
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్న మోడల్ జెస్సీ ఎవరో చాలామందికి తెలియదు. మోడలింగ్ రంగంలో పలు అవార్డులు అందుకున్న ఇతడు 'ఎంత మంచివాడవురా' అనే సినిమాలోనూ నటించాడు. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు జెస్సీ. కొన్నిసార్లు అతడి అమాయకత్వాన్ని ఇతర కంటెస్టెంట్లు ఆడేసుకుంటుంటే మరికొన్నిసార్లు అనవసరంగా ఆవేశపడి చెడ్డపేరు తెచ్చుకుంటున్నాడు. ఈ వారం అతడు నామినేషన్‌లో ఉన్నాడు.
ఇదిలా వుంటే తాజాగా జెస్సీ తల్లి సునీత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జెస్సీ అన్నింట్లో యాక్టివ్‌గా ఉంటాడు. కాకపోతే బిగ్‌బాస్ షోకి వచ్చిన మొదటి వారమే నామినేషన్‌లోకి రావడంతో అతడు మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నాడు. పైగా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉండటంతో డౌట్ పడుతున్నాడు. తను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. చదువుకుంటున్న సమయంలోనే అతడి తండ్రికి పక్షవాతం వచ్చింది. ఒక్కో అవయవం పడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయి చివరకు చనిపోయాడు. అది అతడిని బాగా కుంగదీసింది. ఇప్పుడు బిగ్‌బాస్ తనకు కొత్త జీవితాన్ని ఇస్తుందని వచ్చాడు. అతడికి మీ సపోర్ట్ కావాలి.. జశ్వంత్ కచ్చితంగా టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నా' అని ఎమోషనల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment