
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో కొట్లాటలకు కొదువ లేకుండా పోయింది. ఫన్ కన్నా ఫ్రస్టేషన్, ఫైటింగ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని పక్కనపెట్టి కంటెస్టెంట్లతో ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. తాజాగా వారి జీవితంలోని జ్ఞాపకాలను పంచుకోమని ఆదేశించినట్లు తెలుస్తోంది.
తాజా ప్రోమోలో.. సన్నీ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ముగ్గురు అబ్బాయిలను ఒక మహిళ కష్టపడి పెంచడమనేది ఎంత ఛాలెంజింగో నాకు తెలుసు అంటూ తన స్టోరీ చెప్తున్నాడు. ఇక జెస్సీ వంతు రాగా.. 'నాకు గొంతు సమస్య ఉంది. దానివల్ల వాయిస్ సరిగా రాదు. అది నాకు పుట్టుకతోనే ఉంది. కానీ నేను గిన్నిస్‌బుక్ ఎక్కాను, ఫ్యాషన్ ఐకాన్ అయ్యాను, జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే మా అమ్మ ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని బయటకు చెప్పుకోదు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లి ఏమన్నా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి అని అందరూ అన్నారంటూ ఎమోషనల్ అయింది సిరి. హౌస్‌మేట్స్ చెప్పే జ్ఞాపకాలను వినాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment