ్వ-రవి జోడీ.. ప్రియాంక సింగ్-ప్రియను పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ రెండు గ్రూపులకు కట్టెలు కొట్టడాన్ని టాస్క్‌గా ఇచ్చారు. ఇందులో 'విశ్వ' ప్రతాపం చూపించడంతో వీళ్ల జంట గెలిచింది. ఇక షణ్ముఖ్ మరోసారి.. టాస్కులో నీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానని రవితో చెప్పుకొచ్చాడు. అసలు నీవల్ల జెస్సీ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడని రవి రివర్స్ కౌంటరివ్వగా వాడే నాకు చెప్తూ ఉంటాడని కవరింగ్ ఇచ్చాడు షణ్ను. నీతో మాట్లాడటమే లేదు, అయినా ఇంకా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా అనడమేంటో అర్థం కావడం లేదని అయోమయానికి లోనయ్యాడు. దీన్ని తెగేదాకా లాగడం అనవసరమని భావించి అక్కడితో ఆ విషయానికి ఫుల్స్టాప్ పెట్టాడు రవి. ఇంతలో బిగ్‌బాస్ బర్గర్ అండ్ ఫ్రైడ్ చికెన్ పంపించగా దాన్ని ఆరగిస్తానంటూ జెస్సీ ముందుకు వచ్చాడు. కానీ అంతలోనే పింకీ వచ్చి ఆ ప్లేటు పట్టుకెళ్లిపోయింది. లోబో ఆకలి చూపులు అర్థమైన రవి.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఎందుకైనా మంచిది, నీ జోడీని ఓ కంట కనిపెడుతూ ఉండమని హెచ్చరించాడు. అలా హెచ్చరించాడో లేదో, అటు లోబో ఆకలిని తట్టుకోలేక చెత్త కవర్లో ఫుడ్ కోసం వెతికాడు. అతడి బాధ అర్థమైన మాస్టర్.. నీకు ఆకలైతే తినేసేయ్ అని చెప్పాడు. తర్వాతి రౌండ్లో సన్నీ బజర్ నొక్కగా, అతడు లోబో-నటరాజ్ మాస్టర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. వీరికి బిగ్‌బాస్ మునుగుతారా? తేలుతారా? అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కొన్ని వస్తువులు నీళ్లలో మునుగుతాయా? లేదా? అన్నది కరెక్ట్‌గా గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తెలివిగా ఆడిన మానస్-సన్నీ గెలుపొందారు. తర్వాత బిగ్‌బాస్ మటన్ బిర్యానీ పంపడంతో అందరూ ఆవురావురుమని ఆరగించారు. నటరాజ్ మాస్టర్, శ్రీరామ్, సన్నీ, హమీదా, సిరి, షణ్ముఖ్, మానస్ మాత్రం ముక్క కూడా ముట్టకుండా ఉపవాసం చేశారు. మొత్తంగా ఎక్కువ కిలోలు తగ్గిన మూడు జోడీల నుంచి ముగ్గురు.. సన్నీ, శ్రీరామ్, శ్వేత కెప్టెన్సీకోసం పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో శ్రీరామచంద్ర నాలుగో కెప్టెన్‌గా అవతరించాడని అంటున్నారు. మరి అందులో ఎంత నిజముందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. -
బిగ్‌బాస్: ఏంట్రా షణ్ను, ఇలాగయితే కష్టం కదరా!
ఈ మధ్య షణ్ముఖ్ నోటి నుంచి ఒకటే మాట వినిపిస్తోంది.. యాంకర్ రవి వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా అని! అలా గేమ్ ఆడు, ఇలా గేమ్ ఆడు అని ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే చెడ్డ చిరాకు అని ముఖం చిట్లించుకునే ఇతడు రవి ఏదైనా నోరు తెరిచి చెప్పబోతుంటే చాలు.. వద్దు మహాప్రభో అని మొదటే దండం పెట్టేస్తున్నాడు. తన గేమ్ తనను ఆడనివ్వాలని ముఖం మీదే చెప్పేస్తున్నాడు. ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరూ ఎవరికి సలహాలు ఇవ్వాల్సిన పని లేదని క్లాసులు పీకే అతడు ఈ మధ్య దారి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరు చెప్తే వినడం ఇష్టం లేని అతడు కెప్టెన్ జెస్సీకి మాత్రం అలా చేయాలి, ఇలా చేయాలంటూ ఆదేశాలిస్తున్నాడు. వీకెండ్లో నాగార్జున సైతం ఇదే అభిప్రాయపడ్డాడు. జెస్సీ డమ్మీ కెప్టెన్ అని, హౌస్‌లో అసలు కెప్టెన్ షణ్ముఖ్ అని అందరిముందే సెటైర్ వేశాడు. జెస్సీ నోటి వెంట నుంచి వస్తున్న ఆదేశాలన్ని షణ్ముఖ్ చెప్పినవే అని కౌంటరిచ్చాడు. ఇక్కడ ప్రేక్షకులకు అర్థం కాని విషయమేంటంటే.. ఒకరి సలహాలను ఇన్ఫ్లూయెన్స్ అని అభిప్రాయపడే షణ్ను.. జెస్సీకి సూచనలిస్తూ అతడిని ఇన్ఫ్లూయెన్స్ చేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. జెస్సీకి సొంతంగా ఆడే టాలెంట్ ఉందని, అతడికి సంబంధించిన ప్రతి విషయంలో తలదూర్చడం అనవసరమని విమర్శిస్తున్నారు. Shanmukh in the house so far Mr. Chamcha aka Mr. Influence star #BiggBossTelugu5 pic.twitter.com/WPKvPJbG24 — Æ (@TheXoXo__) September 29, 2021 I thought #Shannu is very strong contender in initial days but now a days he was very confused & disturbed. #Shannu don’t have any quality to become a winner of #biggbosstelugu5, he is just a good actor — Sanjay - PK Fan (@ForeverPKfan) September 29, 2021 #Shannu gadu influence influence ankunta, drag chestundu.. aadiki mind leda influenced kakunda aadaniki.. Mari eedu #Jessie ki chesedi influence kaada? 👎👎 #BiggBossTelugu5 — N🧘🏽♂️ (@Mister_Awesomee) September 29, 2021 Arrey #Shannu #Ravi ninu INFLUENCE cheyatum kadhra nuvu #Jessie ni INFLUENCE chesthunav Niku #Ravi last week skit nunchi nachatledhu ah mukka mohana yedavachuga ra INFLUENCE avthuna ani sodhi REASON chepthunav Ee #Shannu gadi ANALYSIS tho🤭Ne Biscuit avthadu#BiggBossTelugu5 — Rooba_Rooba (@rooba_rooba) September 29, 2021 Especially ma #jessie game spoil chesthunnadu #shannu #jessiejalebis #biggbosstelugu5 https://t.co/7aWqKd2d1a — Capri#ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@BbfanCapricorn) September 29, 2021 1. #AnchorRavi influence chesthunnadu ani okate edupu, mari influence avvakunda strong ga enduku undaledu #shannu 2. Shannu #siri and #jessie ni influence chesthe thappu ledu, ravi vaditho matladakapoyina influence aipothunnadanta#biggbosstelugu5 — Capri#ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@BbfanCapricorn) September 29, 2021 Last stage of halucination for #Shannu Ravi gadu asalu neetho ekkada vunnadu ra nuv influence avvadaniki eddi moham 🤦♂️ picchi antaru ,vallani torture chesthunnav #BiggBossTelugu5 — Sai Sunil Reddy (@SaiSunil452) September 29, 2021 Choice of words matters. #SRC clearly said don’t play mind games with me . #Shannu don’t have guts to say upfront . #Ravi ni blame chesthunnadu influence chesthunnavani. Ravi Asalu netho matladatledhu ga annadu 😂😂🤣#BiggbossTelugu5 — Preethi #ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@vpreethir) September 29, 2021 -
దయనీయం: చెత్తబుట్టలో నుంచి ఫుడ్ ఏరుకున్న లోబో
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడిపోమన్న బిగ్‌బాస్ వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్ షేక్, కొబ్బరి బోండాం నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు. దీంతో ఓవైపు ఆకలితో అలమటిస్తూనే మరోవైపు ఎలాగైనా టాస్క్‌లో గెలవాల్సిందేనని కసితో రగిలిపోతున్నారు కంటెస్టెంట్లు. కానీ ఆకలితో నకనకలాడిపోతున్న లోబో తన కడుపు మాడ్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాకయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. కాగా ఈ టాస్క్ ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఫుడ్ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్ తన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ కెప్టెన్ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటు అతని జోడీ కాజల్ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్ షాక్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్‌ను టెంప్ట్ చేసేందుకు బిగ్‌బాస్ ఫుడ్ పంపించగా ప్రియాంక సింగ్ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ ఊరిళ్లు వచ్చేలా ఆ వంటకాన్ని ఆవురావుమని ఆరగించింది. -
బిగ్‌బాస్: వరస్ట్ పర్ఫామర్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాభిప్రాయం అన్నది అంత ఈజీ కాదు. అందులోనూ బెస్ట్, వరస్ట్ పర్ఫామర్స్ను ఎంచుకోమన్నప్పుడు కంటెస్టెంట్లు ఎవరికి వారు తామే బెస్ట్ ఇచ్చామని చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమకంటే ఎక్కువగా కష్టపడినట్లు అనిపించినప్పుడు మాత్రమే ఇతరుల పేర్లను చెప్తుంటారు. ఇక వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నప్పుడు కూడా కొందరు వ్యక్తిగత విబేధాలను మనసులో పెట్టుకుని, మరికొందరు ఆటను దృష్టిలో ఉంచుకుని ఆయా పేర్లను సూచిస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎంచుకోమని ఆదేశించాడు. దీంతో మానస్.. తననే వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అలా కుదరదని కెప్టెన్ జెస్సీ చెప్పడంతో మానస్ కెప్టెన్‌నే నామినేట్ చేశాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ ఎవరి మీదో బాగా ఫైర్ అవుతున్నాడు. ఎలా ఆడాలో కూడా తెలీదంటూ చిరాకు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈవారం చెత్త ఆటగాడిగా ఇంటిసభ్యులు మానస్‌ను ఎన్నుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. దీని ప్రకారం జెస్సీ, సన్నీల తర్వాత మానస్ జైలులో బందీ అవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
మళ్లీ తప్పులో కాలేసిన బిగ్‌బాస్, కెప్టెన్‌ను లీక్ చేశాడుగా!
Bigg Boss 5 Telugu: Jessie New Captain: బిగ్‌బాస్‌లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరు కెప్టెన్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న విషయాలను తెలుసుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ లీకువీరులు అన్ని విషయాలను ముందుగానే నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇది చాలదన్నట్లు స్వయంగా బిగ్‌బాసే వీరికి పోటీగా దిగినట్లు కనిపిస్తోంది. ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారన్న విషయాన్ని ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఫస్ట్ లవ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన ప్రోమోలో మోడల్ జశ్వంత్ చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది. దీంతో జెస్సీ ఈ వారం కెప్టెన్ అయ్యాడని స్పష్టమవుతోంది. అయితే అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా లీక్ చేశాడేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎడిటర్ నిద్రపోయినట్లున్నాడు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. ఏదేమైనా జెస్సీ కెప్టెన్‌గా అవతరించి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని మరికొందరు మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by jessie (@jaswanth__jessie__) View this post on Instagram A post shared by chusara_sirrr_eedi_memesu (@chusara_sirrr_eedi_memesu) View this post on Instagram A post shared by BiggBoss 5Telugu (@telugubiggboss_season5) -
నామినేషన్స్ ఫైట్స్: జెస్సీని ఆడేసుకున్న ఆ ఇద్దరు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో నుంచి ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు మండే ఎపిసోడ్లో నామినేషన్స్ జరగనున్నాయి. ఇంకేముందీ.. నామినేషన్స్ మొదలవగాఏ కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతూ, దూషించుకోవడం మొదలు పెట్టారు. ఇక మానస్, శ్రీరామ్‌ల మధ్య రగులుకున్న అగ్ని గుండం ఇప్పుడప్పులే చల్లారేలా కనిపించడం లేదు. దీంతో మరోసారి శ్రీరామ్.. మానస్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో తన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రియ మాటలను మనసులో పెట్టుకున్నాడు సన్నీ. అందుకే మీరు అన్న మాటలను నేను తీసుకోలేకపోతున్నా అంటూ ప్రియను నామినేట్ చేశాడు. అయితే తనేం అందో? చెప్పమని అడగ్గా.. అది మీకు కూడా తెలుసు అని సన్నీ బదులిచ్చాడు. తర్వాత లహరి కూడా ప్రియను నామినేట్ చేసినట్లు కనిపించింది. దీంతో ప్రియ.. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనడంతో ఇది సేఫ్ గేమ్ కాదు, సేఫ్ గేమ్ అనుకుంటే నామినేట్ చేయడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు అని కౌంటర్ ఇచ్చింది లహరి. చదవండి: Bigg Boss Telugu 5: ఉమాదేవి అవుట్, కన్నీళ్లు ఆపుకోలేకపోయిన లోబో ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, జెస్సీల మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. ఒకరు చెప్తే నువ్వు నన్ను నామినేట్ చేశావని తెలుసు అని నటరాజ్ మాస్టర్ జెస్సీ మీద ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. నువ్వు చిన్నపిల్లోడివి, జుజూ అంటూ ఓ రేంజ్లో రియాక్ట్ అవగా దానికి అతడు కూడా అవును, నేను చిన్నపిల్లోడినే అని తిరిగి కౌంటరిచ్చాడు. స్త్రీలతో వ్యవహరించే విధానం నచ్చలేదంటూ విశ్వ.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు యాంకర్ రవి కూడా జెస్సీ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఎన్ని రోజులు చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపించి సింపథీ పొందడానికి ట్రై చేస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందంటూ జెస్సీ పరువు తీశాడు రవి. ఇక లోబో ప్రియాంకను నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. మరి వీళ్ల వాగ్వాదాలు, నామినేషన్స్ కొట్లాటలు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
మనసులో మాట బయటపెట్టిన జెస్సీ, షాకైన సిరి
సండేను ఫండేగా మార్చేందుకు కింగ్ నాగార్జున రెడీ అయిపోయాడు. బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లతో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యులకు నాగ్ సరదా టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకేముందీ... మామూలుగానే రెచ్చిపోయే కంటెస్టెంట్లు నాగ్ ఇచ్చిన టాస్క్‌లో విజృంభించినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో యాంకర్ రవి, హమీదా.. యానీ మాస్టర్, జెస్సీల గొడవను ఇమిటేట్ చేసి నవ్వించారు. షణ్ముఖ్.. ప్రియతో డ్యాన్స్ చేసి అలరించాడు. ఇక విశ్వ.. లోబోను ఎత్తుకుని తిప్పుతూ తన బలాన్ని ప్రదర్శించాడు. తానేం తక్కువ తినలేదు అన్నట్లుగా సింగర్ శ్రీరామచంద్ర.. సిరిని ఎత్తుకుని తిరిగాడు. ఎప్పుడూ సిరి జపం చేసే జెస్సీ.. ఎందుకు అంత త్వరగా ఎంగేజ్ అయ్యావని మనసులోని మాటను బయటపెట్టడంతో ఆమెకు షాక్ కొట్టినంత పనైంది. కానీ వెంటనే షాక్‌లో నుంచి తేరుకుంటూ నువ్వు వస్తావని తెలీక ఎంగేజ్ అయ్యానని చెప్పింది. అనంతరం నాగ్.. ప్రియాంక క్రష్ ఎవరు అని అడిగాడు. దీనికి సమాధానంగా మానస్‌ను కెమెరాల్లో చూపించారు. అయితే ఈ సమాధానం లోపలున్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు కూడా తెలిసిందే. ఇక తొలి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే నాగ్.. యాంకర్ రవి, హమీదాను సేఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మానస్, కాజల్, సరయూ, జెస్సీ ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఈ నలుగురిలో సరయూ ఎలిమినేట్ అయిందంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
ఎలిమినేషన్లో ట్విస్ట్! సరయూ అవుట్?
Bigg Boss Telugu 5 First Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదటి వారంలో యాంకర్ రవి, మోడల్ జెస్సీ, నటి హమీదా, యూట్యూబ్ స్టార్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ రవి ఎక్కువ ఓట్లతో మొట్టమొదటగా సేవ్ అవుతాడన్న విషయం తెలిసిందే! ఆ తర్వాత ఆర్జే కాజల్, నటుడు మానస్ సేఫ్ జోన్లో ఉన్నట్లు అనఫీషియల్ పోల్స్‌లో వెల్లడుతోంది. హమీదా, సరయూ, జెస్సీ డేంజర్ చివరి మూడుస్థానాల్లో తచ్చాడుతున్నారు. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా పవర్ యాక్సెస్ పొంది ప్రేక్షకులకు తన పవరేంటో చూపించింది. మొదట్లో తన ఏడుపుతో ఈ సీజన్‌కు పాతాళగంగలా మారుతుందేమో అనిపించినప్పటికీ తర్వాత మాత్రం గేమ్‌లో తన సత్తా చూపించి జనాలను ఆకట్టుకుంది. ఇక జెస్సీ.. ఎప్పుడేం చేయాలి? ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాని కన్ఫ్యూజన్లోనే వారం నెట్టుకొచ్చేశాడు. ఒకరిద్దరితో జరిగిన గొడవలు అతడికి మైనస్‌గా మారాయి. ఇక సరయూ.. ఆమెకు ఒకరు ఎదురొచ్చినా, ఆమె ఇంకొకరికి ఎదురెళ్లినా వారికే రిస్కు. ఆమెకు ఏదైనా తప్పనిపిస్తే అక్కడే కుండ బద్ధలు కొట్టి చెప్పేస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే కూడా అస్సలు సహించదు. అలాంటి తను కాజల్‌తో గొడవకు దిగింది. కెప్టెన్సీ టాస్కులో కాజల్ వైఖరిపై మండిపడింది. ఈ గొడవ మినహాయిస్తే సరయూను స్క్రీన్‌పై పెద్దగా చూపించింది కూడా లేదు. ఇదిలా వుంటే ఈ వారం ఎలిమినేట్ అయింది ఈ కంటెస్టెంటే అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. 7 ఆర్ట్స్ సరయూ బిగ్‌బాస్‌ను వీడబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది. జెస్సీ ఈ వారం గండం గట్టెక్కడం కష్టమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్న తరుణంలో అతడికి బదులు సరయూను ఎలిమినేట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, జెస్సీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు కొందరు లీకువీరులు. మరి డేంజర్‌జోన్‌లో ఉన్న సరయూ, జెస్సీలలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ 5: బెస్ట్, వరస్ట్ పర్ఫామర్స్ ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 06: అన్ని విషయాల్లో తలదూర్చే కాజల్ పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాదూ, కూడదని మొండికేస్తోంది. ముఖ్యంగా కిచెన్ తనవల్లకాదని చెప్తోంది. హౌస్‌లో పనులు విభజించిన సమయంలో కాజల్‌ను కిచెన్ టీమ్‌లో అడ్జస్ట్ చేయాలని చూడగా ఆమె మాత్రం వంట చేయను, గిన్నెలు కూడా శుభ్రం చేయను అని తేల్చి చెప్పేసింది. దీంతో అందరూ ఆమె మీదకు ఒంటికాలిపై లేచారు. మరోవైపు 'నువ్వు కెప్టెన్ అయ్యాకే ఈ ఫ్లవర్ నా చేతికివ్వు' అంటూ మానస్ ఇచ్చిన పువ్వును అతడికే తిరిగిచ్చేసింది ప్రియాంక సింగ్. ఒకవేళ ఈ పువ్వు వేరే ఎవరి దగ్గర చూసినా అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. దీనికి మానస్ సరేనంటూ బుద్ధిగా తలూపాడు. ఒకరిని కాదు ఇద్దరినైనా లేపుతా, మాస్టర్ రచ్చ ఇక తర్వాతి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో హౌస్మేట్స్ అందరూ అందంగా ముస్తాబయ్యారు. కానీ ఈసారి తమ ఫ్యామిలీస్‌తో లేనందుకు కొంత ఎమోషనల్ అయ్యారు. గణపతి పూజ అనంతరం బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు పాల్గొనాల్సి ఉండగా హౌస్మేట్స్ విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను సూచించారు. ఈ నిర్ణయంపై నటరాజ్ మాస్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ బలం చూడాలి కానీ కండలు కాదంటూ విశ్వను సెలక్ట్ చేయడాన్ని తప్పు పట్టాడు. తాను ఒక్కరిని కాదు, ఇద్దరినైనా లేపుతానంటూ రభస చేయగా యాంకర్ రవి ఆయనకు నచ్చజెప్పాడు. మొత్తానికి విశ్వ, శ్రీరామచంద్ర ఈ టాస్క్‌లో పాల్గొని విజయవంతంగా తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకున్నారు. రవి టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడు.. అనంతరం ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. మొదటగా రవి.. అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న లోబో బెస్ట్ పర్ఫామర్ అని, కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని పేర్కొన్నాడు. లోబో.. కిచెన్‌లో ఎలాంటి సమస్యలు తేనందుకు యానీ మాస్టర్ బెస్ట్ అని.. తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ, నోరు జారుతున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. అనంతరం జెస్సీ వంతురాగా.. సిరిని బెస్ట్, టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడంటూ రవిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేశాడు. శ్వేత వర్మ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వ బెస్ట్, పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్న ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. ప్రతి ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ఆమె బెస్ట్ పర్ఫామర్ ఉమాదేవి.. విశ్వ బెస్ట్‌గా, కాజల్ వరస్ట్‌గా ఆడుతున్నారని సింపుల్‌గా తేల్చేసింది. సిరి.. నటరాజ్ మాస్టర్ బెస్ట్, ఉమాదేవి ప్రవర్తన వల్ల కొందరు ఇబ్బందిపడుతున్నారని, అందువల్ల ఆవిడే వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. విశ్వ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ప్రియాంక సింగ్ బెస్ట్ అని చెప్పడంతో పింకీ ఎమోషనల్ అయింది. ఇక పనులు రావని చెప్పి తప్పించుకునే కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా సూచించాడు. లహరి.. విశ్వ బెస్ట్ పర్ఫామర్ అని, కెప్టెన్ అయింది సిరి కానీ, అలా వ్యవహరిస్తుంది మాత్రం కాజల్ అంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకొచ్చింది. నీతో మాట్లాడటమే వేస్ట్..: ఉమాదేవి తన జీవితం ముళ్ల పాన్పు అంటూ మొదలెట్టిన ప్రియాంక సింగ్ 14 ఏళ్లకే ఇంటి బాధ్యతలు తీసుకున్నానంది. గత కొన్నేళ్లుగా నవ్వడమే మర్చిపోయిన తనను మనసారా నవ్వించిన లోబో బెస్ట్ పర్ఫామర్ అంది. ఇక పెద్దావిడగా మంచీ చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని పేర్కొంది. ఆమె ప్రవర్తన రూడ్ అని చెప్తూ ఉమాదేవిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. అయితే ఆమె మాటలతో ఏకీభవించని ఉమా.. నీతో మాట్లాడటమే వేస్ట్ అంది. ఈ మాటతో ఆవేశపడ్డ పింకీ.. మీలా మనుషులను చీప్‌గా తీసిపడేయలేను అని ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే రాజుకుంది. ఒకరి మీదకు ఒకరు దూసుకు వెళ్లడమే కాక పింకీ షటప్ అంటూ ఆమెకు వేలు చూపించడంతో ఉమాదేవి కాళికావతారం ఎత్తింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న పింకీ తాను కోపంలో షటప్ అనేశానని ఉమాకు సారీ చెప్పి ఏడ్చేసింది. ఆమెను ఎగతాళి చేస్తూనే ఉన్నారు: సరయూ ఇక ఉమాదేవిని ఎవరో ఒకరు ఎగతాళి చేస్తూనే ఉన్నారని సరయూ తెగ ఫీలై ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత యానీ మాస్టర్.. పింకీ బెస్ట్, జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. సరయూ.. లోబోను బెస్ట్ పర్ఫామర్‌గా సూచించింది. 'జెస్సీ చిన్నపిల్లాడు కాదు, అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ పనీ చేయడు. ఓన్లీ టాయిలెట్‌కు వెళ్లడమే నువ్వు చేసే పనా?' అని ప్రశ్నిస్తూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా సూచించింది. వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీ.. జైల్లో బందీ 19 మంది కంటెస్టెంట్లు వారి అభిప్రాయాలు తెలిపిన అనంతరం.. ఎక్కువ ఓట్లతో విశ్వ బెస్ట్ పర్ఫామర్‌గా, జెస్సీని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. బిగ్‌బాస్ ఆదేశం మేరకు వరస్ట్ పర్ఫామర్ అయిన జెస్సీని జైల్లో బందీ చేశారు. తనకు పట్టిన దుస్థితికి అతడు లోలోపలే కుమిలిపోయాడు. అతడి బాధ అర్థమైన హౌస్మేట్స్.. అందరం నీ వెనకాలే ఉంటామంటూ ఓదార్చారు. చూస్తుండగానే తొలి వారాంతం వచ్చేసింది.. రేపటి ఎపిసోడ్లో నాగ్ ఎవరెవరిని సేవ్ చేస్తాడో చూడాలి! -
నా కొడుకు చాలా డిస్టర్బ్ అయ్యాడు: జెస్సీ తల్లి భావోద్వేగం
బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న మోడల్ జెస్సీ ఎవరో చాలామందికి తెలియదు. మోడలింగ్ రంగంలో పలు అవార్డులు అందుకున్న ఇతడు 'ఎంత మంచివాడవురా' అనే సినిమాలోనూ నటించాడు. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు జెస్సీ. కొన్నిసార్లు అతడి అమాయకత్వాన్ని ఇతర కంటెస్టెంట్లు ఆడేసుకుంటుంటే మరికొన్నిసార్లు అనవసరంగా ఆవేశపడి చెడ్డపేరు తెచ్చుకుంటున్నాడు. ఈ వారం అతడు నామినేషన్లో ఉన్నాడు. ఇదిలా వుంటే తాజాగా జెస్సీ తల్లి సునీత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జెస్సీ అన్నింట్లో యాక్టివ్‌గా ఉంటాడు. కాకపోతే బిగ్‌బాస్ షోకి వచ్చిన మొదటి వారమే నామినేషన్లోకి రావడంతో అతడు మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నాడు. పైగా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉండటంతో డౌట్ పడుతున్నాడు. తను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. చదువుకుంటున్న సమయంలోనే అతడి తండ్రికి పక్షవాతం వచ్చింది. ఒక్కో అవయవం పడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయి చివరకు చనిపోయాడు. అది అతడిని బాగా కుంగదీసింది. ఇప్పుడు బిగ్‌బాస్ తనకు కొత్త జీవితాన్ని ఇస్తుందని వచ్చాడు. అతడికి మీ సపోర్ట్ కావాలి.. జశ్వంత్ కచ్చితంగా టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నా' అని ఎమోషనల్ అయింది. -
తన గొయ్యి తనే తవ్వుకుంటున్న జెస్సీ, కాపాడటం కష్టమే!
ఆవేశం ఉండాలి, దానితోపాటు ఆలోచన కూడా ఉండాలి. కోపం ఉండాలి, దాని వెనకాల సరైన కారణం కూడా ఉండాలి. కానీ అవేమీ లేకుండా ఊరికే బీపీ తెచ్చుకుంటే ఆరోగ్యానికే కాదు కెరీర్‌కు కూడా ప్రమాదకరమే! ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఆవేశం స్టార్లు ఎక్కువయ్యారు. కొందరు ఉన్న కారణాన్ని సాకుగా చూపుతూ గొడవకు దిగుతుంటే మరికొందరు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా ఆవేశపడుతూ అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే హౌస్‌లో ఉమాదేవి ఉగ్రరూపంతో అందరినీ వణికిస్తుండగా, మరోపక్క లహరి.. లేడీ అర్జున్‌రెడ్డిలా అందరి మీదా విరుచుకుపడుతోంది. అయితే ఈ వారం వీరిద్దరూ నామినేషన్లో లేరు కాబట్టి ప్రస్తుతానికి వీరిద్దరినీ పక్కన పెడదాం. ఇక అనవసరంగా ఆవేశపడుతూ ఆదిలోనే అప్రతిష్ట మూటగట్టుకున్న కంటెస్టెంట్ ఒకరున్నారు.. అతడే మోడల్ జెస్సీ. ఇతడు అమాయకుడు అని అంతా అనుకున్నారు. కానీ లేనిపోని తగాదాలు పెట్టుకుంటూ తనేమీ తక్కువ కాదని నిరూపించాడు. హమీదా మీద జెస్సీ జోక్ చేయడమే అతడిని నామినేషన్ దాకా తీసుకొచ్చింది. అయితే వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని ఇతర కంటెస్టెంట్లు నామినేషన్లో ప్రస్తావించారు. ఆ సమయంలో జెస్సీ సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించడం కొంత మైనస్‌గా మారింది. పైగా అతడే హైపర్ అయిపోయి మళ్లీ అతడే ఏడ్చేయడం గమనార్హం. ఇక ఎప్పుడూ సిరి జపం చేసే అతడు ఆమెతో తప్ప మిగతావాళ్లతో పెద్దగా కలవట్లేదు. అంతేకాకుండా గేమ్‌లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. యానీ మాస్టర్‌తో కుర్చీ వివాదం కూడా అతడికి మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. తాను కూర్చోవడానికి చోటివ్వమని మాస్టర్ అభ్యర్థించినా జెస్సీ ఆమె మాటను బేఖాతరు చేస్తూ ఆ కుర్చీలో దర్జాగా కాలు పెట్టి కూర్చోవడం అతడి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే తను చేసింది తప్పని తెలుసుకున్న జెస్సీ అర్ధరాత్రి యానీ మాస్టర్ కాళ్లు పట్టుకుని మరీ సారీ చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన జెస్సీ మొదట ఆవేశపడి ఆ తర్వాత బాధపడుతుంటాడు. ఇదే అతడికి పెద్ద మైనస్ అవుతోంది. ఇదిలా వుంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న ప్రశ్నకు ఎక్కువమంది నెటిజన్లు జెస్సీ అనే బదులిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో హమీదా ఉంది. మరి ఈసారి సోషల్ మీడియా లెక్కలే నిజమవుతాయా? లేదంటే నాగార్జున తొలివారం ఎలిమినేషన్‌ను ఎత్తేస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్: అతడికేమైంది? జైలుకి వెళ్లడం ఖాయమేనా?
పండగ వచ్చిందంటే చాలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈవెంట్స్ అంటూ నానా రచ్చ చేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేని సెలబ్రిటీలందరినీ తీసుకువచ్చి బిగ్‌బాస్ హౌస్‌లో వేశారు. 19 మంది కంటెస్టెంట్లతో కళకళలాడిపోతున్న బిగ్‌బాస్ ఐదో సీజన్లో నేడు(శుక్రవారం) వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే అయినవాళ్లు పక్కన లేకపోవడంతో కొందరు కంటెస్టెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వెంటనే వారి బాధను దిగమింగుకుని టాస్కులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. బిగ్‌బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో శ్రీరామచంద్ర.. విశ్వ పాల్గొన్నారు. వీరిని మిగతా హౌస్మేట్స్ ఎంకరేజ్ చేశారు. కానీ జెస్సీ మాత్రం ఏదో కోల్పోయినట్లు బాధలో ఉన్నాడు. ముఖంలో ఎక్కడా సంతోషం అనేదే కనిపించలేదు. అందరిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఫీలవుతున్నట్లు కనిపించాడు. ప్రోమో చూసిన నెటిజన్లు జెస్సీ అంత డల్ అవడానికి కారణమేంటని చర్చిస్తున్నారు. మళ్లీ ఎవరితోనైనా కయ్యం పెట్టుకున్నాడా? లేదా ఎలిమినేట్ అవుతానని భయం పట్టుకుందా? అని చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే జెస్సీ నేడు జైలుకు వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. దీంతో జెస్సీ జైలుకు వెళ్లేంత నేరం ఏం చేసుంటాడా? అని ఆలోచిస్తున్నారు జనాలు. అయితే పండగ రోజే జెస్సీని జైలుకు పంపడమేంటని? ఇది నిజమయ్యే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు మరికొందరు. మరి జెస్సీ నిజంగానే జైలుకు వెళ్లాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా షురూ అయింది. ఇలా పరిచయాలు అయ్యాయో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. షో ఆరంభంలోనే ఈ రేంజ్లో గొడవలు ఉంటే రానురానూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో అంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. మరి నేటి(మంగళవారం) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మానస్‌ను అన్నయ్య అని పిలవలేను మగవాళ్లు జిమ్ములో కూర్చుంటున్నారు తప్ప ఏ పనీ చేయట్లేదని ఉమాదేవి చిరాకుపడింది. ఇంట్లో ఉన్న అందరూ పని చేయాల్సిందేని అభిప్రాయపడింది. మరోపక్క లహరితో దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కాజల్. కానీ అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కుదరదు అని లహరి అనడంతో ఊరకుండిపోయింది. ఇక రవి, విశ్వను అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంక సింగ్.. మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్తూ తెగ సిగ్గుపడింది. దీంతో అందరూ మానస్‌ను లవర్ బాయ్ అంటూ ఆటపట్టించారు. ఈ సీజన్లో కొత్తగా పవర్ రూమ్‌ను పరిచయం చేశాడు బిగ్‌బాస్. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించిన సభ్యులకు పవర్ యాక్సెస్ దొరుకుతుందని, తద్వారా వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ 'శక్తి చూపరా డింభకా!'ను ప్రవేశపెట్టాడు. ఒంటి మీదున్న దుస్తులను పంపించేసిన రవి, ప్రియ ఈ టాస్క్‌లో ఉరుముల శబ్ధం వినిపించగానే పవర్ స్కాన్‌పై ఎవరు మొదట చేయి పెడతారో వారికి ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఈ టాస్క్‌లో మొదట గెలిచిన విశ్వ పవర్ రూమ్‌లో అడుగు పెట్టాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం విశ్వ.. ప్రియ, రవి పేర్లను సూచించాడు. దీంతో ఆ ఇద్దరూ తమ సామానంతా పంపించేసి.. ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు. నాలో తమ్ముడిని చూసుకో.. లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్క్‌కు ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో రవి.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ అతడిని హత్తుకుని ఓదార్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో తర్వాత మానస్ గెలుపొంది పవర్‌ను సాధించాడు. అతడు ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్ మోగుతుందని చెప్పాడు. ఈ టాస్క్‌కు మానస్.. ఆర్జే కాజల్ పేరును ఎంచుకున్నాడు. గొడవపడ్డట్లు డ్రామా.. చివర్లో అంతా ఉట్టిదే ఇంతలో లోబో.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అను, మోతెబరిలా మాట్లాడకు అని సిరిని నిందించాడు. ముఖం అద్దంలో చూసుకో, హైట్ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్ అంటూ నానామాటలు అన్నాడు. ఇవన్నీ చెవిన పడటంతో ఆవేశంతో అట్టుడికిపోయిన సిరి ఫేస్ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది. వీళ్లిద్దరికీ సడన్‌గా ఏమైంది? ఇంత గొడవపడుతున్నారు? అని కంటెస్టెంట్లంతా టెన్షన్ పడుతుండగా ఇదంతా వుట్టి డ్రామా అని ఇద్దరూ పెద్దగా నవ్వేసి అందరినీ పిచ్చోళ్లను చేశారు. హైడ్రామా చేస్తున్నావంటూ కాజల్‌కు చురకలు కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ ఇక రాత్రి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. ఆమె కుదరదనడంతో సిరిని తన స్థానంలో కూర్చోమన్నాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్ తన బెడ్ దగ్గరకు వెళ్లి ఏడ్చేయడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్లో ఇంత రభస ఉంటే మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి! -
యానీ మాస్టర్ అంటే రెస్పెక్ట్ అంటూనే జెస్సీ కొట్లాట
Bigg Boss Telugu 5 Latest Promo: బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొదటి రోజు నుంచే ఓ రేంజ్లో గొడవలు జరుగుతున్నాయి. చాలామంది కంటెస్టెంట్లు ఇక్కడ బంధాల ఎమోషన్స్‌లో చిక్కుకోవద్దని ముందుగానే బలంగా నిర్ణయించుకుని వచ్చారు. ఎవరు ఎదురు మాట్లాడినా ఇచ్చిపడేయాలని ఫిక్సయ్యారు. అందుకే చిన్నపాటి విషయాలను కూడా రచ్చకీడుస్తూ కొట్లాటకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా కొనసాగిన విషయం తెలిసిందే! మొత్తానికి ఈ వారం రవి, సరయూ, కాజల్, మానస్, హమీదా జెస్సీ ఎలిమినేషన్ గండంలో ఉన్నారు. ఇదిలా వుంటే నేటి ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో జెస్సీ మరోసారి తగాదా పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకుని కూర్చోగా అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ కుర్చీలో నుంచి కాలు తీసేయమంటే అందుకతను ఒప్పుకోనట్లున్నాడు. దీంతో శివాలెత్తిన యానీ మాస్టర్ నీది నీ దగ్గర పెట్టుకో, నాటకాలు చేయకు అని తిట్టిపోసింది. నీ వాయిస్ లేస్తే నా గొంతు లేవదా? అని నిందిస్తుండగా జెస్సీ దానికి రియాక్షన్‌గా చప్పట్లు కొట్టాడు. అయితే అక్కడికి సిరి వస్తే మాత్రం కుర్చీపై నుంచి కాలు చటుక్కున తీసేయడం గమనార్హం. నామినేషన్ ప్రక్రియలో యానీ మాస్టర్ అంటే రెస్పెక్ట్ అని, అందుకే నామినేట్ చేయడం లేదన్న జెస్సీ ఇప్పుడు మాత్రం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. జెస్సీ అమాయకుడనుకుంటే ఇంత వైల్డ్‌గా ఉన్నాడేంటి? జెస్సీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రోమో అర్జున్‌రెడ్డి రేంజ్లో ఉన్నా ఎపిసోడ్ గీతా గోవిందంలా సాగుతుందంటూ సెటైర్ వేస్తున్నారు. -
బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!
Bigg Boss 5 Telugu 1st Week Nominations: బిగ్‌బాస్ ఐదో సీజన్లో తొలి రోజే కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చేశాడు లోబో. తన గురకతో హౌస్మేట్స్ అందరినీ నిద్రకు దూరం చేశాడు. అతడి గురకను ఆపడానికి రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు అదే రాత్రి తమకు బోర్ కొడుతోందంటూ దొంగతనానికి పూనుకున్నారు సిరి హన్మంత్, జెస్సీ. కంటెస్టెంట్ల వస్తువులను దాచేసి తర్వాత నిమ్మకు నీరెత్తనట్లు ఊరకుండిపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ ఆరుగు ఎవరు? తొలి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి. దొంగతనం చేశామని ఒప్పుకున్న సిరి ఇక తర్వాతి రోజును ఉరకలెత్తించే డ్యాన్స్‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ పోయాయని ఒకరు, చెప్పులు పోయాయని మరొకరు గోల పెట్టినా అసలు దొంగలు మాత్రం చీమ కుట్టనట్లు ఉండిపోయారు. అయితే యాంకర్ రవి మాత్రం జెస్సీనే దొంగ అని ముందుగానే పసిగట్టడంతో సిరి తామే దొంగలమని ఒప్పుకోక తప్పుకోలేదు. మూడున్నరేళ్ల నుంచి మోసం చేస్తున్నా.. ఇక ప్రియాంక సింగ్ తాను అతడు నుంచి అమ్మాయిగా మారేందుకు చేసుకున్న ఆపరేషన్ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడింది. ఈ విషయంలో మూడున్నరేళ్ల నుంచి మా నాన్నను మోసం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయింది. ఒకసారి తను నన్ను ముట్టుకుని గడ్డాలు, మీసాలు ఏవని అడిగితే లేడీ గెటప్ కోసం తీసేయించుకున్నానని అబద్ధం చెప్పానంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది కాజల్. చెత్తకుండీలో కంటెస్టెంట్ల ఫొటోలు అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేయాలి. ముందుగా సింగర్ శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్, యాంకర్ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్, జెస్సీలను నామినేట్ చేశారు. చదవండి: Bigg Boss 5 Telugu: నాగ్ పారితోషికం ఎంతో తెలుసా? యాంకర్ రవికి కౌంటరిచ్చిన నటరాజ్ మాస్టర్ ఇక బిహేవియర్ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్ చేసింది యానీ మాస్టర్. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని నటరాజ్ మాస్టర్‌ను, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్ చేశాడు రవి. అయితే తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్ చేశాడు నటరాజ్ మాస్టర్. అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్ చేశాడు. ఫస్ట్ వీక్‌లోనే అందరూ నామినేట్ చేస్తుండటం, అందులోనూ వాళ్లు చెప్పే కారణాలను జీర్ణించుకోలేకపోయిన జెస్సీ అందరిముందే ఏడ్చేశాడు. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశాడని రవిని నామినేట్ చేసిన లోబో రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్ చేశాడని జెస్సీని నామినేట్ చేసింది హమీదా. తనకు టాస్క్‌లు ఆడమని చెప్పడం నచ్చలేదని సన్నీని, ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్ చేశాడు షణ్ముఖ్. యాటిట్యూడ్ చూపించిందని ప్రియను, యాపిల్ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్ చూపించాడని రవిని నామినేట్ చేశాడు లోబో. మొదటి వారం నామినేట్ అయిన ఆరుగురు మానస్.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్, లహరిని; ప్రియాంక సింగ్.. షణ్ముఖ్, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్.. విశ్వ, సరయూలను; కాజల్.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మొదటివారం నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్ గండం గట్టెక్కేది ఎవరనేది చూడాలి! -
బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?!
బోర్డమ్ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ఆడియన్స్‌కు మాటిచ్చేశాడు నాగ్. అన్నట్లుగా ఎక్కువ వినోదాన్ని అందించాలంటే అంతే ఎక్కువ కంటెస్టెంట్లు ఉండాలనుకున్నారో ఏమోగానీ ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపారు. వీరిలో నటి సిరి హన్మంత్, వీజే సన్నీ, నటి లహరి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, ప్రముఖ నటి ప్రియ, మోడల్ జశ్వంత్ పడాల(జెస్సీ), ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జశ్వంత్, నటి హమీదా, నటరాజ్ మాస్టర్, నటి ఉమాదేవి, విశ్వ, 7ఆర్ట్స్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేత వర్మ, యాంకర్ రవి ఉన్నారు. నేడు హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈవారం నామినేషన్లో ఉండేది వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. యాంకర్ రవి, జెస్సీ, మానస్, హమీదా, కాజల్, సరయూ తొలివారం నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రియ కూడా ఈ లిస్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో మొట్టమొదట సేవ్ అయ్యే కంటెస్టెంట్ యాంకర్ రవి అని ఊహించవచ్చు. యాంకర్ రవికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అతడు ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కుతాడు. మరి మిగతా ఆరుగురిలో ఎవరు సేవ్ అవుతారు? ఈ లిస్టులో ఏమైనా మార్పుచేర్పులు ఉన్నాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
హౌస్‌మేట్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న లోబో
కనివినీ ఎరుగని రీతిలో 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలైంది. హౌస్‌లో అడుగుపెట్టగానే పరిచయాలు పెంచుకుని ఇంటిని అలవాటు చేసుకునే పనిలో పడ్డారు హౌస్మేట్స్. కొత్త ప్రదేశం కాబట్టి తొలిరోజే కొందరికి నిద్ర పట్టడం కూడా కష్టమే. అలాంటిది రాత్రిపూట ఎవరైనా గురక పెడితే ఇంకేమైనా ఉందా? బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితే ఎదురైంది. యాంకర్ లోబో అర్ధరాత్రి ఆదమరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతడి గురక సౌండ్‌కు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు హౌస్మేట్స్. యాంకర్ రవి అయితే అతడికి దుప్పటి కప్పి, బయటకు పెద్దగా సౌండ్ వినిపించకుండా రెండు దిండ్లను కూడా లోబో ముఖం మీద పెట్టి ఉంచాడు. అయినా సరే లోబో గురకను ఆపడం ఎవరి తరమూ కాలేదు. దీంతో రాత్రంతా వారికి జాగారమే అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు సిరి హన్మంత్, జెస్సీ ఏదో దొంగతనం ప్లాన్ చేసినట్లున్నారు. వీరిద్దరూ కలిసి ఒకరి చెప్పులు, మరొకరి ఇయర్ రింగ్స్‌ను దాచేసినట్లు తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చోరీకి పాల్పడిన ఈ దొంగలను ఇతర కంటెస్టెంట్లు పట్టుకోగలరా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారనుంది. -
బిగ్‌బాస్ 5: నామినేషన్ లొల్లి, ఏడ్చేసిన జెస్సీ
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ హౌస్ కళకళలాడిపోతోంది. వీళ్లు హౌస్‌లోకి అడుగుపెట్టారో లేదో అప్పుడే ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక ప్రోమో కూడా రిలీజైంది. ఇందులో కంటెస్టెంట్లు అందరూ తాము నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫేస్ ఉన్న బ్యాగును చెత్తడబ్బాలో వేస్తున్నారు. కొందరు దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటుంటే మరికొందరు మాత్రం ఎదురుతిరుగుతున్నారు. ఈ క్రమంలో లోబో రవిని నామినేట్ చేస్తూ నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అని కాస్త స్ట్రాంగ్‌గానే వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు రవి తనవంతు రాగానే నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే స్ట్రిక్ట్‌గా అనిపిస్తోందని రవి చెప్పగా... తనకు నటించడం రాదని కౌంటరిచ్చాడు మాస్టర్. ఇక విశ్వ, జెస్సీల మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ అమాయకత్వం ఉంటే తొక్కేస్తారు అంటూ జెస్సీని నామినేట్ చేశాడు. దీంతో జెస్సీ కంటతడి పెట్టుకున్నాడు. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!