సీక్రెట్‌ రూమ్‌కు జెస్సీ, రగిలిపోయిన షణ్ముఖ్‌! | Bigg Boss Telugu 5: Jessie Went To Secret Room | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: సీక్రెట్‌ రూమ్‌కు జెస్సీ, మానస్‌కు ప్రియాంక ముద్దులు!

Published Tue, Nov 9 2021 11:52 PM | Last Updated on Tue, Nov 9 2021 11:54 PM

Bigg Boss Telugu 5: Jessie Went To Secret Room - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 66: జెస్సీని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. నీకు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమని, ఇందుకోసం బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నాడు. దీంతో జెస్సీ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ 'బిగ్‌బాస్‌ నా లైఫ్‌ అనుకున్నా, ఇంతవరకు వచ్చినందుకు హ్యాపీ' అంటూనే అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు.

జెస్సీ తిరిగొస్తాడు కదూ*
జెస్సీ ఉన్నఫళంగా హౌస్‌ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్‌, సిరి గుక్కపెట్టి ఏడ్చారు. సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్‌, పింకీ, కాజల్‌, యానీ.. అందరూ పాంపరింగ్‌ చేశారంటూ బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్‌ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్‌ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి.. జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది.

మానస్‌ కోసమే వచ్చావా?: పింకీపై కాజల్‌ ఫైర్‌
మరోపక్క నామినేషన్స్‌ ఎఫెక్ట్‌తో ప్రియాంక సింగ్‌ మీద అలక బూనాడు మానస్‌. ఆమె దగ్గరవ్వాలని ప్రయత్నించేకొద్దీ అతడు తప్పించుకు తిరిగాడు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్‌ మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో పింకీ.. మానస్‌ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్‌.. నువ్వు తనకోసం వచ్చావా? అని ఫైర్‌ అయింది. మనం గేమ్‌ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్‌ చెయ్‌, లేదంటే వదిలెయ్‌ అని సలహా ఇచ్చింది.

(చదవండి: చివరి క్షణంలో బిగ్‌బాస్‌ ట్విస్ట్‌.. నామినేషన్స్‌లో ఐదుగురు)

మాట్లాడే అధికారమే కోల్పోయావు: సన్నీ
పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ కాజల్‌ బాధను దిగమింగుతోంది. నామినేషన్స్‌లో తన ఫ్రెండ్స్‌ సన్నీ, మానస్‌లను సేవ్‌ చేయనందుకు వారు మాట్లాడకపోవడంతో ఎంతగానో బాధపడింది. ఎలాగో ఈవారం ఎలిమినేట్‌ అవుతానని అటు కాజల్‌, ఇటు మానస్‌ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్‌ వెళ్లిపోతాడంటే తట్టుకోలేకపోయిన పింకీ.. అలా అనొద్దని వేడుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు. ఇక కాజల్‌ నామినేషన్స్‌ సమయంలో వారిని సేవ్‌ చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్‌ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది.

సీక్రెట్‌ రూమ్‌లో జెస్సీ, క్వారంటైన్‌ అయ్యాక హౌస్‌కు!
ఇదిలా వుంటే జెస్సీని బయటకు పంపకుండా సీక్రెట్‌ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్‌. శ్రీరామ్‌.. కాజల్‌ బాగా ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోపక్క మానస్‌.. పింకీ ఇచ్చిన వస్తువులను తిరిగిచ్చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రవి కోసం బంటులా పని చేస్తే మాత్రం పింకీని అస్సలు నమ్మనని తెగేసి చెప్పాడు. తాను, జెస్సీ, షణ్ను ముగ్గురం కంటెండర్‌ అవగానే కెప్టెన్‌ అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్‌ అవగానే నామినేట్‌ అవుతున్నానని రవి అనగా.. ఎలిమినేట్‌ మాత్రం అవడం లేదు, అదే నా బాధ అని మనసులో మాట బయటపెట్టాడు షణ్ను.

నా మీదే జోకులా, నేనేంటో చూపిస్తా!
తర్వాత సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను. ఎవడన్నా జోకేస్తే చెప్పు తీసి కొట్టేవాడినని చిరాకుపడ్డాడు. క్లోజ్‌ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్‌ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ను ఇమిటేట్‌ చేయడంతో బాగా హర్టయ్యాడు. ఇలాంటి వెకిలి జోకులను తాను తీసుకోలేనని ముఖం మీదే చెప్పాడు. పింకీ నన్ను గెలికింది, ఇక ఎలా ఉంటుందో చూడని సిరితో చెప్పుకొచ్చాడు. ఇలా చనువు తీసుకుని అతి చేస్తారనే మనుషుల్ని దూరం పెడతానని పేర్కొన్నాడు.

(చదవండి: ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్‌)

ముద్ద వద్దు, ముద్దులే కావాలన్న మానస్‌
సన్నీ, మానస్‌ల పోరుతో ఆలోచనలో పడ్డ కాజల్‌.. షణ్నును సేవ్‌ చేయకుండా నన్నెందుకు సేవ్‌ చేశావని శ్రీరామ్‌ను అడిగింది. దీంతో అతడు మనిద్దరి మధ్య గొడవకు ముగింపు పలకడానికే చేశానని బదులిచ్చాడు. ఎట్టకేలకు మానస్‌ కోపాన్ని కరిగించేసింది ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్‌ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్‌ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement