Bigg Boss 5 Telugu Jessie Leaves BB House, Check Here For Reason - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఈవారం జెస్సీ అవుట్‌.. ఎలిమినేషన్‌లో ట్విస్ట్‌ అదే!

Published Tue, Nov 9 2021 1:00 PM | Last Updated on Tue, Nov 9 2021 4:36 PM

Bigg Boss 5 Telugu Jessie Leaves BB House, Reason In Telugu - Sakshi

Bigg Boss 5 Telugu: Jaswanth Out From BB5 House for Health Issues: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి(సోమవారం)ఎపిసోడ్‌లో సైతం జెస్సీ అస్వస్థతకు గురవగా, అతన్ని సీక్రెట్‌ రూంలో ఉంచి చికిత్స అందించారు.


అయితే అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడం సహా సమస్య పెద్దది కావడంతో బిగ్‌బాస్‌ జెస్సీని హౌస్‌ నుంచి బయటకు పంపించాడు. ఈ ఊహించని పరిణామంతో హౌస్‌మేట్స్‌ షాక్‌కి గురయ్యారు. ముఖ్యంగా జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్‌ సిరి, షణ్నుక్‌ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా కాసేపటి క్రితమే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

గతంలో సంపూర్ణేష్ బాబు, త‌ర్వాత గంగ‌వ్వ‌, నోయ‌ల్ ఇలా గేమ్ మ‌ధ్య నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వారే.మరోవైపు జెస్సీ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చు అని టాక్‌ వినిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement