Bigboss 5 Telugu Fame Jaswanth First Movie Poster ERROR 500 Out Now- Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: జెస్సీ ఫస్ట్‌ మూవీ పోస్టర్‌ వచ్చేసింది..

Published Sat, Dec 25 2021 3:32 PM | Last Updated on Sat, Dec 25 2021 8:32 PM

Bigboss 5 Telugu Fame Jaswanth First Movie Poster ERROR 500 Out Now - Sakshi

Bigg Boss 5 Telugu Contestant Model Jaswanth Padala First Movie: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో అడుగుపెట్టిన ఏకైక మోడల్‌ జశ్వంత్‌ పడాల. వర్టిగో వ్యాధితో బాధపడుతున్న అతడు పదవ వారంలో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. తన ఆరోగ్యం బాగుండుంటే మరిన్ని వారాలు హౌస్‌లోనే కొనసాగేవాడు. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అతడికి సినిమా ఆఫర్‌ కూడా వచ్చింది. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే స్టేజీ మీదే చెప్పాడు జెస్సీ. తాజాగా తన సినిమా టైటిల్‌ పోస్టర్‌ను వదిలాడు. 

ఎర్రర్‌ 500 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జెస్సీ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. పోస్టర్‌లో నెత్తుటి గాయాలతో చేతిలో గన్‌ పట్టుకుని యాక్షన్‌ హీరోగా కనిపిస్తున్నాడు. సందీప్‌ మైత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మైత్రి మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement