Bigg Boss 5 Telugu: Jessie Gets Movie Offer - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన మోడల్‌ జెస్సీ..

Published Mon, Dec 20 2021 4:26 PM | Last Updated on Mon, Dec 20 2021 4:43 PM

Bigg Boss 5 Telugu: Jessie Gets Movie Offer - Sakshi

Bigg Boss 5 Telugu: Jessie Gets Movie Offer: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్‌ జెస్సీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పాడు. బిగ్‌బాస్‌తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన జెస్సీ ఇప్పుడు వెండితెరపై కూడా సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన ఫస్ట్‌ మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.

సందీప్‌ మైత్రేయ దర్శకత్వంలో తాను డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. మైత్రేయ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఫస్ట్‌లుక్‌ సైతం త్వరలోనే షేర్‌ చేస్తాను అంటూ జెస్సీ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్‌లో బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో జెస్సీ ముందుగా మూవీ ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తుంది. దీంతో జెస్సీకి బెస్ట్‌ విషెస్‌ చెబుతూ పలువురు నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement