
అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపించి తిరిగి హౌస్‌కు పంపిద్దామనుకున్నారు. అయితే అతడి ఆరోగ్యం మెరుగవకపోవడంతో ఈ వారం జెస్సీని ఇంటికి పంపించివేస్తున్నారట!
Bigg Boss 5 Telugu, 10th Week Elimination: బిగ్‌బాస్ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్ట్రాటజీకి మారుపేరైన కాజల్ తక్కువ ఓట్లతో పోలింగ్‌లో వెనకబడటంతో అందరూ ఆమె వెళ్లిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే జెస్సీని అనారోగ్యం వేధించడంతో వారం మధ్యలోనే హౌస్ నుంచి నిష్క్రమించాడు. కానీ ఎలిమినేట్ అవలేదు. అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపించి తిరిగి హౌస్‌కు పంపిద్దామనుకున్నారు.
అయితే అతడి ఆరోగ్యం మెరుగవకపోవడంతో ఈ వారం జెస్సీని ఇంటికి పంపించివేస్తున్నారట! దీంతో జెస్సీ తిరిగి వస్తాడేమోనన్న సిరి, షణ్ముఖ్‌ల ఆశ అడియాశలైనట్లు కనిపిస్తోంది. ఇక జెస్సీ ఎలిమినేషన్‌తో కాజల్ ఎలిమినేషన్ గండం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు.